ఐడియాలు రావాలంటే చేతులు కడుక్కోవాలట!! | Cleaning your hands can help you focus on new ideas | Sakshi
Sakshi News home page

ఐడియాలు రావాలంటే చేతులు కడుక్కోవాలట!!

Published Wed, Jun 14 2017 10:46 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

ఐడియాలు రావాలంటే చేతులు కడుక్కోవాలట!!

ఐడియాలు రావాలంటే చేతులు కడుక్కోవాలట!!

టోరంటో: తినేముందు చేతులు ఎందుకు కడుక్కోవాలి? శుభ్రంగా ఉండడానికి.. చేతులపై ఉండే క్రిములు తొలగిపోవడానికి కడుక్కోవాలనే విషయం అందరికీ తెలిసిందే. కానీ కొత్త ఆలోచనలు రావాలంటే చేతులు కడుక్కోవాలనే విషయం మీకు తెలుసా? శాస్త్రవేత్తలు మాత్రం ఇదే చెబుతున్నారు. చేతులు కడుక్కోవడం వల్ల మురికి తొలగిపోవడమే కాకుండా పాత ఆలోచనలు దూరమై, కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయంటున్నారు. కెనడాకు చెందిన యూనివర్సిటి ఆఫ్‌ టొరంటో శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

చేతులు కడుక్కున్న వెంటనే పాత నిర్ణయాలను పక్కకునెట్టి కొత్త లక్ష్యాలకోసం మన మెదడు ఫ్రెష్‌గా ఆలోచిస్తుందంటున్నారు. పరిశోధనలో భాగం గా కొంతమందిని ఎంపికచేసి, వారికి ప్రేరేపణ కలిగించే  నాలుగురకాల పరీక్షలను నిర్వహించారు. అంతకుముందు ఎంపికచేసిన వారిలో కొందరిని చేతులు కడుక్కోమని చెప్పా రు. అలా చేతులు కడుక్కున్నవారు పరీక్షలను విజయవంతంగా పూర్తిచేశారట. అందుకు కారణం.. వారిలో సానుకూల భావనలు పెరగడమేనని, అంతకు ముందున్న పాత ఆలోచనలు సమసిపోవడమేనని శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement