సౌరబలం: సెప్టెంబర్ 8 నుండి 14 వరకు | astrology of the week september 8th to september 14 | Sakshi
Sakshi News home page

సౌరబలం: సెప్టెంబర్8 నుండి 14 వరకు

Published Sun, Sep 8 2013 3:04 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM

సౌరబలం: సెప్టెంబర్ 8 నుండి 14 వరకు

సౌరబలం: సెప్టెంబర్ 8 నుండి 14 వరకు

మేషం (మార్చి 21-ఏప్రిల్ 20)
 ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. పనులను విజయవంతంగా ముగిస్తారు. ప్రత్యేకత చాటుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. విద్యార్థులు కోర్సులు దక్కించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శనం. వారం చివరిలో ధనవ్యయం.
 
 వృషభం (ఏప్రిల్ 21-మే 20)
 యుక్తితో సమస్యల నుంచి బయటపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాలు పరిష్కార మవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వారం ప్రారంభంలో  సోదరులతో వివాదాలు. ఆరోగ్యభంగం.
 
 మిథునం (మే 21-జూన్ 21)
 కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. అవసరాలకు డబ్బు అందుతుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. నిరుద్యోగుల యత్నాలు కొలిక్కి వస్తాయి. వారం మధ్యలో వాహనయోగం.
 
 కర్కాటకం (జూన్ 22-జూలై 23)
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. శ్రమ ఫలించే సమయం. ఆత్మీయుల సహాయం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
 
 సింహం (జూలై 24-ఆగస్టు 23)
 పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. రుణయత్నాలు సాగిస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు చోటుచేసుకోవచ్చు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు.
 
 కన్య (ఆగస్టు 24-సెప్టెంబర్ 23)
 కొత్త పనులు ప్రారంభిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గృహ నిర్మాణయత్నాలు సాగిస్తారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో అనారోగ్యం.
 
 తుల (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23)
 ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సమస్యలు తీరి ఒడ్డున పడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం.
 
 వృశ్చికం (అక్టోబర్ 24-నవంబర్ 22)
 ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. పరిచయాలు పెరుగుతాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. వారం చివరిలో వివాదాలు. ధనవ్యయం.
 
 ధనుస్సు (నవంబర్ 23-డిసెంబర్ 21)
 దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. కళాకారులకు పురస్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.
 
 మకరం (డిసెంబర్ 22-జనవరి 20)
 బంధువుల నుంచి ఆహ్వానాలు. రావలసిన సొమ్ము అందుతుంది. కోర్టు కేసులు పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. భూములు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు ఉన్నతర్యాంకులు. వారం ప్రారంభంలో అనారోగ్యం. దూరప్రయాణాలు.
 
 కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19)
 ఆర్థిక విషయాలలో అభివృద్ధి. ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. ఆలయాలు సంద ర్శిస్తారు. వారం చివరిలో వివాదాలు. ధనవ్యయం.
 
 మీనం (అధిపతి గురువు, ఫిబ్రవరి 20-మార్చి 20)
 ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ప్రయత్నాలకు కుటుంబసభ్యుల చేయూత లభిస్తుంది. నూతన వస్తు, వస్త్రలాభాలు. కాంట్రాక్టులు చేపడతారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు.  

 - సింహంభట్ల సుబ్బారావు
 
 మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
ఆశాభోంస్లే
 పుట్టినరోజు: సెప్టెంబర్ 8
 
 ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
 దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. పరిచయాలు విస్తరిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలకు లోటుండదు. గురుబలం మీకు తోడ్పడుతుంది. మధ్యలో ఆరోగ్య సమస్యలు ఎదురైనా సర్దుబాటు కాగలవు. మొండిబాకీలు సైతం వసూలవుతాయి. మీసేవలకు గుర్తింపుగా పురస్కారాలు, సన్మానాలు పొందుతారు. కళాకారులకు మరింత అనుకూల కాలం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement