
రాశి ఫలాలు ( డిసెంబర్ 14 నుండి 20 వరకు )
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. గృహ, వాహనయోగాలు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతమైన కాలం. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో అనారోగ్యం.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
కొత్త వ్యక్తుల పరిచయం. ఆప్తుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. రావలసిన డబ్బు అందుతుంది. కొన్ని వ్యవహారాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు సఫలం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు అరుదైన ఆహ్వానాలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
పనులు మందగించినా శ్రమానంతరం పూర్తి కాగలవు. బంధువుల సహకారం అందుతుంది. చిరకాల కోరిక నెరవేరుతుంది. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు పైహోదాలు. కళారంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో దూరప్రయాణాలు.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు జరిగే అవకాశం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు రాగలదు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవులు. వారం చివరిలో అనుకోని ధనవ్యయం.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. గృహనిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కళారంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో అనారోగ్యం.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
పరపతి పెరుగుతుంది. ప్రత్యేక గౌరవం పొందుతారు. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామిక వర్గాలకు విదేశీయానం. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. బంధువులతో వివాదాల పరిష్కారం. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహవంతం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతం. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
బంధువులు, మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వాహనయోగం. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ప్రయాణాలు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
చికాకులు ఎదురైనా సర్దుబాటు కాగలవు. ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. విద్యార్థులకు అనుకోని అవకాశాలు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళారంగం వారికి అవార్డులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
బంధువులతో సఖ్యత. ఈవారం విలాసవంతంగా గడుపుతారు. సేవలకు తగిన గుర్తింపు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వివాదాలను నేర్పుతో పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాల వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో పనుల్లో ఆటంకాలు.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
జీవితాశయం నెరవేరుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రశంసలు. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు.
- సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష పండితులు