
కదిరి(అనంతపురం): ఎట్టకేలకు కదిరికి వచ్చేశా.. నా దేశం చేరుకుంటానో లేదో..నా తల్లిదండ్రులను ఇక చూస్తానో లేదోనని భయంగా ఉండేది..భారత్‌లో అడుగు పెట్టగానే నాకు ఎక్కడ లేని ఆనందం కలిగింది..’ అని ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న కదిరి చెందిన షేక్ రాఖియా అన్నారు. కదిరి పట్టణానికి చెందిన బోరు బండ్ల నిర్వాహకుడు ఘని కుమార్తె అయిన ఆ విద్యార్థిని ఉక్రెయిన్‌లోని విన్నిషియా నగరంలో చదువుతోంది.
ఆ దేశంపై రష్యా దాడి మొదలైనప్పటి నుంచి ఆమెతో పాటు ఉన్న ఏపీకి చెందిన మరికొందరు మెడిసిన్ విద్యార్థులు అక్కడ బిక్కుబిక్కుమంటూ గడిపారు. తాగడానికి మంచినీళ్లు దొరకడం కూడా కష్టంగా ఉండేదని ఆమె అంటున్నారు. బాంబుల శబ్ధం వినబడగానే భయం వేసేదని, ఒకానొక దశలో మన దేశం వదిలి ఇక్కడికి ఎందుకొచ్చామా..? అనిపించిందని ఆవేదన వ్యక్త పరిచారు. ఆ దేశం నుంచి విమానంలో బుధవారం ఢిల్లీ చేరుకుని, మరో విమానంలో గురువారం సాయంత్రం బెంగళూరు చేరుకుంది. అక్కడి నుంచి తల్లిదండ్రులతో కలిసి కారులో గురువారం రాత్రి బాగా పొద్దు పోయాక కదిరిలోని తమ ఇంటికి క్షేమంగా చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment