వారఫలాలు ( 8 మార్చి నుంచి 14 మార్చి, 2015 వరకు ) | astrology of the week on march 08 to march 14 | Sakshi
Sakshi News home page

వారఫలాలు ( 8 మార్చి నుంచి 14 మార్చి, 2015 వరకు )

Published Sun, Mar 8 2015 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

వారఫలాలు ( 8 మార్చి నుంచి 14 మార్చి, 2015 వరకు )

వారఫలాలు ( 8 మార్చి నుంచి 14 మార్చి, 2015 వరకు )

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు హోదాలు మరింతగా పెరిగే అవకాశం. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం.
 

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
శుభకార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. సేవలకు తగిన గుర్తింపు. భూవివాదాల పరిష్కారం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు. సోదరులు, సోదరీలతో సఖ్యత. వ్యాపారాలు అభివృద్ధిదాయకం. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు అంచనాలు నిజమవుతాయి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయ వర్గాలకు పదవులు దక్కుతాయి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణబాధలు తొలగుతాయి. కొత్త వ్యక్తులు పరిచయమ వుతారు. మీ శ్రమకు ఫలితం దక్కుతుంది. ప్రత్యర్థులు సైతం మీ దారికి వస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళారంగం వారికి అవకాశాలు మరింతగా పెరుగుతాయి. వారం చివరిలో వివాదాలు. అనారోగ్యం.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు చేస్తారు.  ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వ్యాపారాలు సామాన్యం గా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. కుటుంబ సౌఖ్యం.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఈ వారం పట్టింది బంగార మే అన్నట్టుగా ఉంటుంది. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో కొలిక్కి వస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి. రాజకీయ వర్గాలకు పదవులు దక్కుతాయి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషులు దగ్గరవుతారు. భూములు, వాహనాలు కొంటారు. వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఆశాజనకం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో అనారోగ్యం.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక లాభాలు. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు. వారం మధ్యలో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పనులు అనుకున్న విధంగా  పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల సహకారం. సోదరులతో విభేదాలు తొలగుతాయి. భూవివాదాల పరిష్కారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీ మాటకు ఎదురుండదు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక వర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
మొదట్లో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ తొలగు తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. కొన్ని రుణాలు తీరతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు. రాజకీయ వర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో వివాదాలు.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొన్ని పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి కాస్త కుదుటపడుతుంది. అందరిలోనూ ప్రత్యేకత నిలుపుకుంటారు. కోర్టు కేసుల నుంచి విముక్తి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు. వారం మధ్యలో ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement