
ఉపాధ్యాయుల చేతుల్లో విద్యార్థుల భవిష్యత్
సంస్థాన్ నారాయణపురం: విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని రాష్ట్ర సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ అన్నారు. మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు గురువారం సంస్థాన్ నారాయణపురంలో సన్మానం చేశారు. అంతకుముందు జయశంకర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వళన చేశారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదన్నారు. విద్యార్థులను సరైన దారిలో నడిపించి, వారకి ఒక లక్ష్యం ఏర్పాటు చేసి, ఆ దిశగా అడుగులు వేయించే బాధ్యత కూడా ఉపాధ్యాయులదేనన్నారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన వారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాంకుడోతు బుజ్జి, జెడ్పీటీసీ సభ్యుడు బొల్ల శివశంకర్, ఎంఈఓ జి.వెంకటేశ్వర్లు తదితరులున్నారు.