వారఫలాలు (3 మే నుంచి 9 మే, 2015 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. దూర ప్రయాణాలు సంభవం. కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా పడతాయి. వారం ప్రారంభంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
కొంతకాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు తీరతా యి. ఆప్తులు సహాయసహకారాలు అందిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయట పడతారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు చిక్కు ల నుంచి బయటపడతారు. రాజకీయ వర్గాలకు నూత నోత్సాహం. చివరిలో వ్యయ ప్రయాసలు, అనారోగ్యం.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆర్థిక లావా దేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సంఘంలో ఆదరణ పొందుతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. . ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే అవకాశం. కళారంగం వారికి సన్మాన, సత్కారాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణం, కొను గోలు యత్నాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక లావా దేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ప్రయాణాలు వాయిదా. వ్యాపారులకు నిరాశ. ఉద్యోగస్తులకు శ్రమ. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మిత్రులతో వివాదాలు. భూ వివాదాలతో చికాకు. వ్యాపారాలలో పెట్టుబడులు సమస్యగా మారవచ్చు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాల విదేశీ పర్యటనలు వాయిదా. కొన్ని బాకీలు వసూలవుతాయి. వాహనయోగం.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. కొత్తగా రుణాలు కూడా చేస్తారు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ఒత్తిడులు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. ముఖ్య నిర్ణయాలకు అనుకూలం.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
చేపట్టిన పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శ్రమ ఫలిస్తుంది. పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. కళారంగం వారికి ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో వివాదాలు. కుటుంబసభ్యులతో వివాదాలు.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కాస్త మందగిస్తుంది. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. దూరప్రయాణాలు సంభవం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. పారిశ్రామికవర్గాలకు కొంత నిరాశ తప్పదు. స్వల్ప ధనలాభం. ఉద్యోగయోగం.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. ధనవ్యయం.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆప్తులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో వివాదాలు.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనా క్రమేపీ అనుకూల పరిస్థితి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వాహనయోగం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళారంగం వారికి ఊహించని సన్మానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
సన్నిహితులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యపరంగా చికాకులు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలలో స్వల్ప ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం చివరిలో శుభవార్తలు.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు