Bombay blood group
-
అనంతపురం మహిళకు బాంబే బ్లడ్ గ్రూపు రక్తదానం
కర్నూలు(హాస్పిటల్): లక్షల్లో ఒకరికి ఉండే బాంబేబ్లడ్ గ్రూపు రక్తాన్ని కర్నూలులో ఓ దాత ఇవ్వగా.. దానిని అనంతపురంలోని ఓ మహిళకు దానంగా పంపించారు. అనంతపురంలో ని జయలక్ష్మి అనే గర్భిణి ఆరోగ్యం విషమించి రక్తం అవసరమైంది. ఆమెది బాంబే బ్లడ్ గ్రూ పు కావడంతో స్థానికంగా లభించడం కష్టమైంది. ఈ పరిస్థితిల్లో ఆమె కుటుంబ సభ్యులు కర్నూలులోని డేనియల్ రాజు ఫౌండేషన్ ఫౌండర్ సుమన్‌కు ఫోన్ చేసి సాయం కోరారు. వెంటనే ఆయన నగరంలోని కర్నూలు బ్లడ్ బ్యాంక్‌కు ఫోన్ చేసి అక్కడ నిల్వ ఉన్న బాంబే బ్లడ్ గ్రూపు రక్తాన్ని అనంతపురానికి పంపించారు. అనంతపురంలో ఆ రక్తాన్ని జయలక్ష్మికి ఎక్కించిన అనంతరం ఆమె కోలుకుంటున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వారం వ్యవధిలో ఇద్దరు రోగులకు బాంబే బ్లడ్ గ్రూపు రక్తాన్ని అందించినట్లు సుమన్ చెప్పారు. -
అత్యంత అరుదైన రక్తవర్గం బాంబే బ్లడ్ గ్రూప్
ఈ మధ్యనే మైన్మార్‌లో ఒక మహిళ గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఆమెది బాంబే బ్లడ్ గ్రూప్ కావడంతో ఆ దేశంలో ఎక్కడా ఆ గ్రూపు రక్తం దొరకలేదు. దీంతో ఆమె కోసం రెండు యూనిట్ల బాంబే బ్లడ్ గ్రూప్ రక్తాన్ని భారత్ నుంచి మైన్మార్ పంపించారు. ఆ దేశంలో రక్తం దొరక్కపోవడంతో మైన్మార్‌లోని యాంగూన్ ఆస్పత్రి డాక్టర్లు భారత్‌లో ఉన్న సంకల్ప్ ఇండియా సంస్థను సంప్రదించారు. ఈ ఫౌండేషన్ బాంబే బ్లడ్ ఉన్న బ్లడ్ బ్యాంకులు, డోనర్స్‌ను రక్తం అవసరమైన వారు సంప్రదించేలా చేస్తుంది. http://www.bombaybloodgroup.org/ వెబ్సైట్ ద్వారా వారికి రక్తం అందేలా చూస్తుంది. మైన్మార్ కేసులో ఫౌండేషన్ కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న బ్లడ్ బ్యాంకును సంప్రదించడంతో వారి పని సులువైంది. అరుదుగా... సాధారణంగా రక్తం అవసరమైతే బ్లడ్ బ్యాంకులను సంప్రదిస్తారు. లేదా చుట్టుపక్కల ఎవరైనా డోనర్ ఉంటే వారి నుంచి తీసుకుంటారు. కానీ ‘బాంబే’ బ్లడ్ గ్రూప్ విషయంలో మాత్రం కష్టం. ఎందుకంటే భారతదేశంలో సుమారు 10 వేల మందిలో ఒకరు మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ కలిగినవారు ఉన్నారట. ‘ఈ గ్రూప్ వాళ్లను వెతకడం చాలా కష్టం. సాధారణ పరీక్షల వల్ల బాంబే బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకోలేం. అందుకే చాలా మందికి తమది బాంబే బ్లడ్ గ్రూప్ అని తెలీదు. రక్తం ఎక్కిస్తున్న సమయంలో ‘ఓ’ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పుడే వారికి బ్లడ్ గ్రూప్ తెలుస్తుంది. ఎలా గుర్తిస్తారు? ఈ గ్రూపు మనలో ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ఒక ‘ఓ’ సెల్ పరీక్ష చేయాలి. రక్తం ‘ఓ’ బ్లడ్ గ్రూప్‌కు సంబంధించినది అయితే, ఆ పరీక్షలో రియాక్షన్ రాదు. కానీ ‘బాంబే’ బ్లడ్ గ్రూప్‌లో యాంటీబాడీస్ ఉండడం వల్ల ‘ఓ’ సెల్‌తో కూడా రియాక్షన్ ఉంటుంది. దాంతో అది ‘బాంబే’ గ్రూప్ అని తెలుస్తుంది. ఆ రక్తం గురించి తెలుసుకోడానికి యాంటీ కేపిటెల్ ‘ఎ’ లాక్టిన్ టెస్ట్ కూడా చేస్తారు. బాంబే బ్లడ్ గ్రూప్ అరుదైనది కాబట్టి... క్రయో ప్రిజర్వేషన్ అనే ఒక టెక్నిక్ ద్వారా ఆ రక్తాన్ని నిల్వ చేస్తారు. ఈ పద్ధతిలో రక్తాన్ని చాలా తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచుతారు. భిన్నంగా ఎందుకంటే..? బాంబే బ్లడ్ గ్రూప్ మిగతా బ్లడ్ గ్రూపులకంటే భిన్నంగా ఉండడానికి ప్రత్యేక కారణం ఉంది. మన రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాల్లో కొన్ని షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఎవరి బ్లడ్ గ్రూప్ ఏదో అవే నిర్ధారిస్తాయి. ఈ మాలిక్యూల్స్ నుంచి ‘కేపిటల్ హెచ్ యాంటీజన్’ తయారవుతుంది. దానివల్ల మిగతా యాంటీజెన్ ఎ, బి తయారయ్యి బ్లడ్ గ్రూప్ ఏర్పడుతుంది. బాంబే బ్లడ్ గ్రూప్ వారిలో షుగర్ మాలిక్యూల్స్ తయారు కాలేవు. అందుకే అందులో ‘కేపిటల్ హెచ్ యాంటిజెన్’ ఉండదు. అవి ఎలాంటి బ్లడ్ గ్రూపులోకి రాదు. కానీ, ఆ రక్తం ఉన్న వారి ప్లాస్మాలో యాంటీబాడీ ఎ, బి, హెచ్లు ఉంటాయి. ఈ బ్లడ్ గ్రూపు ఉన్న వారి జీవితం పూర్తిగా మామూలుగా ఉంటుంది.– విజయ దిలీప్ పోకల బాంబే అనే పేరు ఎలా వచ్చింది అన్ని బ్లడ్ గ్రూపులు ఇంగ్లిష్ అల్ఫాబెట్స్ ఎ, బి, ఓ లాంటి పేర్లతో ఉంటాయి. కానీ ఈ బ్లడ్ గ్రూప్ ఒక నగరం పేరుతో ఉంది. దీనికి ఒక ప్రత్యేకమైన ఒక కారణం ఉంది. మొట్టమొదట దీనిని మహారాష్ట్ర రాజధాని బాంబే (ప్రస్తుతం ముంబై)లో గుర్తించారు. వైఎం భెండె 1952లో ఈ గ్రూప్ రక్తం కనుగొన్నారు. ఇప్పుడు కూడా ఈ గ్రూప్ రక్తం ఉన్నవారు ఎక్కువగా ముంబైలోనే కనిపిస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా కనిపించడానికి వంశపారంపర్యమే కారణం. ప్రస్తుతం బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నారు. -
బాంబే గ్రూపు రక్తం కోసం ఎదురుచూపులు..
అరుదైన బాంబే గ్రూపు రక్తం కోసం ప్రాణాపాయస్ధితిలో రోగి ఎదురుచూస్తోంది. మిలియన్ ప్రజల్లో కేవలం నలుగురికి మాత్రమే ఉంటే ఈ రకం బ్లడ్‌గ్రూపు రక్తం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి పాలనాయంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. అరుదైన బాంబే గ్రూపు రక్తాన్ని సేకరించి రోగి ప్రాణాలు కాపాడేందుకు ఆస్పత్రి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమారం గ్రామానికి చెందిన విజయలక్ష్మీ, ఆదంలు భార్యభర్తలు. రెండో సారి గర్భం దాల్చిన విజయలక్ష్మీకి స్థానిక జిల్లా వైద్యులు వైద్యసేవలు అందించారు. అమెది అత్యంత అరుదైన బాంబే బ్లడ్గ్రూపని తేలడంలో ఈనెల 13వ తేదిన గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. తల్లి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడడంతో శస్ర్తచికిత్స చేసి ఆడ శిశువును బయటకు తీశారు. అప్పటికే శిశువు మృతి చెందింది. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావమైంది. తక్షణమే రెండు బ్యాటిళ్ల రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి. అయితే అమె రక్తానికి మ్యాచ్ అయ్యే బాంబే బ్లడ్ గ్రూపు రక్తం అందుబాటులో లేదు. శతవిధాల ప్రయత్నించగా చార్మినార్ తలసేమియా బ్లడ్‌బ్యాంకులో ఒక బ్యాటిల్ రక్తం ఉందని తెలుసుకుని తక్షణమే అక్కడి నుంచి కొలుగోలు చేశారు. మరో బ్యాటిల్ రక్తం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతంలోనే విజయలక్ష్మీ మోకాలిచిప్పకు శస్ర్తచికిత్స అవసరమైన నేపధ్యంలో ఆమెది అత్యంత అరుదైన బాంబే బ్లడ్‌గ్రూపు రక్తంగా వైద్యులు గుర్తించారు. నిమ్స్ ఆస్పత్రిలో నెలరోజుల పాటు వేచిఉన్న తర్వాత బాంబే బ్లడ్‌గ్రూపు రక్తాన్ని ముంబై నుంచి సేకరించిన అనంతరం శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రి అధికారులు ముంబైలోని మహాత్మగాంధీ సేవసమితి బ్లడ్‌బ్యాంకు నిర్వాహకులను సంప్రదిస్తున్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న విజయలక్ష్మీ ప్రాణాలు కాపాడేందుకు తమవంతు కషిచేస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ జేవీరెడ్డి తెలిపారు. ఈ రకం రక్తాన్ని గుర్తించేందుకు గాంధీ బ్లడ్‌బ్యాంకులో తగిన వైద్యపరికరాలు ఉన్నాయని, ఇక్కడకు వచ్చే రక్తదాతల్లో బాంబే బ్లడ్‌గ్రూప్ రక్తం ఉన్నవారు ఎవరూలేరని గాంధీ బ్లడ్‌బ్యాంకు ఇన్చార్జి డాక్టర్ భీష్మ తెలిపారు. బాంబే బ్లడ్ గ్రూప్ అంటే... జన్యుపరంగా సంక్రమించే ఈ రకం బ్లడ్‌గ్రూప్‌ను ముంబై(ఒకప్పటి బొంబాయ్)కు చెందిన డాక్టర్ వైఎం బెండీ 1952లో గుర్తించారు. దీంతో ఈ రకం రక్తానికి బాంబే బ్లడ్ గ్రూప్ అని నామకరణం చేశారు. అత్యంత అరుదైన ఈ రక్తం ఓ నెగిటివ్ గ్రూప్‌లోని మరో సబ్టైప్. దీనికి వైద్యపరిభాషలో ‘ఓహెచ్’గా పిలుస్తారు. బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం మిలియన్ మందిలో నలుగురికి మాత్రమే ఉండే అవకాశం ఉందని నిపుణులు నిర్ధారించారు. దేశంలో తొమ్మిది మందికి అవసరం... దేశంలో తొమ్మిది మందికి బాంబే బ్లడ్ గ్రూపు రక్తం అవసరం ఉందని తేలింది. కొంతమంది కలిసి బాంబే బ్లడ్‌గ్రూప్ డాట్ ఓఆర్జీ పేరిట ఓ వైబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రకమైన బ్లడ్ అవసరమైన వారు ఈ వైబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకుంటే డోనర్లను వెతికి పట్టుకుని అవసరమైన రక్తాన్ని అందిస్తారు. ప్రస్థుతం ఈ వెబ్సైట్లో తొమ్మిది మంది తమకు బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం అవసరమని తమపేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన బేబీ సరియాఅమీన్, అనంతపురంకు చెందిన శైలజలు ఉండడం గమనార్హం. ఈ వెబ్సైట్ విశ్లేషణ ప్రకారం మహారాష్ట్రలోనే ఈ బ్లడ్‌గ్రూప్ రక్తం ఉన్నవారు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. -
ముంబైకర్ల మానవత్వం
ముంబై: మానవత్వానికి సరిహద్దులు లేవని నిరూపించారు నలుగురు ముంబై వాసులు. రోడ్డు ప్రమాదానికి గురై చావుబతుల్లో ఉన్న బంగ్లాదేశ్ యువకుడికి రక్తం ఇచ్చి ప్రాణదానం చేశారు. ఢాకాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 ఏళ్ల మహ్మద్ కమ్రుజమాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించగా, ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. అతడిది అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూపు అని తెలియడంతో దాతల కోసం ప్రయత్నించారు. బ్లడ్ బ్యాంకుల్లోనూ ఈ గ్రూపు రక్తం దొరక్కపోవడంతో కమ్రుజమాన్ ప్రాణాలపై అతడి కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. అయితే ఈ బ్లడ్ గ్రూపు కలిగిన వారు 400 మంది కంటే తక్కువ మంది ఉన్నారని, రక్తదాతలు ముంబైలో దొరుకుతారని థింక్ ఫౌండేషన్ ద్వారా తెలుకున్నారు. కమ్రుజమాన్ సహచరుడు ఎస్ కే తుహినుర్ అలాం ముంబై చేరుకుని రక్తదాతలను సంప్రదించాడు. స్వప్న సావంత్, కృష్ణానంద్ కోరి, మెహుల్ భెలెకర్, ప్రవీణ్ షిండే రక్తదానం చేశారు. దీన్ని జాగ్రత్తగా భద్రపరిచి ఢాకాకు తీసుకెళ్లారు. ఆపరేషన్ తర్వాత కమ్రుజమాన్ కోలుకుంటాడని డాక్టర్లు చెప్పారని రక్తదాతలు తెలిపారు. -
బొంబే బ్లడ్ గ్రూప్ టెన్షన్, నిలచిన చిన్నారి ఆఫరేషన్