అరచేతిలో... ఎర్ర మందారాలు! | Red palm ... ready! | Sakshi
Sakshi News home page

అరచేతిలో... ఎర్ర మందారాలు!

Published Wed, Jun 25 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

అరచేతిలో... ఎర్ర మందారాలు!

అరచేతిలో... ఎర్ర మందారాలు!

డిజైన్
 
 ఆషాఢం అతివలకు చాలా ఇష్టమైన మాసం. గోరింటాకుతో ఎర్రగా పండిన అరచేతులను చూసుకుని మురిసిపోతుంటారు. రకరకాల డిజైన్ల కోసం మెహెందీ కోన్స్ వాడకం పెరిగిన ఈ రోజుల్లో కోన్స్ నాణ్యతనూ పరీక్షించి ఎంచుకోవాలి. మెహెందీ కోన్స్‌తో చేతులు, పాదాలపై అందంగా వేసుకున్న డిజైన్లు ఎరుపుదనం నింపుకోవాలంటే...
 
 మెహెందీ డిజైన్‌ను తీర్చిదిద్దిన 5 నిమిషాలకు చిక్కని నిమ్మరసం, పంచదార సిరప్‌లో దూది ఉండను ముంచి, ఆరిన మెహెందీ డిజైన్‌పై అద్దాలి. దీంతో డిజైన్ రంగు తేలుతుంది.
 
 చాలామంది గోరింటాకు, పొడితో వేసుకున్న డిజైన్లు రాత్రిమొత్తం ఉంచేస్తుంటారు. డిజైన్ ఎరుపురంగులోకి మారడానికి 4 నుంచి 6 గంటలు సమయం సరిపోతుంది.
 
 మెహెందీ డిజైన్ పొడిబారాక నీళ్లతో కడగకుండా, కేవలం పై పొరను బ్రష్‌తో తొలగించి, నూనె రాసుకోవాలి.
 
 పండిన చేతులను శుభ్రపరుచుకోవడానికి కనీసం 24 గంటల వరకు సబ్బును ఉపయోగించకూడదు. అలా చేస్తే డిజైన్ త్వరగా పోదు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement