ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. | Today Telugu Horoscope On January 25th, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.

Published Sat, Jan 25 2025 12:24 AM | Last Updated on Sat, Jan 25 2025 8:23 AM

Daily Horoscope On 25 January 2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: బ.ఏకాదశి సా.6.32 వరకు తదుపరి ద్వాదశి, నక్షత్రం: జ్యేష్ఠ పూర్తి (24 గంటలు), వర్జ్యం: ఉ.11.35 నుండి 1.15 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.42 నుండి 8.11 వరకు, అమృతఘడియలు: రా.9.44 నుండి 11.25 వరకు.

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం    :  5.47
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం: వ్యయప్రయాసలతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణాలు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. వృత్తులు, వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి.

వృషభం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. కళాకారులకు నూతనోత్సాహం. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. పనుల్లో విజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మిథునం: మీ ఖ్యాతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. వస్తులాభాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలం.

కర్కాటకం: శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. దూరప్రయాణాలు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

సింహం: రాబడికి మించిన ఖర్చులు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కన్య: చిన్ననాటి మిత్రులు కలుస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి.

తుల: ఇంటి బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కష్టానికి తగిన ఫలితం రాదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. సోదరుల నుండి ఒత్తిడులు రావచ్చు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు .

వృశ్చికం: పనులు చకచకా పూర్తి కాగలవు. ఆదాయానికి ఇబ్బందులు తీరతాయి. ఆప్తులు సహకరిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ధనుస్సు: మిత్రులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. పనులలో అవాంతరాలు. రుణయత్నాలు సాగిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.

మకరం: యుక్తిగా సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇతరులకు సాయపడతారు. దైవదర్శనాలు చేసుకుంటారు. పనుల్లో పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.

కుంభం: నూతన ఉద్యోగయత్నాలు సానుకూలం. పొరపాట్లు సరిదిద్దుకుని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి..

మీనం: మీ శ్రమ వృథాగా మిగిలిపోతుంది. ప్రయాణాలు రద్దు కాగలవు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement