Bombay Blood Group to Anantapur Woman - Sakshi
Sakshi News home page

అనంతపురం మహిళకు బాంబే బ్లడ్‌ గ్రూపు రక్తదానం

May 7 2023 8:44 AM | Updated on May 7 2023 10:56 AM

Bombay Blood Group To Anantapur Woman - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): లక్షల్లో ఒకరికి ఉండే బాంబేబ్లడ్‌ గ్రూపు రక్తాన్ని కర్నూలులో ఓ దాత ఇవ్వగా.. దానిని అనంతపురంలోని ఓ మహిళకు దానంగా పంపించారు. అనంతపురంలో ని జయలక్ష్మి అనే గర్భిణి ఆరోగ్యం విషమించి రక్తం అవసరమైంది. ఆమెది బాంబే బ్లడ్‌ గ్రూ పు కావడంతో స్థానికంగా లభించడం కష్టమైంది.

ఈ పరిస్థితిల్లో ఆమె కుటుంబ సభ్యులు కర్నూలులోని డేనియల్‌ రాజు ఫౌండేషన్‌ ఫౌండర్‌ సుమన్‌కు ఫోన్‌ చేసి సాయం కోరారు. వెంటనే ఆయన నగరంలోని కర్నూలు బ్లడ్‌ బ్యాంక్‌కు ఫోన్‌ చేసి అక్కడ నిల్వ ఉన్న బాంబే బ్లడ్‌ గ్రూపు రక్తాన్ని అనంతపురానికి పంపించారు. అనంతపురంలో ఆ రక్తాన్ని జయలక్ష్మికి ఎక్కించిన అనంతరం ఆమె కోలుకుంటున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వారం వ్యవధిలో ఇద్దరు రోగులకు బాంబే బ్లడ్‌ గ్రూపు రక్తాన్ని అందించినట్లు సుమన్‌ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement