మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
పనుల్లో జాప్యం జరిగినా పూర్తికాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో చికాకులు. అనారోగ్యం.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. కృషి ఫలించదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులు, మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని వ్యవహారాలలో రాజీపడక తప్పని పరిస్థితి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
రావలసిన సొమ్ము అందక ఇబ్బందిపడతారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి విషయాలలో వివాదాలు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు. కళారంగం వారికి ఒత్తిడులు తప్పవు. వారం మధ్యలో విందువినోదాలు. వాహనయోగం.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు కొత్త అవకాశాలు అందుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో అనారోగ్యం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పనులు చకచకా పూర్తి కాగలవు. ఒక కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారమవుతుంది. భూములు, వాహనాలు కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తికాగలవు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు, రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. ధనవ్యయం.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత ్తహోదాలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ప్రారంభంలోని చికాకులు క్రమేపీ తొలగుతాయి. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో అనుకూల పరిస్థితి. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
గందరగోళ పరిస్థితులు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం. విద్య, ఉద్యోగావకాశాలు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు కొత్త పదవులు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
పనులు నెమ్మదిస్తాయి. బంధువులు, మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో స్వల్పలాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
కుటుంబంలో చికాకులు తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కివస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజకంగా ఉంటాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. రావలసిన డబ్బు అందుతుంది. ఇంతకాలం పడిన శ్రమఫలిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు అనుకున్నవిధంగా లాభిస్తాయి. ఉద్యోగులు సమర్థత చాటుకుంటారు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం.
- సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష పండితులు
చంద్రబింబం: సెప్టెంబర్ 21 నుండి 27 వరకు
Published Sun, Sep 21 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM
Advertisement
Advertisement