
సాక్షి, అనంతపురం: టీడీపీ చర్యలు ఫ్యాక్షన్‌ని ప్రోత్సహించేలా ఉన్నాయి. 2019 తర్వాత నెత్తురు చుక్క పడకుండా పాలన చేస్తున్నానమని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు.
కాగా, తోపుదుర్తి ప్రకాశ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆధిపత్యం కోసం పరిటాల కుటుంబమే హత్యా రాజకీయాలు ప్రోత్సహించింది. 25 ఏళ్లుగా పరిటాల కుటుంబం జిల్లాలకు చేసిందేమీ లేదు. టీడీపీ చర్యలు జిల్లాలో ఫ్యాక్షన్‌ని ప్రోత్సహించేలా ఉన్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలతో అనంతపురం జిల్లాకు చెడ్డపేరు తీసుకురావద్దు. రాజకీయాలకు అతీతంగా రాప్తాడులో అభివృద్ధి చేశాము. చంద్రబాబు హెరిటేజ్ దోపిడీకి నష్టపోయిన పాడి రైతులకు డెయిరీ పెట్టి మరీ అడ్డుకున్నాము అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment