సామాజిక న్యాయభేరీ: నాల్గో రోజు బస్సు యాత్ర | Ysrcp Samajika Bhari Fourth Day Bus Yatra Started | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయభేరీ: నాల్గో రోజు బస్సు యాత్ర

Published Sun, May 29 2022 10:44 AM | Last Updated on Sun, May 29 2022 8:03 PM

Ysrcp Samajika Bhari Fourth Day Bus Yatra Started - Sakshi

Updates..
నంద్యాలలో ప్రారంభమైన ఆదివారం నాటి సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర.. అనంతపురానికి చేరుకుంది. మంత్రులకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర  అనంతపురంలో జరిగిన బహిరంగ సభతో ముగిసింది. సభలో పలువురు మంత్రులు మాట్లాడారు.

01:05PM
నంద్యాలలో ప్రారంభమైన ఆదివారం నాటి సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర.. మధ్యాహ్నానికి కర్నూలుకు చేరుకుంది. పాణ్యం మీదుగా కర్నూలు సి క్యాంప్‌కు బస్సు యాత్ర చేరుకుంది. కర్నూలులో బస్సుయాత్రకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్‌ ఖాన్‌, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూల్‌ మేయర్‌ బివై రామయ్య, కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాల నాగిరెడ్డి తదితరులు బస్సుయాత్రకు ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. 

ఎన్నికల కోసం మాత్రమే బాబు వాడుకుని వదిలేశారు
బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఎన్నికల కోసం మాత్రమే  చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేశారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. మహనీయుల ఆశయాలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ర్డె కొనసాగిస్తున్నారని, బడుగుల అభివృద్ధి కోసం సీఎం జగస్‌ సముచిత స్థానం కల్పించి, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. బడుగుల అభివృద్ధి కోసం డాక్టర్‌ బీఆర్‌  అంబేద్కర్‌లాగా సీఎం జగన్‌ వచ్చారన్నారు. పేద ప్రజల కోసం సామాజిక న్యాయం చేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

చంద్రబాబు, టీడీపీ పని అయిపోయింది..
ఇక చంద్రబాబు, టీడీపీ పని అయిపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బస్సుయాత్రలో భాగంగా మీడియాతో మాట్లాడిన బొత్స.. మహానాడులో అసభ్యంగా, చెండాలంగా మాట్లాడరని, మహానాడులో పార్టీ విధానాలు చెప్పకుండా అసభ్యంగా మాట్లాడరన్నారు బొత్స. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో క్విట్‌ చేశారన్నారు. అలాగే బాలకృష్టను ప్రజలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

10.30 AM

వైఎస్సారీసీ సామాజిక న్యాయభేరీలో భాగంగా నాలుగో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. నంద్యాల నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర సాయంత్రానికి అనంతపురంలో బహిరంగ సభతో ముగియనుంది. 

నాలుగో రోజు యాత్ర బస్సు యాత్ర ప్రారంభానికి ముందు డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. ‘‘ఆంధ‍్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఒక్కరే బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారు. అణగారిన వర్గాల వారి సంక్షేమం కోసం సీఎం జగన్‌ కృషి చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఒక క్యాలెండర్‌ పెట్టి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైన సీఎం జగన్‌ మాత్రమే. టీడీపీ హయాంలో ఒక్క మైనార్టీకి కూడా కేటినెట్‌లో చోటు కల్పించలేదు’’ అని విమర్శించారు.

అనంతరం కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. అణగారిక వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌దే. కేబినెట్‌లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం వైఎస్‌ జగన్‌ అవకాశం కల్పించారు. మనమంతా కలిసి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్దిచెప్పాలి’ అని పేర్కన్నారు.

ఇది కూడా చదవండి: మూడు సార్లు ఓడితే పార్టీ టికెట్‌ ఇచ్చేది లేదు : నారా లోకేష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement