మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. పనుల్లో అవరోధాలు తొలగుతాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
రావలసిన సొమ్ము అందుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
పనులు నె మ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు కాస్త చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో శుభవార్తలు. ధన,వస్తులాభాలు.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. వాహనాలు, భూములు కొంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు పుంజుకుని లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. వారం చివరిలో వ్యయప్రయాసలు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
కొత్త పనులు చేపడతారు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
పనుల్లో తొందరపాటు. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల యత్నాలు మంద కొడిగా సాగుతాయి. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఇంటాబయటా చికాకులు తప్పకపోవచ్చు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో విందువినోదాలు. భూములు, వాహనాలు కొంటారు. ఆహ్వానాలు అందుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుదల పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలలో ముంద డుగు వేసి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యూహాలతో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అనుకూల ర్యాంకులు దక్కుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు శ్రమ తగ్గి ఉపశమనం లభిస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. కీలక నిర్ణయాలకు తగిన సమయం. పనుల్లో విజయం సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఇంతకాలం పడిన శ్రవ ు ఫలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు కొంతవరకూ ఫలిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. పదవీయోగాలు. వారం మధ్యలో ధనవ్యయం.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పనులు దిగ్విజయంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. కళారంగం వారు ఆశించిన అవకాశాలు దక్కించుకుంటారు.
- సింహంభట్ల సుబ్బారావు,
జ్యోతిష పండితులు
చంద్రబింబం: ఏప్రిల్ 20 నుండి 26 వరకు
Published Sun, Apr 20 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 6:15 AM
Advertisement
Advertisement