
వారఫలాలు ( 22 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి, 2015 వరకు )
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త వ్యూహాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఊహించని ఆహ్వానాలు రాగలవు. మీ సత్తా చాటుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దూరపు బంధువుల ను కలుసుకుంటారు. కొన్ని వ్యవహారాలు నిదానిస్తాయి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు కలసివస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకం. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. ధనవ్యయం. మిత్రులతో వివాదాలు.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. ఇంటాబయటా మీదే పైచేయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. ఆరోగ్య సమస్యలు తీరతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. దీర్ఘకాలిక సమస్య ల నుంచి బయటపడతారు. ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులను ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
మొదట్లో చికాకులు ఎదురైనా క్రమేపీ అనుకూలత. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు కలసి వస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వ్యాపారాలు విస్తరిస్తారు. కళారంగం వారికి సన్మానాలు. వార ం ప్రారంభంలో ధనవ్యయం.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక విషయాలు కాస్త సంతృప్తినిస్తాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలయాల సందర్శన. ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులు అనుకున్న హోదాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. ఆప్తుల నుంచి కీలక సందేశం. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఊహలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. గృహ నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాల విస్తరణ యత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. పారిశ్రామికరంగం వారికి యోగదాయకంగా ఉంటుంది.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
సోదరులతో కొద్దిపాటి వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. వారం ప్రారంభంలో ధనవ్యయం.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పనులు శ్రమానంతరం ఫూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు లాభాలు . ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయ వర్గాలకు సన్మానాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. ఆలయాలు సందర్శిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు న త్తనడకన సాగుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్టలు పెరుగుతాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు.
సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు