‘ఎంఎల్‌ఏ’ ఫస్ట్ లుక్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఎంఎల్‌ఏ(మంచి లక్షణాలున్న అబ్బాయ్) సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. మంగళవారం ఫస్ట్‌లుక్ ఫొటోను తన ట్విటర్‌లో పేజీలో కళ్యాణ్ రామ్ పోస్ట్ చేశారు. రేపు(జూలై 5) ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. స్టైలిష్ లుక్‌తో ఫ్యాన్స్‌కు నచ్చేలా ఇందులో కనిపించారు.
ఈ సినిమాతో ఉపేంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. బ్లూ ప్లానెట్ పతాకంపై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌కు జోడిగా కాజల్ నటిస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇజం’ సినిమాలో ఇంతకుముందు కళ్యాణ్ రామ్ నటించారు.