
ధర్మవరం(అనంతపురం): పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చాణుక్య (31) ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన పులిచెర్ల శ్రీనివాసులు, నాగలక్ష్మి దంపతుల కుమారుడు చాణుక్య(31) కరోనా నేపథ్యంలో ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు.
శనివారం సాయంత్రం ఆయన వ్యక్తిగత పనిపై వెళ్లి ద్విచక్రవాహనంలో రోడ్డుపైకి వస్తుండగా కొత్తచెరువు వైపు నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఏడాది కూతురు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment