సాకే నాగేంద్ర
అనంతపురం: రెండు కుటుంబాల పోషణ భారమై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... నగరంలోని నవోదయ కాలనీకి చెందిన సాకే నాగేంద్ర (42) క్రిటి డ్రిప్ కంపెనీలో జిల్లా కో–ఆర్డినేటర్‌గా పనిచేసేవాడు. ఇతనికి భార్య జ్ఞానేశ్వరి, కొడుకు, ఇద్దరు కుమార్తెలున్నారు. మూడేళ్ల క్రితం బదిలీపై చిత్తూరుకు వెళ్లినప్పుడు ఆ ప్రాంతానికి చెందిన దుర్గాభవానీతో పరిచయం ఏర్పడి సహజీవనానికి దారి తీసింది. తిరిగి అనంతపురానికి వచ్చినప్పుడు ఆమెను పిలుచుకువచ్చి హౌసింగ్ బోర్డులోని ఎంఐజీ బస్టాఫ్ వద్ద ఉన్న ఓ ఇంటిలో ఉంచాడు.
ఈ క్రమంలోనే రెండు కుటుంబాల పోషణ భారమైంది. ఆదివారం ఉదయం దుర్గాభవానీ బెడ్‌రూంలోకి వెళ్లిన నాగేంద్ర ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో వెనుక వీధిలో నివాసముంటున్న అతని స్నేహితుడికి విషయం తెలిపింది. అతని ద్వారా సమాచారం అందుకున్న రెండో పట్టణ ఎస్‌ఐ జయరాం నాయక్, సిబ్బంది అక్కడకు చేరుకుని తలుపులు బద్ధలుగొట్టి లోపలకు వెళ్లి పరిశీలించారు. అప్పటికే ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని నాగేంద్ర మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ప్రియురాలు మాట్లాడలేదని మరో యువకుడు...
ప్రియురాలు మాట్లాడకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఒడిశాలోని కసోటి గ్రామానికి చెందిన బికాస్ మాలిక్ (19)గా అనంతపురం రెండో పట్టణ పోలీసులు తెలిపారు. నగరంలోని ఎంపోరియంలో వంట మనిషిగా పనిచేసే అతను కొన్ని రోజులుగా ప్రియురాలు మాట్లాడక పోవడంతో గత డిసెంబర్ 30న విషపూరిత ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. మిత్రులు గమనించి ఆస్పత్రిలో చేరి్పంచారు. చికిత్స పొందుతూ ఆదివారం అతను మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment