చంద్రబింబం: అక్టోబర్ 05 నుండి 11 వరకు | Funday Astrology of the week: Oct 5 to Oct 11 | Sakshi
Sakshi News home page

చంద్రబింబం: అక్టోబర్ 05 నుండి 11 వరకు

Published Sun, Oct 5 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

Funday Astrology of the week: Oct 5 to Oct 11

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థిక విషయాలలో పురోగతి. వస్తు, వస్త్రలాభాలు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.  కొన్ని వ్యవహారాలలో విజయం. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం మధ్యలో వివాదాలు. ధనవ్యయం.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. కుటుంబపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాహన, గృహయోగాలు. ప్రతిభ చాటుకుంటారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూవివాదాల పరిష్కారం. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు ఉండవచ్చు. అనారోగ్య సూచనలు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. వ్యాపారాలు మందకొడిగానే సాగుతాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. వారం చివరిలో ఆకస్మిక ధనలాభం.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

 పనుల్లో స్వల్ప ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యపరంగా చికాకులు. సోదరులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పనిభారం. కళారంగం వారికి ఒత్తిడులు తప్పవు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధనలాభం.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
 కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. పారిశ్రామికరంగం వారికి అనుకోని ఆహ్వానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
 కొత్త వ్యక్తుల పరిచయం. పనుల్లో విజయం సాధిస్తారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. వాహనాలు, భూములు కొంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు. కళారంగం వారికి లేనిపోని ఒత్తిడులు. వారం చివరిలో  ధన, వస్తులాభాలు. ఉద్యోగయోగం.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 ఈ వారం పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. ఒప్పందాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో ధనలాభం. కొత్త పరిచయాలు.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు నత్తనడకన సాగుతాయి. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపార లావాదేవీలు లాభించవు. ఉద్యోగులకు మార్పులు తప్పవు. కళారంగం వారికి గందరగోళం. వారం మధ్యలో విందువినోదాలు. బాకీలు అందుతాయి.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)

 పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. సోదరులు, బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. మీ శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరం. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొనవచ్చు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. రాజకీయవర్గాలకు లేనిపోని ఒత్తిడులు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
 - సింహంభట్ల సుబ్బారావు,
 జ్యోతిష పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement