వారఫలాలు (19 జూలై నుంచి 25 జూలై, 2015 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనులలో పురోగతి కనిపిస్తుంది. యుక్తిగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు తథ్యం. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నేరేడు, ఎరుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. బాధ్యతలు పెరుగు తాయి. ఆలోచనలు కలసిరావు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. బంధువులు, మిత్రులతో మాటపడాల్సిన సమయం. వ్యాపారాల విస్తరణ యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు చికాకులు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. నీలం, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొన్ని కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆలోచనలు అంతగా కలసిరావు. ఇంటాబయటా సమస్యలు. ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కళారంగం వారికి అవకాశాలు దూరమయ్యే సూచనలు. పసుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కొత్త రుణాల వేటలో పడతారు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అసంతృప్తి. ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వ్యాపారాల విస్తరణ యత్నాలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు. పారిశ్రామికవర్గాల వారికి విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. తెలుపు, గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త ఆశలు చిగురిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు పదవులు వరిస్తాయి. ఎరుపు, బంగారురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. కాంట్రాక్టుల కోసం చేసే యత్నాలు ముందుకు సాగవు. నిరుద్యోగులకు ఒక ప్రకటన కాస్త ఊరట కలిగిస్తుంది. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు పెరుగుతాయి. కళారంగం వారికి చికాకులు. ఆకుపచ్చ, ఆకాశనీలం రంగులు ధరించండి. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో పురోగతి. లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభకరం. ఉద్యోగులకు హోదాలు. నేరేడు, తెలుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వస్తు, వాహన లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించవచ్చు. లేత గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గుతుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఎరుపు, కాఫీరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. రుణాలు చేయాల్సివస్తుంది. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి విషయంలో బంధువులతో వివాదాలు నెలకొనవచ్చు. పాతమిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు కొంత నిరాశ. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు మీదపడతాయి. కళారంగం వారికి చికాకులు. నీలం, లేత ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో 11సార్లు ప్రదక్షిణలు చేయండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు అదనపు విధులు. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. నలుపు, చాక్లెట్‌రంగులు, ద క్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వర స్వామి స్తోత్రాలు పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో విశేష ఆదరణ. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరం. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళారంగం వారికి అవార్డులు అందుతాయి. గోధుమ, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు,జ్యోతిష్య పండితులు