Paritala family
-
పెనుకొండ నియోజక వర్గంలో రక్త చరిత్ర మొదలు పెట్టిన పరిటాల రవీంద్ర
-
పరిటాల సునీత మహానటి.. సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు
సాక్షి, అనంతపురం: ‘మా ఓర్పు, సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. మేము తింటున్నదీ ఉప్పూ కారమే. మీకు నిజంగా ధైర్యం ఉంటే మా ఇంటి వద్దకు వచ్చి వెళ్లండి. అప్పుడు మీకు అర్థమవుతుంద’ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అనంతపురంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్పుగా ఉన్నామే గానీ ఏనాడూ సహనం కోల్పోలేదన్నారు. ఇప్పుడు కిరాయి హంతకులతో తమ అమ్మను తిట్టించినా ఓర్పుగానే ఉన్నామన్నారు. అలాగని తమ సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. పరిటాల శ్రీరామ్ తమపై అసత్య ఆరోపణలు చేయడంతో పాటు గడప గడపకు కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఎవరైనా దాడి చేస్తే తమకు సంబంధం లేదంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారన్నారు. అయినప్పటికీ తాము సహనం కోల్పోలేదన్నారు. భాష తప్పే.. భావం కరెక్ట్ చంద్రబాబు విషయంలో తమ అన్న తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి వాడిన భాష తప్పే కానీ.. ఆయన భావం కరెక్ట్ అని ప్రకా‹Ùరెడ్డి స్పష్టం చేశారు. తమ్ముడికి జరగరానిది ఏదైనా జరుగుతుందనే బాధతోనే అలా మాట్లాడారని పేర్కొన్నారు. తమ రాజకీయ చరిత్రలో ఏనాడూ దిగజారుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఎంతో ఓర్పు, సహనంతో ప్రజల వద్దకు వెళ్తున్నామే తప్ప నీచ రాజకీయాలకు పాల్పడలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తమపై కక్ష సాధింపుతో ఎన్నో ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఆస్తులు నష్టపోయామని, చివరికి తమపై అక్రమ కేసులు బనాయించినా ఓర్పు, సహనంతో ఉన్నామని గుర్తు చేశారు. ఆనాడు హత్యాకాండకు పాల్పడ్డారు.. పరిటాల రవీంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎన్నో హత్యలు చేయించారన్నారు. అలాగే పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పుడు కూడా హత్యా రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. పరిటాల సునీత మహానటి అని ఎద్దేవా చేశారు. ఆమె నటన వెనుక చంద్రబాబు పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే రాప్తాడు నియోజకవర్గంలో పది చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఆ సభల్లో టీడీపీ చేసిన హత్యాకాండ, అరాచకాలు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. జాకీ పరిశ్రమ విషయంలో దు్రష్పచారాన్ని మానుకోవాలని టీడీపీ నేతలకు హితవు చెప్పారు. ఆ పరిశ్రమ టీడీపీ హయాంలో ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. లేని జాకీపైన పదేపదే మాట్లాడుతున్నారని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, జెడ్పీటీసీ సభ్యుడు జూటూరు చంద్రకుమార్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబు, పరిటాల ఫ్యామిలీపై తోపుదుర్తి షాకింగ్ కామెంట్స్
సాక్షి, అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు, పరిటాల ఫ్యామిలీపై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. హింసా రాజకీయాలపై పరిటాల సునీత మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కౌంటర్ ఇచ్చారు. కాగా, తోపుదుర్తి ప్రకాష్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పరిటాల అనుచరుడు జగ్గుతో నా తల్లిని తిట్టించారు. తల్లిని తిడితే కొడుకులకు బాధ ఉండదా?. జగ్గు వ్యాఖ్యలను ఏ టీడీపీ నేత కూడా ఖండించలేదు. ఎవరిది తప్పో.. ఎవరికి ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారు. కాటికి కాలు చాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికి ఉంటుంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 150 హత్యలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యేలు చెన్నారెడ్డి, మద్దెలచెర్వు నారాయణరెడ్డి కుటుంబాలను పరిటాల రవి చంపించారు. మద్దెలచెర్వు సూరిని చంపించింది పరిటాల సునీతే. మా సోదరుడు చందుని పరిటాల రవి చంపుతా అన్నారు. నన్ను చంపుతానని పరిటాల శ్రీరామ్ బెదిరిస్తున్నారు. హింసా రాజకీయాలపై పరిటాల సునీత మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
పరిటాల ఫ్యామిలీపై తోపుదుర్తి కీలక వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: టీడీపీ చర్యలు ఫ్యాక్షన్ని ప్రోత్సహించేలా ఉన్నాయి. 2019 తర్వాత నెత్తురు చుక్క పడకుండా పాలన చేస్తున్నానమని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, తోపుదుర్తి ప్రకాశ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆధిపత్యం కోసం పరిటాల కుటుంబమే హత్యా రాజకీయాలు ప్రోత్సహించింది. 25 ఏళ్లుగా పరిటాల కుటుంబం జిల్లాలకు చేసిందేమీ లేదు. టీడీపీ చర్యలు జిల్లాలో ఫ్యాక్షన్ని ప్రోత్సహించేలా ఉన్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలతో అనంతపురం జిల్లాకు చెడ్డపేరు తీసుకురావద్దు. రాజకీయాలకు అతీతంగా రాప్తాడులో అభివృద్ధి చేశాము. చంద్రబాబు హెరిటేజ్ దోపిడీకి నష్టపోయిన పాడి రైతులకు డెయిరీ పెట్టి మరీ అడ్డుకున్నాము అని వ్యాఖ్యలు చేశారు. -
ఆరోజు ఏమయ్యావు రామకృష్ణా?!.. నీ కమ్యూనిజాన్ని పక్కన పెట్టేసి మరో ఇజానికి వెళ్లిపోయావు
సాక్షి, రాప్తాడురూరల్: ‘రాప్తాడు సమీపంలో ఏర్పాటు కావాల్సిన జాకీ కంపెనీ (పేజ్ ఇండస్ట్రీస్) యాజమాన్యం గుడ్‌విల్ ఇవ్వని కారణంగా పనులకు అంతరాయం కల్పిస్తూ వచ్చారు. దీంతో ఆ పరిశ్రమ కాస్తా తమిళనాడులోని సేలానికి తరలిపోయిందంటూ 2018 డిసెంబరు 26న సాక్షి పత్రికలో కథనం వచ్చింది. మరి ఆరోజు ఎవరు అధికారంలో ఉన్నారు? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోజు గాడిద పళ్లు తోముతున్నాడా’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన అనంతపురం మండలం ఆలమూరు జగనన్న హౌసింగ్ లేఅవుట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే... ‘కళ్లున్న కబోదులైన చంద్రబాబు, రామకృష్ణ, సోము వీర్రాజుకు వాస్తవాలు మాట్లాడితే రుచించదు. దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లు చంద్రబాటు ట్వీట్లు చేస్తున్నారు. కనీసం పునాదిరాళ్లకు కూడా నోచుకోని ఒక కాగితం కంపెనీకి ఆరోజు వందకోట్లు విలువైన భూములు కేటాయించి గొప్పగా ప్రచారం కల్పించారు. నిర్మాణం జరగకుండానే అది వెళ్లిపోతే రామకృష్ణ ఎందుకు మాట్లాడలేదు? 1994లో నిన్ను (రామకృష్ణ) అనంతపురం ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ తర్వాత నిన్ను నువ్వు అమ్మేసుకున్నావ్. పరిటాల కుటుంబానికి రాసిచ్చేశావు. నీ కమ్యూనిజాన్ని పక్కన పెట్టేసి మరో ఇజానికి వెళ్లిపోయావు. ఈ జిల్లాకు నీ కాంట్రిబ్యూషన్ ఏమీ లేకుండా నన్ను ఏవిధంగా విమర్శిస్తావ్. పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పది మందిని వెంటేసుకుని వచ్చి డ్రామా నడిపి పోతావా? సోము వీర్రాజు కూడా నా గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి. ఈనాడు పత్రిక రాసిందల్లా నిజాలని భావించడం తగదు. అది లూటీ ఇండస్ట్రీస్ పేజ్ ఇండస్ట్రీస్ అనే సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. జార్ఖండ్, చత్తీస్ఘడ్, ఒడిశా రాష్ట్రాల్లో భూముల కోసం ప్రయత్నించింది. పెట్టుబడులు పెడతామని అనేక రాష్ట్రాలకు వెళ్లిన సంస్థ ఎక్కడా పెట్టింది లేదు. పై మూడు రాష్ట్రాల్లో వాటి జీఎస్టీ నంబర్లు కూడా రద్దయ్యాయి. అంటే అక్కడ వ్యాపారాల్లేవు. కానీ రాప్తాడు అడ్రెస్‌తో ఉన్న ఆ సంస్థ జీఎస్టీ మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ఆరోజుల్లో వంద కోట్ల విలులైన భూములు కేవలం మూడు కోట్ల రూపాయలకు కంపెనీకి కేటాయించడంతో తప్పుమంత్రి ముడుపులు ఆశించారు. ఈ క్రమంలోనే కాంపౌండ్ నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆపేశారు. భూములు ఇచ్చింది మీరు..లంచం అడిగింది మీరు..ఎగ్గొట్టి పోయింది పేజ్ ఇండ స్ట్రీస్. మరి ఇందులోకి మేము ఎక్కడి నుంచి వచ్చాం? పేజ్ ఇండస్ట్రీస్‌ను రమ్మని పిలవండి. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విధంగా లక్షా 50 వేల చదరపు అడుగుల ఫ్యాక్టరీని నేను నిర్మించి ఇస్తా. అప్పటికీ వారు రాకపోతే ఏమనుకోవాలి? వారు రాకపోయినా వేరే సంస్థలైతే కచ్చితంగా తీసుకొస్తాం. ఇప్పటికే దాదాపు 20 సంస్థల ప్రతినిధులతో మాట్లాడాం. డిపాజిట్లు రావని తెలిసీ పరారీ మంత్రం రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తెలిసే పరిటాల కుటుంబం పరారీ మంత్రం పఠిస్తోంది. ధర్మవరం, పెనుకొండ సీట్లు అడుగుతోంది. కానీ చంద్రబాబు ఆ సీట్లను ఇప్పటికే అమ్మేసుకున్నారు. మీరు రాప్తాడులోనే పోరాడాలి. ఇక్కడ మీరు గెలవాలంటే నన్నైనా చంపాలి లేదంటే క్యారెక్టర్‌నైనా చంపాలి. అందులో భాగంగానే ఇప్పుడు నా క్యారెక్టర్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు. పరిటాల కుటుంబం రాజ్యమేలినప్పుడు ఈ ప్రాంత ప్రజలు కరువుతో వేలాదిమంది వలసలు వెళ్లారు. ఈ రోజు చెరువుల నిండా నీళ్లున్నాయి. పేరూరు డ్యాం పొంగి పొర్లుతోంది. ఆయకట్టు కళకళలాడుతోంది. 27 వేల ఇళ్లను మంజూరు చేయించా. పది వేలమంది పాడి మహిళా రైతుల కోసం తోపుదుర్తి సహకార డెయిరీ నిర్మిస్తున్నా. రైతులకు ఉచితంగా ఆరు వేల బోర్లు వేయిస్తున్నాం. ఇది చూసే పరిటాల సునీత కళ్లల్లో కన్నీరు. రైతుల పేరుతో పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉంద’ని అన్నారు. సమావేశంలో రాప్తాడు మార్కెట్ యార్డు చైర్మన్ బెడదూరి గోపాల్‌రెడ్డి, అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, ఏడీసీసీ బ్యాంకు డైరెక్టర్ జనార్దన్‌రెడ్డి, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ కేవీ రమణ, నాయకులు ఆది, చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పరిటాల అనుచరుడి భూదందా.. అజ్ఞాత వ్యక్తి లేఖతో
మాజీ మంత్రి పరిటాల రవీంద్ర అనుచరుడైన రామగిరి టీడీపీ మాజీ ఎంపీపీ బడిమెద్దుల రంగయ్య ధర్మవరంలో చేసిన భూ దందా కలకలం సృష్టించింది. అత్యంత ఖరీదైన మున్సిపల్ రిజర్వ్డ్ స్థలాన్ని నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించి ఏకంగా కోట్లాది రూపాయలు రుణంగా తీసుకునేందుకు పెద్ద ప్రణాళికను రచించాడు. అయితే మున్సిపల్ అధికారుల విచారణలో కబ్జా వ్యవహారం బట్టబయలు కావడంతో కథ అడ్డం తిరిగింది. సాక్షి, ధర్మవరం టౌన్: ధర్మవరం పట్టణంలోని ఎస్బీఐ కాలనీ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఇక్కడ సర్వే నంబర్ 483–1లో 7.84 సెంట్ల స్థలాన్ని రిజర్వ్డ్ సైట్‌గా అధికారులు కేటాయించారు. దీంతో ఈ స్థలంపై పరిటాల అనుచరుడు, రామగిరి మాజీ ఎంపీపీ బడిమెద్దుల రంగయ్య కన్నుపడింది. పరిటాల హవా సాగుతున్న సమయంలో అంటే 2004లో ఈ స్థలాన్ని చారుగుండ్ల రామలక్ష్మమ్మ అనే మహిళ పేరిట నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలు సృష్టించాడు. ఆ తర్వాత అదే సంవత్సరంలో సదరు మహిళతో ఆ స్థలాన్ని కొన్నట్టు బడిమెద్దుల రంగయ్య రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి స్థలాన్ని తన అధీనంలో ఉంచుకున్నాడు. ఈ స్థలం విలువ రూ.3 కోట్లకు పైగానే పలుకుతుంది. (జేసీ కుటుంబానికి మైనింగ్ శాఖ నోటీసులు) దస్తావేజులో రంగయ్య ఫొటో అజ్ఞాత వ్యక్తి లేఖతో బట్టబయలు ఎస్బీఐ కాలనీలో నకిలీ ధ్రువపత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న సర్వే నంబర్ 483–1లోని 7.84సెంట్ల స్థలాన్ని ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో తాకట్టు పెట్టి రూ.2 కోట్ల రుణం పొందేందుకు బాలాజీ హౌసింగ్ డెవలపర్స్ అనే కంపెనీ తరఫున దరఖాస్తు చేసుకున్నాడు. రుణం ఇచ్చే ప్రక్రియ మొదలు కావడంతో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థలానికి సంబంధించిన విచారణ మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేసింది. ఇదే తరుణంలో పది రోజుల కిందట ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునకు ఈ వ్యవహారాన్ని ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ ద్వారా తెలిపాడు. దీంతో కమిషనర్ ఆ డాక్యుమెంట్లను పరిశీలించి నకిలీ రిజి్రస్టేషన్గా గుర్తించారు. మున్సిపల్ రిజర్వ్డ్ సైట్‌ను తాకట్టు పెట్టి రుణం పొందాలనుకున్న విషయాన్ని ధ్రువీకరించారు. కబ్జాదారుపై పోలీసులకు ఫిర్యాదు మున్సిపల్ రిజర్వ్డ్ స్థలానికి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి రుణం పొందాలని చూసిన బడిమెద్దుల రంగయ్య, రామలక్ష్మిలతో పాటు, అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపైన మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. మున్సిపల్ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. -
అమరావతిలో పరిటాల బంధువుల పాగా
సాక్షి, కనగానపల్లి: రాజధాని ప్రాంతంగా గుర్తించిన అమరావతి సీఆర్డీఏ పరిధిలోని భూముల కొనుగోలుపై సీఐడీ కన్నేసింది. రూ.కోట్ల విలువైన భూములను తెల్లరేషన్‌కార్డు కలిగిన వారు కొనుగోలు చేసినట్లు తెలుసుకున్న అధికారులు తీగ లాగుతున్నారు. కనగానపల్లికి చెందిన నిర్మలాదేవి, బద్దలాపురం గ్రామానికి చెందిన జయరాంచౌదరిలు అమరావతి పరిధిలోని తాడికొండ వద్ద ఒక్కొక్కరు అర ఎకరం చొప్పున భూమి కొనుగోలు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న వీరు రాజధాని ప్రాంతంలో భూములు కొనే పరిస్థితి లేదని, ఈ ప్రాంతంలోని ప్రజాప్రతినిధికి బినామీలుగా వీరు ఉన్నట్లు సీఐడీ అధికారులు భావిస్తున్నారు. చదవండి: పరిటాల కుటుంబ దోపిడీకి అడ్డుకట్ట.. ఇద్దరూ తెల్లరేషన్‌కార్డుదారులే... సీఐడీ సీఐ ఎస్ఎం గౌస్, ఎస్ఐ సుధాకర్ మంగళవారం కనగానపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నిర్మలాదేవి, జయరాంచౌదరిల వివరాలను సేకరించారు. నిర్మలాదేవి(రేషన్ కార్డు నంబర్: డబ్ల్యూఏపీ1233001200252) స్థానికంగానే ఉండటంతో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. చిల్లర దుకాణం నడుపుకొంటూ జీవిస్తూ రూ.కోట్ల విలువ చేసే భూమి ఎలా కొన్నారు..? అని సీఐడీ అధికారులు వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నిర్మలాదేవి మాత్రం తమ సమీప బంధువులు, వ్యక్తుల సహకారంతో భూమి కొన్నట్లు చెప్పారు. వీరు మాజీ మంత్రి పరిటాల సునీతకు దూరపు బంధువులుగా తెలుస్తోంది. తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేస్తున్న సీఐడీ అధికారులు ఇక బద్దలాపురం గ్రామానికి చెందిన జయరాం చౌదరి(రేషన్ కార్డు నంబర్: ఆర్ఏపీ123300300110) అమరాపురంలోని సొసైటీ బ్యాంకులో సీఈఓగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. దీంతో సీఐడీ అధికారులు ఆయన్ను నేరుగా విచారించలేకపోయారు. అయితే ఆయన వ్యక్తిగత ఆదాయ వివరాలు, కుటుంబ వివరాలను తహసీల్దార్ కార్యాలయ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. జయరాంచౌదరి కూడా పరిటాల కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాలతోనే భూమి కొనుగోలు చేశాడా? లేక అతని సమీప బంధువుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు బినామీగా భూములు కొన్నాడా? అనే దానిపై సీఐడీ అధికారులు విచారణ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా అమరావతి ప్రాంతంలోని భూముల కొనుగోలు వ్యవహారంలో బినామీల బాగోతం ఒక్కొక్కటిగా వెలికితీసేందుకు అధికారులు విచారణ వేగవంతం చేశారు. తాడిపత్రిలోనూ విచారణ... తాడిపత్రి రూరల్: సీఐడీ అధికారులు తాడిపత్రి విజయలక్ష్మి థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ చైతన్యపాఠశాల నిర్వాహకుడు కె.చంద్రశేఖర్‌రెడ్డిని కూడా విచారించారు. 2014లో ఆయన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని ఘని ఆత్మకూరులో కొనుగోలు చేసిన 4 ఎకరాలపై ఆరా తీశారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన సీఐడీ సీఐ ఎస్సీ గౌస్ తహసీల్దార్ నయాజ్‌అహ్మద్‌తో మాట్లాడారు. చంద్రశేఖర్‌రెడ్డి పేరున ఉన్న తెల్లరేషన్ కార్డుపై ఆరా తీశారు. అనంతరం ఈ నెల 20న కర్నూలులోని తమ కార్యాలయంలో విచారణ నిమిత్తం హాజరు కావాల్సిందిగా చంద్రశేఖర్‌రెడ్డికి నోటీస్ అందజేశారు. చదవండి: పరిటాల హత్య కేసులో సంచలన విషయాలు -
దోచుకునేందుకే ధర్మవరానికి ‘పరిటాల’
సాక్షి, ధర్మవరం రూరల్: దోచుకోవడానికే పరిటాల కుటుంబం ధర్మవరం రావడానికి ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ నాయకుడు గోనుగుంట్ల సూర్యానారాయణ(వరదాపురం సూరి) మండిపడ్డారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇన్నాళ్లూ రాప్తాడు నియోజకవర్గాన్ని పరిటాల సునీత అభివృద్ధి చేయకుండా మండలాలకు ఇన్‌చార్జ్‌లను పెట్టి దోచుకున్నారని ఆరోపించారు. అక్కడ దోచుకుతిన్నది చాలదన్నట్లు ధర్మవరంలో కూడా దోచుకోవడానికి వస్తామని పరిటాల సునీత చెపుతున్నారన్నారు. ఇన్నాళ్లు గ్రూపు రాజకీయాలు చేస్తూ తమ పబ్బం గడుపుకున్నారే కాని ఆ పార్టీ అభివృద్ధికి ఏ¯ కృషి చేయలేదని విమర్శించారు. ధర్మవరం చెరువుకు నీళ్లు తెస్తుంటే పరిటాల సునీత అడ్డుకున్నారని గుర్తు చేశారు. తాను టీడీపీలో ఉన్నన్నాళ్లు సొంత డబ్బుతో పార్టీ అభివృద్ధికి పాటుపడ్డానన్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ నాయకులతో సంబంధాలు పెట్టుకొని తమ పబ్బం గడుపుకోలేదని పరోక్షంగా పరిటాల సునీతను ఎద్దేవా చేశారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మవరం వచ్చినప్పుడు ఒక నేత తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, 2009 ఎన్నికల్లో ఆమెకు చిత్తశుద్ధి ఉంటే జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి పనిచేశారా? లేక కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్‌కు పనిచేశారా? అనే విషయాన్ని చెప్పాలన్నారు. 2019లో కూడా ఆమె ఎన్ని నియోజకవర్గాల్లో ఏ పార్టీకి పనిచేశారో చెప్పాలన్నారు. తాను బీజేపీలోనే ఉంటానని ఏ పార్టీలోకి వెళ్లనని, 15 ఏళ్లుగా తనతో ఉన్న నాయకులు, కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. చాలా చోట్ల పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయడం లేదని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామన్నారు.నాయకులు శ్యామ్‌రావు, సుదర్శన్‌రెడ్డి, సాకే ఓబిళేసు, చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
తమ్ముడు.. కుమ్ముడు...!
సోమందేపల్లి మండలం సర్వే నంబర్ 64లో రోడ్డు మెటల్ క్వారీకి గనులశాఖ అధికారులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి కుమార్తె బీకే రోజా పేరుతో అనుమతులు ఇచ్చారు. ఇక్కడ 20,500 క్యూబిక్ మీటర్లు మాత్రమే తవ్వుకోవాలని సూచించారు. అయితే ఈ క్వారీలో దాదాపు 90 వేల క్యూబిక్ మీటర్లకుపైగా అక్రమంగా తవ్వకాలు జరిపారు. 2018 నవంబర్ 1న క్వారీని పరిశీలించిన రాష్ట్ర గనులశాఖ అధికారులు దీన్ని గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించడం, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారని తెలిసి రూ.98 లక్షలు జరిమానా విధించారు. అయితే బీకే కుటుంబం జరిమానా చెల్లించకపోగా... నేటికీ తవ్వకాలు జరుపుతూ రోడ్డు మెటల్‌ను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది. అనుమతులు ఉండవు.. తవ్వేస్తారు. రాయల్టీ చెల్లించరు.. రవాణా చేస్తారు. లీజు ఒకచోట పొంది మరో ప్రాంతంలో తవ్వేస్తారు. ఎవరూ పట్టించుకోరు. కొండలను పిండిచేసి రూ.కోట్లు వెనకేసుకున్నారు. అయినా ప్రభుత్వానికి పైసా చెల్లించరు. జిల్లాను పట్టి పీడించిన మైనింగ్ మాఫియా దెబ్బకు ‘అనంత’లోని గనులు, కొండలు నామ రూపాల్లేకుండా పోయాయి. ఇవన్నీ తెలిసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో...గత ఐదేళ్లలో టీడీపీ నేతలు సహజ వనరులన్నీ దోచేశారు. అక్రమార్జనకు అలవాటుపడిన వారంతా నేటికీ దందా నడిపిస్తూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న క్వారీలు- 320 గ్రానైట్ క్వారీలు- 120 రోడ్ మెటల్ క్వారీలు- 200 పర్యావరణ అనుమతులున్న క్వారీలు- 120 సాక్షి, పెనుకొండ/అనంతపురం టౌన్: కరువుకు చిరునామాగా మారిన జిల్లాలో సహజవనరులకు మాత్రం కొదవలేదు. అందుకే గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు వీటిపైనే కన్నేశారు. మనీ కోసం మైనింగ్ మాఫియా నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపి రూ.కోట్లు సంపాదించారు. క్వారీలు, గనులను అనుక్షణం పర్యవేక్షించాల్సిన భూగర్భ గనుల శాఖ అధికారులు కళ్లుమూసుకోవడంతో ఇష్టానుసారం చెలరేగిపోయారు. యథేచ్ఛగా అక్రమ క్వారీలు, అనుమతులు లేని క్రషర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. అయినా అధికారులు మాత్రం చర్యలు తీసుకోలేకపోయారు. 120 క్వారీలకే అనుమతులు జిల్లా వ్యాప్తంగా 320లకుపైగా క్వారీలుండగా...వీటిలో 120 గ్రానైట్ క్వారీలు, 200 రోడ్డు మెటల్ క్వారీలున్నాయి. ప్రతి క్వారీకి పర్యావరణ అనుమతులు తప్పని సరి. లేని వాటిని సీజ్ చేయాలని కేంద్ర పర్యావరణ అధికారులు భూగర్భ గనుల శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. అయితే జిల్లాలో 120 క్వారీలకు మాత్రమే పర్యావరణ అనుమతులున్నాయి. మిగిలిన వాటికి అనుమతులు లేకున్నా... ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. తీసుకున్న లీజు ప్రాంతంలో కాకుండా సమీపంలోని ప్రాంతంలో తవ్వకాలు చేపడుతున్నారు. అయినా గనులశాఖ అధికారులు మాత్రం అక్రమ తవ్వకాలను గుర్తించలేకపోతున్నారు. గనులశాఖకే ప్రత్యేకంగా విజిలెన్స్ విభాగం ఉన్నప్పటికీ ఆమ్యామ్యాలకు అలవాటుపడిన వారంతా కళ్లుమూసుకుని చోద్యం చూస్తున్నారు. ప్రతినెలా 12 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్ తరలింపు జిల్లాలోని రోడ్డు మెటల్ క్వారీల నుంచి ప్రతి నెలా 12 లక్షల క్యూబిక్ మీటర్లకుపైగా మెటల్‌ను తరలిస్తున్నారు. ఈలెక్కన ప్రతి క్వారీ నిర్వాహకుడు రాయల్టీ చెల్లించి పర్మిట్లు తీసుకుంటే... ప్రతినెలా రోడ్డు మెటల్ క్వారీలనుంచే ప్రభుత్వానికి దాదాపు రూ.12 కోట్లకుపైగా ఆదాయం రావాల్సి ఉంది. అయితే క్వారీ నిర్వాహకులు మాత్రం 2 లక్షల క్యూబిక్ మీటర్లకు కూడా రాయల్టీ చెల్లించలేదు. దీంతో ప్రతి నెలా ప్రభుత్వం దాదాపు రూ.10 కోట్లకుపైగా.... ఏడాదికి దాదాపు రూ.120 కోట్లకు పైగా ఆదాయం కోల్పోతోంది. గనులశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో క్వారీ నిర్వహకులు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తక్కువ పర్మిట్లకు రాయల్టీ చెల్లించి అక్రమంగా రోడ్డు మెటల్‌ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు సైతం అక్రమ వ్యాపారాన్ని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఎల్.నారాయణ చౌదరి దందా ఎక్కువే మాజీ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు ఎల్.నారాయణ చౌదరి 2015లో సోమందేపల్లి మండలంలోని సర్వే నంబర్లు 509లోని 3 హెక్టార్లు, 2 హెక్టార్లు చొప్పున రెండు రోడ్డు మెటల్ క్వారీలకు లీజు తీసుకున్నాడు. 2016–17 సంవత్సరంలో క్యూబిక్ మీటరుకు కూడా రాయల్టీ చెల్లించలేదు. 2017–18లో మాత్రం ఒక క్వారీకి 6,500 క్యూబిక్ మీటర్లకు గానూ రూ.6.50 లక్షలు, మరో క్వారీ తరఫున 1,300 క్యూబిక్ మీటర్లకు రూ.1.30 లక్షలు చెల్లించాడు. 2015 నుంచి ఇప్పటి వరకు మొత్తంగా రూ.8 లక్షల్లోపే రాయల్టీ చెల్లించాడు. క్వారీలో మాత్రం నేటికీ తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. ఈ మూడేళ్లకాలంలో ఇంతతక్కువ మొత్తంలో రాయల్టీ చెల్లించిన క్వారీలు జిల్లాలోనే లేకపోవడం గమనార్హం. అయితే గనులశాఖ అధికారులు మాత్రం ఈ క్వారీలను పర్యవేక్షించిన దాఖలాల్లేవు. ప్రస్తుతం క్వారీని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ రెండు క్వారీల నుంచే దాదాపు రూ.2 కోట్లకు పైగా విలువ చేసే ఖనిజాన్ని తరలించుకు పోయినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు వాటిని చూసే సాహసం కూడా చేయడం లేదు. వీటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఏస్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయో తెలిసే అవకాశం ఉంది. ఇన్చార్జి అధికారితోనే ఇబ్బందులు గనుల శాఖ అనంతపురం ఏడీగా పనిచేస్తున్న వెంకట్రావును ఆరు నెలల క్రితం అప్పటి కలెక్టర్ వీరపాండియన్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. దీంతో తాడిపత్రి ఏడీగా ఉన్న వెంకటేశ్వరరెడ్డికి అనంతపురం డివిజన్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన వారం రెండు రోజులు మాత్రమే అనంతపురం డివిజన్లోని క్వారీ వ్యవహారాలు చూస్తున్నారు. అందువల్లే అక్రమ క్వారీలపై నిఘా ఉంచలేకపోతున్నారు. ఇద్దరు ఆర్ఐలు ఉన్నప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. రాయల్టీ ఎగవేత ఇలా.... ప్రతి నెలా తరలించే మెటల్ క్వారీ: 12 లక్షల క్యూ.మీ రాయల్టీ రూపంలో ఖజానాకు చేరాల్సిన మొత్తం : రూ.12 కోట్లు్ల క్వారీ నిర్వాహకులు నెలలో చెల్లిస్తున్న మొత్తం: రూ.2 కోట్లు ఏడాదికి ప్రభుత్వానికి అందకుండా పోతున్న మొత్తం: రూ.120 కోట్లు చర్యలు తీసుకుంటాం సోమందేపల్లి మండలంలోని రోడ్డు మెటల్ క్వారీలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతాం. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేసి ఉంటే చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ఉల్లంఘించిన కొందరు క్వారీ నిర్వాహకులకు జరిమానా విధించాం. ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని నోటీసులు పంపాం. కొందరు కోర్టులను ఆశ్రయించడం వల్ల వారికి నోటీసులు పంపలేదు. కోర్టు ఉత్తర్వులు రాగానే జరిమానా సొమ్మును పైసాతో సహా వసూలు చేస్తాం. – వెంకటేశ్వరరెడ్డి, గనుల శాఖ ఏడీ -
అనంతపురంలో టీడీపీకి ఒక్కరూ మిగలరా?
టీడీపీ నేతలను కేసుల భయం వెంటాడుతోంది. మరికొందరు తమ ఆస్తులను, కాంట్రాక్టులను కాపాడుకునే క్రమంలో ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీ వైపు చూస్తున్నారు. అప్పట్లో అధికార పార్టీ అండ చూసుకొని జిల్లాలో టీడీపీ నేతలు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారు. తాజాగా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం, అవినీతిపై విచారణకు ఆదేశిస్తామని చెప్పడంతో టీడీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అందరికంటే ముందుగా తన ఇల్లు సర్దుకోవడం గమనార్హం. సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి తేరుకోక మునుపే జిల్లా టీడీపీకి ఆ పార్టీ ముఖ్య నేత వెన్నుపోటు పొడిచారు. జిల్లా ప్రధాన కార్యదర్శి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. అనంతరం భారతీయ జనతాపార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయకండువా కప్పుకున్నారు. సూరి పరిణామం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన బాటలోనే జేసీ బ్రదర్స్, పరిటాల సునీత, కందికుంట ప్రసాద్, పల్లె రఘునాథరెడ్డి బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరిపారు. జేసీ బ్రదర్స్ జేపీ నడ్డా, రాంమాధవ్‌తో రెండురోజుల కిందట చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వీరి చేరికకు కూడా లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. పరిటాల కుటుంబం చూపు కూడా పరిటాల సునీత కుటుంబం కూడా బీజేపీ వైపు చూస్తోంది. సునీత అల్లుడు బీజేపీ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపి లైన్‌క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. బీజేపీలోకి చేరాలని, లేదంటే టీడీపీలో భవిష్యత్ ఉండదని సునీత అల్లుడు చెబుతున్నట్లు సమాచారం. శ్రీరాం కూడా తన బావ ఆలోచనకు అనువుగా కమలం పంచన చేరేందుకు సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. అయితే సునీతతో పాటు ఆమెకు సన్నిహితంగా ఉన్న కోటరీలోని కొందరు పరిటాల అంటే టీడీపీ అనే ముద్ర ఉందని, బీజేపీలో చేరితే టీడీపీ శ్రేణులు తమతో వస్తాయా? రావా? అనే ఆలోచన చేస్తున్నారు. ఇదిలాఉంటే వరదాపురం సూరి బీజేపీలో చేరిన నేపథ్యంలో సునీతను ధర్మవరానికి వెళ్లి సమావేశం నిర్వహించాలని, అలాగే ధర్మవరం ఇన్చార్జ్గా కొనసాగాలని సునీతకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అధినేత అభిప్రాయాన్ని సునీత సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. రాప్తాడు ఇన్చార్జ్గా శ్రీరాం ఉన్నాడని, ధర్మవరం విషయం ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. అయితే ఇన్చార్జ్ బాధ్యతలను తిరస్కరించడం వెనుక త్వరలో వారు కూడా పార్టీ మారాలనే నిర్ణయమే అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జేసీ బ్రదర్స్ చర్చలు కూడా సఫలం తాడిపత్రిలో 40 ఏళ్లుగా ఏక చత్రాధిపత్యం నడిపిన జేసీ బ్రదర్స్‌కు మొన్నటి ఎన్నికల్లో చావుదెబ్బ తగిలింది. వారసులిద్దరూ ఓడిపోయారు. జిల్లాలో టీడీపీ ఘోర ఓటమికి జేసీ బ్రదర్స్ కూడా కారణమని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దివాకర్‌రెడ్డి కూడా టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని, ఆ పార్టీ నైరాశ్యంలో ఉన్న పరిస్థితిని బీజేపీ అవకాశంగా తీసుకుని ఏపీలో బలపడాలనే యోచనలో ఉందని బాహాటంగానే చెబుతున్నారు. మరోవైపు జేసీ పవన్‌రెడ్డి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపి పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండురోజుల కిందటే బీజేపీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి చేరిక తేదీపై మీరే నిర్ణయం తీసుకోవాలని ‘జూనియర్ బ్రదర్స్’కు చెప్పినట్లు సమాచారం. కాబట్టి సూరి తర్వాత జేసీ బ్రదర్స్, పరిటాల కుటుంబంలో ఎవరు ముందు ఢిల్లీ విమానం ఎక్కుతారా? అనే చర్చ జిల్లాలో సాగుతోంది. ఈ చేరికల వెంటనే కందికుంట ప్రసాద్ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది. నట్టేట ముంచిపోయాడు తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీలో చేరడం పట్ల ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన వారం రోజులకే సూరి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరపడం, ఆ తర్వాత నియోజకవర్గానికి అడపాదడపా వస్తూ క్యాడర్‌ను కూడా పార్టీ మారాలని ఒత్తిడి చేయడం జరుగుతోంది. క్లాస్–1 కాంట్రాక్టర్ అయిన సూరీ నితిన్‌సాయి కన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఎస్సీ) పేరిట ధర్మవరం నియోజకవర్గంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల పనులు చేస్తుండగా.. వీటిలో కొన్ని మధ్యలో ఉండగా, మరికొన్ని బిల్లులు కాకుండా పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో టీడీపీలోనే కొనసాగితే ఆయా పనులకు సంబంధించిన బిల్లులు నిలిచిపోవడంతో పాటు, నాణ్యతకు సంబంధించి విచారణ జరిగితే ఇబ్బందులు తప్పవనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. సూరి అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రాంతాల్లో చేపట్టిన పనులు, ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో చేపట్టిన పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించింది. ఈ నేపథ్యంలో తన పనులకు ఆటంకం కలిగి, ఆదాయానికి గండిపడుతుందని భావించిన ఆయన టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. అయితే ఇంతకాలం ఆయనను నమ్మి పని చేసినందుకు తమతో పాటు పార్టీని నట్టేట ముంచిపోయాడని క్యాడర్ రగిలిపోతోంది. తన సొంత ప్రయోజనాల కోసం ఇంతమందిని బలి చేస్తున్న ఆయనకు భవిష్యత్ లేదని, తాము ఆయన వెంట నడిచే ప్రసక్తే లేదని కార్యకర్తలు, నాయకులు తేల్చి చెబుతున్నారు. -
పరిటాల దోపిడీ అనంతం
రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబ దోపిడీ తవ్వేకొద్దీ ఆశ్చర్యం కలిగిస్తోంది. చిన్నాన్న నారాయణ చౌదరి, తమ్ముళ్లు ధర్మవరపు మురళి, ధర్మవరపు బాలాజీ.. సమీప బంధువులు రామ్మూర్తి నాయుడు, నెట్టెం వెంకటేష్, మహేంద్ర సాగించిన అక్రమాల బాగోతం ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. కనీసం ఆ పార్టీ నేతలను కూడా ఎదగనీయకుండా.. ప్రజలకూ మేలు చేయకపోగా గత ఐదేళ్లలో ఇబ్బడిముబ్బడిగా ఆస్తులు కూడబెట్టిన తీరు ఆ పార్టీలోనే తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే పరిటాల కోట బద్దలైంది. ఇదే సమయంలో అవినీతి పుట్ట పగులుతోంది. సాక్షి, రాప్తాడు : టీడీపీ ప్రభుత్వ హయాంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ ఆ పార్టీ నేతలు సొమ్ము చేసుకున్నారు. ఐదేళ్లలో కనీసం ప్రజలను కలిసి, వారి బాగోగులు తెలుసుకున్న పాపాన పోలేదు. పైగా జన్మభూమి కమిటీల పెత్తనం సరేసరి. ప్రజల సొమ్మును యథేచ్ఛగా దోచుకున్నారు. నాయకుల అండదండలతో కాంట్రాక్టర్లు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఎవరికి ముట్టజెప్పాల్సింది వారి చేతిలో పెట్టి.. నాసిరకం పనులతో మమ అనిపించారు. రామగిరి మండలంలో నూతనంగా నిర్మించిన ఎంపీడీఓ కార్యాలయ భవనం నాలుగు నెలలు కూడా పూర్తి కాకుండానే చిన్నపాటి వర్షానికి గదులన్నీ కారి ముద్దయిన విషయం తెలిసిందే. ఈ పని చేసింది మరెవరో కాదు.. మాజీ మంత్రి పరిటాల సునీత చిన్నాన్న ఎల్.నారాయణ చౌదరి. ఏదో ఒక పనిలే అనుకుంటే.. తాజాగా ఇంకో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాలుగైదు రోజుల క్రితం కురిసిన వర్షానికి మండలంలోని గొల్లపల్లి నుంచి పెసరకుంట గ్రామానికి వేసిన రోడ్డుకు ఇరుపైపులా మట్టి రోడ్డు పూర్తిగా కోసుకుపోయింది. చాలా చోట్ల రోడ్డు కూడా తారు లేచిపోయింది. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే పెసరకుంట గ్రామస్తులు నరకం చూస్తున్నారు. సొంత నియోజకవర్గంలో, కుటుంబ సభ్యులు చేసిన పనులు ప్రజలకు పది కాలాల పాటు సేవలందించాల్సింది పోయి.. పట్టుమని పది రోజులు కూడా నిలవని పరిస్థితి. తారు పోసి.. మాయ చేసి ఐదేళ్ల పాటు ప్రజలను విస్మరించిన పరిటాల కుటుంబం ఎన్నికల వేళ గిమ్మిక్కులు చేసింది. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ట్రైబల్ సబ్‌ప్లాన్ నిధులు రూ.1.20కోట్లతో మండలంలోని గొల్లపల్లి గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారి నుంచి పెసరకుంట వరకు తారు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ పనులను మాజీ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు, టీడీపీ నేత ఎల్.నారాయణప్పకు చెందిన శ్రీకృష్ణదేవరాయ కన్స్ట్రక్షన్స్(ఎస్కేసీ) దక్కించుకుంది. ఎల్.నారాయణప్ప నుంచి మరూరుకు చెందిన టీడీపీ నేత తక్కెల్ల చంద్రబాబు నాయుడు సబ్ కాంట్రాక్టు తీసుకున్నాడు. అయితే ఇతను కూడా డమ్మీయే. రోడ్డు పనులు చేయించింది మాత్రం మాజీ మంత్రి సునీత సోదరుడు ధర్మవరం మరళి. ఆయనే దగ్గరుండి ఈ పనులను పర్యవేక్షించాడు. అయితే ఎక్కడా నిబంధనలను పాటించకపోయినా సునీత సోదరుడు కావడంతో అధికారులు కూడా మౌనందాల్చాల్సి వచ్చింది. ఎన్నికల వేళ హడావుడి సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో ప్రజలకు గాలం వేసేందుకు రోడ్డు నిర్మాణాన్ని తెరపైకి తీసుకొచ్చారు. గత ఫిబ్రవరి 10న ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏప్రిల్ నెలలో రోడ్డుపై కంకర పరిచి, మే నెల 2, 3 తేదీల్లో 2.35 కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేసేశారు. కేవలం వారం రోజుల్లోపు చేపట్టిన ఈ రోడ్డు నాణ్యత ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. కోటి రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డు నెల రోజులు తిరక్కుండానే నామరూపాలు కోల్పోతోంది. రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన బరŠమ్స్ విషయంలో సదరు కంపెనీ నిబంధనలకు తిలోదకాలిచ్చింది. ప్రస్తుతం చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డుకు ఇరువైపులా మోకాలి లోతు గుంతలు ఏర్పడటంతో పాటు రోడ్డు కోతకు గురవుతోంది. ఎక్కడికక్కడ నెర్రెలు చీలుతున్నాయి. అప్పటికే ఉన్న రోడ్డు మీద తారు పోసిన తీరు చూస్తే పరిటాల కుటుంబం ధన దాహం ఏ స్థాయి ఉందో ఊహించుకోవచ్చు. ఎన్నికల వేళ శ్రీకృష్ణదేవరాయ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులన్నీ దాదాపు ఇదేవిధంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. నిబంధనలు.. ఉల్లంఘనలు ♦ ఆర్అండ్బీ పరిధిలో నిర్మించే 7 మీటర్ల రోడ్లకు అటు ఇటు నిర్మించే మట్టి రోడ్డు పనులు 5 మీటర్ల చొప్పున నిర్మించాలి. ♦ అదే పంచాయతీరాజ్ పరిధిలో నిర్మించే రోడ్లకు ఒక వైపు 1.5 మీటర్లు, మరోవైపు 1.5 మీటర్ల మట్టి రోడ్డు నిర్మించాలి. అయితే ఈ రోడ్డు విషయంలో ఈ నిబంధనలను పట్టించుకున్న దాఖలాల్లేవు. ♦ రోడ్డు నిర్మాణానికి ఆయా శాఖలు మట్టి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తాయి. ఇలా మంజూరు చేసిన వాటికి ఇతర ప్రాంతాల నుంచి మట్టిని తరలించి మట్టి రోడ్డు నిర్మించాలి. ముఖ్యంగా ఎర్రమట్టితోనే మట్టి రోడ్డు వేయాలి. నల్ల రేగడి, లూజ్ మట్టి ఉన్న ప్రాంతాల్లో తప్పని సరిగా ఇతర ప్రాంతాల నుంచి ఎర్రమట్టిని తరలించాలి. కానీ ఇక్కడ నిర్మిస్తున్న మట్టి రోడ్డు పక్కనే ఉన్న మట్టిని తవ్వి వినియోగించారు. ♦ మట్టి రోడ్డు నిర్మాణంలో భాగంగా లేయర్ల వారీగా రోడ్డు రోలర్‌తో తిప్పించాలి. తోలిన మట్టి గట్టిపడే వరకు నీళ్లు చల్లి రోలింగ్ చేయించాలి. కానీ ఇక్కడ ఒకేసారి మట్టి వేసి లెవల్ చేసి రోలింగ్ చేశారు. ♦ మట్టి రోడ్డు గడ్డపారతో తవ్వినా గుంత పడని విధంగా నిర్మించాలి. కానీ చిన్న పాటి వర్షం వస్తే టూవీలర్ కూడా ఇరుక్కుపోయే విధంగా ఉన్న నిర్మాణాలు అవినీతికి అద్దం పడుతున్నాయి. ♦ గత నాలుగైదు రోజుల కిత్రం కురిసిన వర్షానికి గొల్లపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలానికి ట్రాక్టర్లో వెళ్లాడు. రోడ్డు పక్కనే తోట ఉండటంతో ట్రాక్టర్‌ను రోడ్డుపై నుంచి పొలంలోకి దింపుతుండగా మట్టి రోడ్డులో ఇరుక్కుపోయింది. ట్రాక్టర్‌ను బయటకు తీసేందుకు ఆ రైతుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించాల్సి వచ్చింది. ♦ రోడ్డు పక్కనే మట్టి రోడ్డును తప్పని సరిగా రోడ్డుకు అటు ఇటు ఏటవాలుగా వర్షం నీరు రోడ్డుపై నిల్వ ఉండకుండా నిర్మాంచాలి. అయితే ఈ నిబంధనను పాటించకపోవడంతో నూతనంగా నిర్మించిన రోడ్డు కూడా నెర్రెలు చీలుతోంది. ♦ రోడ్డు నిర్మాణం పూత పూసినట్లుగానే ఉందని, ఇంకాస్త మందంతో వేయాలని అప్పట్లో పెసరకుంట, గొల్లపల్లి గ్రామస్తులు, పొలాల రైతులు అడ్డుపడడంతో వారిని మాజీ మంత్రి సోదరుడు ధర్మవరపు మురళి బెదిరించినట్లు సమాచారం. -
ఓటమి భయంతోనే శ్రీరాం ప్రలోభాలు
సాక్షి, అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబానికి ఓటమి భయం పట్టుకుంది. ప్రజల్లో ఉన్న తీవ్రమైన వ్యతిరేకత నుంచి బయటపడేందుకు తంటాలు పడుతున్నారు. ఓవైపు బెదిరింపులకు గురి చేస్తున్నారు. మరోవైపు ప్రలోభాల పర్వానికి తెర తీస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో డబ్బు, మద్యం ఏరులై పారుతోంది. తాజాగా మంగళవారం హైదరాబాద్‌లో పరిటాల శ్రీరాం వర్గీయుడి నుంచి పోలీసులు రూ.24 లక్షల నగదు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. మంత్రి పరిటాల సునీత ముఖ్య అనుచరుడు, రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్ డ్రైవర్ సంతోష్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే ఈ డబ్బును వాహనాల కొనుగోలుకు తరలిస్తున్నట్లు తెలిసింది. ప్రలోభాల పర్వం.. రాప్తాడు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరిటాల సునీత మంత్రిగా కొనసాగుతున్నారు. పదేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది శూన్యం. నియోజవకర్గంలోని రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రామగిరి మండలాలకు కుటుంబీకులు, తన సామాజిక వర్గానికి చెందిన వారిని ఇన్‌చార్జ్‌లుగా నియమించి ‘సామంతుల’ పాలన సాగించారు. అభివృద్ధి మాటున దోపిడీ చేశారు. చివరకు వారి పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి, దిగువశ్రేణి నాయకులను సైతం దగ్గరికి రానీవ్వకుండా మంత్రి సామాజిక వర్గం వారే అన్ని పథకాల్లోనూ దోచుకున్నారు. ప్రతి విషయంలోనూ వారిదే పెత్తనం. వారిని కాదని నేరుగా మంత్రిని కలిసే అవకాశం కూడా లేదని టీడీపీ కార్యకర్తలే వాపోతున్నారు. ఫలితంగా ప్రజలతో పాటు సొంత పార్టీలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొందరు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలామంది లోలోనే మదనపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యతిరేకతను అంచనా వేసిన మంత్రి పరిటాల సునీతకు ఈసారి తాను బరిలో నిలిస్తే ఓడిపోతానని తెలిసిపోయింది. కుమారుడు శ్రీరాం అయితే కనీస పోటీ అయినా ఇస్తాడనే ఆలోచనతో బరిలో దింపారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదు. ఎలాగైనా గట్టెక్కాలనే ఉద్దేశంతో ప్రలోభాలకు తెర తీస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఓటుకు రూ.2 వేల దాకా ఇవ్వాలని నిర్ణయించారు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఓట్లను బట్టి ఇంటికి రూ.5 వేల నుంచి రూ.15 వేల దాకా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. స్కార్పియోలు, బైకుల ఆఫర్ ఓ స్థాయి నాయకులకు స్కార్పియోలు, బైకులు ఆఫర్ ఇస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో జాబితా కూడా తయారు చేసినట్లు సమాచారం. పరిటాల శ్రీరాంకు గెలుపు జీవన్మరణ సమస్యగా మారడంతో ఎలాగైనా బయట పడేందుకు పరిటాల కుటుంబం తంటాలు పడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరిన్ని ప్రలోభాలకు గురి చేస్తారనే ప్రచారం సాగుతోంది. -
మొన్న అత్తకు.. నిన్న కోడలికి సెగ
సాక్షి, అనంతపురం: ముత్తవకుంట్ల. మంత్రి పరిటాల సునీతకు సెంటిమెంట్ గ్రామం. ఆమె సొంతూరు వెంకటాపురం గ్రామానికి కూతవేటు దూరంలో ఉందీ పల్లె. సునీత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారీ.. ముఖ్యమైన కార్యక్రమం ఏది చేపట్టినా ఇక్కడి నుంచే ప్రారంభించడం ఆనవాయితీ. ఇలాంటి సెంటిమెంట్ గ్రామం నుంచే తిరుగుబాటు మొదలైంది. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తొలి రోజే(ఈ నెల 13) మంత్రి పరిటాల సునీతను నిలదీసిన గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు, తాజాగా ఆదివారం టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరాం సతీమణి జ్ఞాన ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఆమెనూ అడ్డుకున్నారు. తమ కాలనీకి ఏం చేశారని ఓట్లు వేయాలని నిలదీశారు. దీన్నిబట్టి చూస్తే.. ఐదేళ్లలో రాప్తాడు నియోజకవర్గంలో అందనంత అభివృద్ధి చేశామని మంత్రి పరిటాల సునీత పదేపదే చెబుతున్న మాటలు ఉత్తుత్తేనని తేలిపోయింది. తాగునీటి సమస్య తీర్చలేదంటూ ఎస్సీ కాలనీవాసులు నిలదీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జ్ఞాన ఆదివారం సాయంత్రం ముత్తవకుంట్ల ఎస్సీ కాలనీలో పర్యటించగా.. స్థానికుల నిలదీతతో ఆమె ఖంగు తినాల్సి వచ్చింది. పరిటాల కోడలు జ్ఞాన, ముత్తవకుంట్ల ఎస్సీ కాలనీవాసుల సంభాషణ ఇలా.. కాలనీవాసి: ఎస్సీ కాలనీలో మేం సొంతంగా బోర్లు వేయించుకున్నాం. కరెంటు కోసం మన ఇంటివద్దకు వచ్చాం. మాకు న్యాయం చేసింది ఏమైనా ఒకటి ఉంటే అదిచూపించిన తర్వాత అవి(కరపత్రాలు) ఇవ్వండి తీసుకుంటాం. జ్ఞాన: నువ్వు బాబు(శ్రీరాం)ను కానీ, అత్తయ్య(సునీత)కు కానీ చెప్పావా? కాలనీవాసి: అత్తను కలిశాం, శ్రీరాం బాబును కలిశాం, ఇంటిదగ్గర అందరినీ కలిశాం. జ్ఞాన: బాబు(శ్రీరాం) ఏం చెప్పాడు.. వేయిస్తామని చెప్పాడా? కాలనీవాసి: ఏమీ చెప్పలేదు. రెండేళ్ల కిందట బోరు వేయించుకున్నాం. కాలనీ మహిళ: ముకుంద నాయుడు ఇంకో సర్వీస్ కట్టుకోమని చెప్పాడు. నాలుగు సర్వీస్‌లు కట్టాం. అన్నీ చేశాం. కాలనీ వాసి: ఇంతవరకూ న్యాయం జరగలేదు. ఎస్సీ కాలనీలో జెండా కట్టనివ్వలేదంటే నేనే. జ్ఞాన: అరిచి చెప్పొద్దు బాబు.. చిన్నగా చెప్పు. కాలనీవాసి: అమ్మయ్యా.. ఎస్సీ కాలనీలో జెండా కట్టనీలేదంటే నేనే. ఎందుకంటే మాకు న్యాయం జరగలేదు. ఇంతలో పక్కనే ఉన్న టీడీపీ కార్యకర్తలు కలగజేసుకుని జ్ఞానను అక్కడి నుంచి పక్కకు పిలుచుకెళ్లే ప్రయత్నం చేయగా.. మా ప్రాబ్లం మేం చెప్పుకుంటున్నాం. మీరు ఇలా తోలుకుపోతే మీరు న్యాయం చేయలేరు. మాకు న్యాయం జరగదు. మీరు చేయనీరు. జ్ఞాన: ఇంటిపై జెండా(వైఎస్సార్సీపీ) పెట్టుకున్నావు కదప్పా పీకేసెయ్ కాలనీవాసి: జెండా ఇప్పుడే కిందకు దించుతా. నువ్వు న్యాయం చేస్తావా? జ్ఞాన: 15 రోజులు గడువు ఇవ్వు. ఎన్నికలు అయిపోగానే మీ పని చేయిస్తాం. ఇంతలో టీడీపీ కార్యకర్తలు మరోమారు జోక్యం చేసుకున్నారు. జ్ఞానతో మాట్లాడిన యువకునిపై గొడవకు వచ్చారు. వారు కూడా అంతేస్థాయిలో స్పందించడంతో ప్రచారానికి వచ్చిన వారు అక్కడి నుంచి వెనుతిరిగారు. ప్రచారం తొలి రోజే నిలదీత మంత్రి పరిటాల సునీత ఈ నెల 13న కుమారుడు పరిటాల శ్రీరాంతో కలిసి వెళ్లి ముత్తవకుంట్లలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆమెకు తొలి రోజే ఎస్సీకాలనీ వాసుల నుంచి చుక్కెదురైంది. తాము తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా మీరు, మీ నాయకులు ఎవరూ పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇన్ని రోజులు మా సమస్యలు పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసం మా దగ్గరకు వస్తే మీకు ఎలా మద్దతిస్తామని నిలదీశారు. కాలనీలో దాదాపు అన్ని ఇళ్లకు వైఎస్సార్సీపీ జెండాలే కనిపించడంతో టీడీపీ నాయకులు పక్క గ్రామానికి వెళ్లిపోయారు. -
పరిటాల కుటుంబానికి షాక్
సాక్షి, అనంతపురం రూరల్: పరిటాల కుటంబానికి షాక్ మీద షాకులు తగులుతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారికి పట్టించుకోకుండా కుటంబ పాలన సాగిస్తూ కార్యకర్తలు, నాయకులను విస్మరించడంతో పరిటాల కుంటుబ సావాసం తమకు వద్దంటూ పలువురు ముఖ్య నేతలు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారు. అనంతపురం రూరల్ మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చియ్యేడు గంగాధర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలోకి చేరినవారిలో బాయకాటి దస్తగిరి, బాయకాటి చెన్నయ్య, పూలమాను దుర్గమయ్య, పూలమాను వెంకటరాముడు, ఆదిరెడ్డి, దస్తగిరి, ఈశ్వరయ్య, పల్లె మలిరెడ్డి, పరశురాముడు తదితరులు ఉన్నారు. -
‘పరిటాల కుటుంబసభ్యులే సూత్రధారులు’
అనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీత కుటుంబసభ్యులే సూరి హత్య కేసులో ప్రధాన సూత్రధారులని మద్దెలచెరువు సూరి సతీమణి గంగుల భానుమతి ఆరోపించారు. సూరి హత్య కేసు తీర్పు అనంతరం గంగుల భానుమతి విలేకరులతో మాట్లాడారు. మంత్రి పరిటాల సునీత కుటుంబీకులపై విచారణ జరిపి ఉంటే బాగుండేదన్నారు. భాను కిరణ్ ఓ కాంట్రాక్టు కిల్లర్ అని, పరిటాల సునీత కుటుంబం భానుకిరణ్‌కు సుపారీ ఇచ్చి హత్య చేయించిందని ఆరోపించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు ఉరిశిక్ష పడి ఉంటే సంతోషించే వాళ్లమని చెప్పారు. భానుకిరణ్ విశ్వాసఘాతకుడని పేర్కొన్నారు. సూరి పేరు చెప్పి భానుకిరణ్ కోట్ల రూపాయల సెటిల్మెంట్లు చేశారని వ్యాఖ్యానించారు. 2011 జనవరి 4న హైదరాబాద్‌లో గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెరువు సూరి హత్యకు గురయ్యాడు. సూరికి నమ్మకమైన అనుచరుడిగా ఉన్న భానుకిరణ్‌యే ఈ హత్యకు పాల్పడ్డాడు. కారు ముందు సీటులో కూర్చున్న సూరిపై వెనక సీటులో కూర్చున్న భానుకిరణ్ కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం పరారై మధ్యప్రదేశ్‌లో తలదాచుకున్నాడు. 2012, ఏప్రిల్‌లో భానుకిరణ్ అనూహ్యంగా జహీరాబాద్‌లో పోలీసులకు పట్టుబట్టాడు. సుదీర్ఘ విచారణ తర్వాత భానుకిరణ్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ హైకోర్టులో తీర్పు వెలువడింది. -
చమన్ మృతిపై ప్రజల్లో అనుమానాలు
సాక్షి, అనంతపురం : టీడీపీ నేత, జెడ్పీ మాజీ చైర్మన్ దూదేకుల చమన్ మృతిపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. చమన్ మృతి చెందిన రెండు రోజులకే ఆయన డ్రైవర్ నూర్ బాషా ప్రమాదంలో మరణించడం వివాదస్పదంగా మారిందని తెలిపారు. నూర్ బాషాను ఢీకొన్న కారును ఇప్పటివరకు పోలీసులు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. చమన్, పరిటాల కుటుంబం మధ్య అభ్రిప్రాయభేదాలు ఉన్నాయని.. చమన్ మృతదేహానికి వెంటనే పోస్టుమార్టం నిర్వహించాలని కోరారు. చమన్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. -
పరిటాల కోటకు బీటలు?
సొంత పార్టీలోనే తమ్ముళ్లకు విలువ లేకుండా పోయింది. మండలాలు, గ్రామాల్లో పార్టీ ఇన్చార్జిలు, జన్మభూమి కమిటీ సభ్యులను ఏర్పాటు చేయడం ద్వారా పరోక్షంగా ప్రజా ప్రతినిధుల అధికారాన్ని వాళ్లకు కట్టబెట్టినట్లైంది. వీరి పెత్తనాన్ని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే భరించలేకపోతున్నారు. ఇందులో భాగంగానే కొంత కాలంగా అసమ్మతితో రగలిన తమ్ముళ్లు ఎట్టకేలకు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదంతా రాష్ట్రమంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. * రాజకీయ పెత్తనం భరించలేకపోతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు * రాజీనామా బాటలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ కనగానపల్లి : పరిటాల కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాప్తాడు నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి రాజుకుంది. రాజకీయ పెత్తనాన్ని భరించలేని అధికార పార్టీకి చెందిన కనగానపల్లి ఎమ్పీపీ బిల్లే రాజేంద్ర, వైస్ ఎమ్పీపీ వెంకట్రామిరెడ్డి కొన్ని రోజులుగా ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సైతం వీరు పాల్గొనలేదు. జన్మభూమి కమిటీలు, పార్టీ ఇన్చార్జిల ఏర్పాటుతో ప్రభుత్వ కార్యకలాపాల్లో వీరికి సరైన ప్రాధాన్యత దక్కలేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక మొదలు మండల స్థాయి సమావేశాల్లోనూ వీరికి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. వీరితో పాటు మరో ఇద్దరు ఎమ్పీటీసీలు కూడా టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఎమ్పీపీ, వైస్ ఎమ్పీపీని వివరణ కోరగా వాస్తవమేనని ధ్రువీకరించారు. అడ్డదారులలో ఎంపీపీ దక్కించుకున్న అధికార పార్టీ: 2014లో కనగానపల్లి మండలంలో జరిగిన ఎమ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి ఆరు, టీడీపీ ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ సీపీకి చెందిన ఇద్దరు ఎమ్పీటీసీలను టీడీపీ నాయకులు లొంగదీసుకుని ఎమ్పీపీ పదవి దక్కించుకున్నారు. పదవులను కల్పించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీ నాయకులే పెత్తనం చేస్తుండడంతో టీడీపీలో అసమ్మతి రాజుకుంది. అనుకున్న రీతిలో కనగానపల్లి ఎమ్పీపీ, వైస్ ఎమ్పీపీ తమ పదవులతో పాటు ఎమ్పీటీసీ స్థానాలకు రాజీనామా చేస్తే మండలంలో పలు రాజకీయ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.