
సాక్షి, అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు, పరిటాల ఫ్యామిలీపై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. హింసా రాజకీయాలపై పరిటాల సునీత మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కౌంటర్ ఇచ్చారు.
కాగా, తోపుదుర్తి ప్రకాష్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పరిటాల అనుచరుడు జగ్గుతో నా తల్లిని తిట్టించారు. తల్లిని తిడితే కొడుకులకు బాధ ఉండదా?. జగ్గు వ్యాఖ్యలను ఏ టీడీపీ నేత కూడా ఖండించలేదు. ఎవరిది తప్పో.. ఎవరికి ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారు. కాటికి కాలు చాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికి ఉంటుంది.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 150 హత్యలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యేలు చెన్నారెడ్డి, మద్దెలచెర్వు నారాయణరెడ్డి కుటుంబాలను పరిటాల రవి చంపించారు. మద్దెలచెర్వు సూరిని చంపించింది పరిటాల సునీతే. మా సోదరుడు చందుని పరిటాల రవి చంపుతా అన్నారు. నన్ను చంపుతానని పరిటాల శ్రీరామ్ బెదిరిస్తున్నారు. హింసా రాజకీయాలపై పరిటాల సునీత మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment