అనంతపురం (సప్తగిరి సర్కిల్): సామాజిక న్యాయభేరి బస్సు యాత్రను అడ్డుకుంటామని టీడీపీ నాయకులు చెప్పడం సిగ్గుచేటని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్‌కుమార్ యాదవ్, రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న ధ్వజమెత్తారు. బుధవారం అనంతపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో హరీష్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికపరంగా అండగా నిలిచి ఆదుకుంటుంటే టీడీపీ నాయకులు ఓర్వలేక బురద జల్లుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంతో సహా చంద్రబాబు కోటలు బీటలు వారేలా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. 2024 ఎన్నికల్లోనూ టీడీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
బీసీ లోకానికి ఊపిరి పోశారు
రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న మాట్లాడుతూ.. బీసీ లోకానికి ఊపిరి పోసిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిదే అన్నారు. రాజ్యసభ సీట్లను తన కులం వారికి ఇచ్చుకోవడంతో పాటు వాటిని రూ.వందల కోట్లకు అమ్ముకున్న నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు. రాష్ట్రంలోని 139 బీసీ కులాలను గుర్తించి.. వాటికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన మహనీయుడు జగనన్న అని కొనియాడారు. సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సమావేశంలో కార్పొరేటర్ శ్రీనివాసులు, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ అల్లీపీరా, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment