paritala sri ram
-
రాప్తాడులో టీడీపీ కాకిగోల.. సాక్ష్యం ఇదిగో
-
చంద్రబాబు, పరిటాల ఫ్యామిలీపై తోపుదుర్తి షాకింగ్ కామెంట్స్
సాక్షి, అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు, పరిటాల ఫ్యామిలీపై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. హింసా రాజకీయాలపై పరిటాల సునీత మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కౌంటర్ ఇచ్చారు. కాగా, తోపుదుర్తి ప్రకాష్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పరిటాల అనుచరుడు జగ్గుతో నా తల్లిని తిట్టించారు. తల్లిని తిడితే కొడుకులకు బాధ ఉండదా?. జగ్గు వ్యాఖ్యలను ఏ టీడీపీ నేత కూడా ఖండించలేదు. ఎవరిది తప్పో.. ఎవరికి ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారు. కాటికి కాలు చాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికి ఉంటుంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 150 హత్యలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యేలు చెన్నారెడ్డి, మద్దెలచెర్వు నారాయణరెడ్డి కుటుంబాలను పరిటాల రవి చంపించారు. మద్దెలచెర్వు సూరిని చంపించింది పరిటాల సునీతే. మా సోదరుడు చందుని పరిటాల రవి చంపుతా అన్నారు. నన్ను చంపుతానని పరిటాల శ్రీరామ్ బెదిరిస్తున్నారు. హింసా రాజకీయాలపై పరిటాల సునీత మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘బాబూ పరిటాల శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడా?’
రాప్తాడు రూరల్: ‘బాబూ శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడా?’ అని పరిటాల శ్రీరామ్‌ను కనగానపల్లి మండలం తగరకుంట గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు కూతురు రామాంజనమ్మ ప్రశ్నించారు. పరిటాల శ్రీరాములుకు కుడి భుజంగా ఉన్న తన తండ్రి బోయ రామాంజనేయులు అప్పట్లో పరిటాల శ్రీరాములుతో పాటు హత్యకు గురైన వైనాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. మంగళవారం తాను మాట్లాడిన వీడియో సందేశాన్ని ఆమె పత్రికలకు విడుదల చేశారు. సందేశంలోని అంశం ఆమె మాటల్లోనే... ‘మీ నాన్న పరిటాల రవీంద్ర, మీ అమ్మ పరిటాల సునీత మంత్రులుగా పని చేసిన సమయంలో తగరకుంట రామాంజనేయులు కుటుంబం మీకు గుర్తుకు రాలేదా? మీ తాత పరిటాల శ్రీరాములు కోసం మా నాన్న బోయ రామాంజనేయులు 1975లో ప్రాణాలిచ్చాడు. బాబూ శ్రీరామ్... మీ తాత కోసం మానాన్న ప్రాణాలిచ్చాడని ఈ రోజు గుర్తించావా? ఇన్నేళ్లలో ఈ మాట ఎప్పుడైనా చెప్పావా? ఏ రోజైనా మా గురించి ఆలోచించావా? మమ్మల్ని పకలరించావా? మాకేమైనా సాయం చేశావా? మా నాన్న చనిపోయినప్పుడు నేను అమ్మ కడుపులో ఉన్నా. నాకు జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ ఎన్ని కష్టాలు ఎదుర్కొందో మాకు తెలుసు. ఈ రోజు మీ స్థాయి ఎలా ఉందో... మాస్థాయి ఎలా ఉందో ఆలోచించు. మమ్మల్ని గుర్తించింది ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఒక్కరే. ఆయన ఎంతో సాయమందించారు. భూమి ఇప్పించారు. బోరు వేయించారు. ఈ రోజు ప్రకా‹Ùరెడ్డి అన్న రూ. 500 కోట్లు సంపాదించాడని అంటున్నావు. మీ తాత ఉన్నప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో జనాలకు తెలుసు. నువ్వు అక్రమంగా ఎంత సంపాదించావో, ప్రకాశ్‌రెడ్డి ఎంత సంపాదించారో ప్రజలకు తెలుసు. మీ నాన్న, మీ అమ్మ మంత్రులుగా పని చేశారు. బోయ కులస్తులను గుర్తించి ఏ ఒక్క పదవైనా ఇచ్చారా? తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బోయ కులస్తులను గుర్తించి అనేక పదవులు ఇచ్చి ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ సొంత మండలం రామగిరిలో బోయ కులస్తులకు మీరు ఎన్ని పదవులు ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని బెదిరించి ఎంత సంపాదించావో అందరికీ తెలుసు. మీ అవినీతి అంతా ప్రజలకు తెలుసు’ అని స్పష్టం చేశారు. -
టీడీపీ నేత పరిటాల శ్రీరాంపై కేసు
-
‘పచ్చ’నోట్లు..కేరాఫ్ సిటీ!
సాక్షి, సిటీబ్యూరో: గత ఏడాది డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు.. ప్రస్తుతం జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ, రెండు రాష్ట్రాల లోక్‌సభ ఎన్నికలు.. పోటీ ఎక్కడైనా సరే ప్రజలను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ తనకు అవసరమైన డబ్బులో అత్యధికం హైదరాబాద్ కేంద్రంగానే తరలిస్తోంది. ఆ పార్టీ నేతలు, ప్రధాన అనుచరులకు సిటీ, శివారు ప్రాంతాల్లో వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. పెద్ద మొత్తాలను తరలించేందుకు హవాలా లావాదేవీలు కారణమనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న రూ.60 కోట్లు, వరంగల్ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.5.8 కోట్లు, తాజాగా రాజేంద్రనగర్ పోలీసులు గుట్టురట్టు చేసిన రూ.24 లక్షల రవాణా.. ఇవన్నీ తెలుగుదేశం పార్టీతో లింకు ఉన్నవే కావడం గమనార్హం. వ్యాపారాల ‘ముసుగు’లో తరలింపు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పరిటాల శ్రీరామ్‌కు అందించడానికని అనుమానిస్తున్న రూ.24 లక్షల నగదును సోమవారం రాత్రి రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. మియాపూర్‌లో నివసించే రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి వెంకట ప్రసాద్‌కు పటాన్చెరులో ఫ్యాక్టరీ ఉంది. దీంతో ఇతడు సమీకరించిన నల్లధనాన్ని తన డ్రైవర్‌కు ఇచ్చి పంపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ సంతోష్‌రెడ్డిని డబ్బుతో సహా పట్టుకున్న పోలీసులు.. ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ప్రసాద్ ఒక్కరే కాదు.. టీడీపీకి చెందిన అనేక మంది కీలక నాయకులకు హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు, వ్యాపారాలు ఉంటున్నాయి. వీరంతా ఎన్నికలతో పాటు కొన్ని కీలకమైన సందర్భాల్లో తమ నేతలను ‘ఆర్థికంగా ఆదుకుంటున్నారు’. ప్రలోభాలు, లంచాలకు అవసరమైన సొమ్మును తమ వ్యాపారాల ముసుగులో తరలించి వారికి అప్పగిస్తున్నారు. కొందరు దొంగ లెక్కలు చూపిస్తూ తీసుకువెళ్తుండగా మరికొందరు ఎలాంటి లెక్కలు లేకుండా తమ అనుచరులు, నమ్మినబంట్ల ద్వారా చేరాల్సిన చోటుకు తరలిస్తున్నారు. హవాలా రూపంలోనూ సరఫరా సిటీ కేంద్రంగా పనిచేస్తున్న కొందరు హవాలా వ్యాపారులను టీడీపీ వాడుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడకు డబ్బు పంపాల్సి ఉన్నా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిసీ హవాలా మార్గాన్ని ఆశ్రయిస్తోంది. ఆ పార్టీకి చెందిన నేతలు ఈ నగదు సరఫరాల్లో కీలక దళారులుగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అప్పట్లో జగిత్యాలకు రూ.60 లక్షలు పంపడానికి తెలంగాణ రాష్ట్ర తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్, జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ సెక్రటరీ వల్లభనేని అనిల్‌కుమార్ ప్రయత్నించారు. తన డ్రైవర్‌తో హవాలా వ్యాపారుల నుంచి ఈ మొత్తం తీసుకుని జనగాం పంపేలా పథకం వేశాడు. ఈ కేసులో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నలుగురిని పట్టుకున్నారు. ఇలా చిక్కిన ఉదంతాలు అతి తక్కువేని, చాపకింద నీరులా ‘పచ్చనోట్ల’ ప్రవాహం జోరుగా సాగిపోతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ పోలీసులకు చిక్కిన రూ.5.8 కోట్లు కూడా అప్పట్లో తెలుగుదేశం, మహా కూటమి నేతలకు అందించడానికి తీసుకువెళ్తున్నవే కావడం గమనార్హం. పోలీసుల నిఘా ముమ్మరం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో నగరం నుంచి భారీగా డబ్బు అక్రమ రవాణా అవుతోందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తయ్యారు. ప్రధానంగా నగర వ్యాప్తంగా ఉన్న హవాలా, హుండీ వంటి అక్రమ ద్రవ్యమార్పిడి రాకెట్లపై డేగ కన్ను వేశారు. ఈ లావాదేవీలు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాలు, మార్కెట్లలో మఫ్టీ పోలీసులను మోహరించారు. రాష్ట్ర, కమిషరేట్ల నిఘా అధికారులు సైతం విస్తృత సమాచారం సేకరిస్తున్నారు. మరోపక్క నియోజకవర్గాలు, కమిషనరేట్లు, నగరాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. లాడ్జిలు, హోటళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. నగరం నుంచి బయటకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని నిర్ణయించారు. -
బెదిరింపనుకోండి.. వార్నింగనుకోండి!
సాక్షి, అనంతపురం: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో జిల్లాలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న బెదిరింపులు తారస్థాయికి వెళ్తున్నాయి. వారి మాటాలు సామాన్య ప్రజలను భయోత్పాతానికి గురి చేస్తున్నాయి. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో బరితెగింపులకు దిగుతుండడం పట్ల ప్రజలు విస్మయం చెందుతున్నారు. నిజంగా వారిని గెలిపిస్తే కలిగే ఇబ్బందులను తలుచుకుంటూ ఆందోళన చెందుతున్నారు. ‘నన్ను గెలిపించండి. ఎమ్మెల్యే కాగానే ఆర్నెల్లు అవకాశం ఇస్తా. ప్రత్యర్థులను కాళ్లు చేతులు విరచండి. చంపుతారా చంపండి. నేను చూసకుంటా’నని ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బెదిరించిన వైనం మరువకముందే రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి ఎంపీపీ భర్త చేసిన బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘వచ్చేది మా ప్రభుత్వమే. పరిటాల శ్రీరామ్ అసెంబ్లీకి పోతాడు. ఎన్నికలలోపు అందరూ తెలుగుదేశం వైపు రావాలి. లేదంటే మీ ఇష్టం’ అంటూ కనగానపల్లి ఎంపీపీ పద్మగీత భర్త ముకుందనాయుడు బీసీ, ఎస్సీలను బహిరంగంగా బెదిరింపులకు గురి చేశారు. ఈ నెల 13న కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల పంచాయతీ తల్లిమడుగుల గ్రామంలో మంత్రి పరిటాల సునీత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్వయానా మంత్రి సమక్షంలో బహిరంగ సభలో ఎంపీపీ భర్త ఇచ్చిన వార్నింగ్ దుమారం రేపుతోంది. ‘కచ్చితంగా మళ్లీ మేమే అధికారంలో ఉంటాం. పరిటాల శ్రీరామ్ అసెంబ్లీకి వెళ్తాడు. గుర్తు పెట్టుకోండి. బెదిరింపు అన్నా అనుకోండి, వార్నింగ్ అన్నా అనుకోండి. పద్ధతిగా ఉండండి. మారేందుకు అవకాశం ఇస్తున్నాం. ఎన్నికల్లోపు ఈ పక్క ఉండాలి. పొరబాటు జరిగిందంటే మాత్రం వచ్చే మా ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. దీనికి రెడీగా ఉండండి’ అంటూ హెచ్చరించారు. పరిటాల కుటుంబ దౌర్జన్యాలకు పరాకాష్ట పరిటాల కుటుంబం సాగిస్తున్న దౌర్జన్యాలకు ఈ ఘటన పరాకాష్టగా నిలుస్తోందని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. తాము చేసే మంచి పనులను ప్రజలకు వివరించి, వారిలో అభిమానం సంపాదించి ఓట్లు వేయించుకోవడం తప్పు కాదని, అయితే బలవంతంగా తమ పార్టీకే ఓట్లు వేయాలనే ధోరణిలో బెదిరింపులకు దిగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పరిటాల శ్రీరామ్ సూచనల మేరకే ముకుందనాయడు ఇలా బెదిరిస్తున్నారని, ఆయన్ను గెలిపిస్తే ఆరాచకాలు మితిమీరిపోతాయంటూ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి బెదిరింపులకు ఓటు ద్వారా బుద్ధి చెబుదామని స్పష్టం చేస్తున్నారు. -
దందాగాళ్లు!
ధర్మవరంలో గత మే నెల ఓ భూ దందాకు సంబంధించి వెంకటేశ్ అనే వ్యక్తి విషయంలో ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి, మంత్రి పరిటాల సునీత వర్గీయుల మధ్య వివాదం నడిచింది. ఓ వర్గం నేతలు వెంకటేశ్‌ను కిడ్నాప్ చేశారు. ఈ వ్యవహారం పోలీసులకు తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. బెంగళూరుకు చెందిన సలీమ్ అనే వ్యక్తిని ఓ ప్రజాప్రతినిధి అనుచరులు అనంతపురం సమీపంలో బెంగళూరు హైవేపై కిడ్నాప్ చేశారు. ఈ వ్యక్తులు రెండు రోజుల పాటు సలీం అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో నగదును తమ అకౌంట్‌కు బదిలీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు తెలిస్తే ఇబ్బంది అవుతుందనే ఆలోచన కూడా కిడ్నాపర్లకు లేకపోయింది. కారణం.. ఓ ముఖ్య ప్రజాప్రతినిధి కుమారుని అండదండలే. ... ఈ రెండు ఉదాహరణలే కాదు, ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే జిల్లాలో పాలేగాళ్ల రాజ్యం సాగుతోందా? అనే అనుమానం కలుగక మానదు. ఇదే సమయంలో నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన పోలీసుల తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఏ నలుగురు గుమికూడినా అధికార పార్టీ దందాలపర్వమే చర్చనీయాంశం. టీ కొట్టులోకి తొంగి చూసినా.. కిడ్నాప్ వ్యవహారాలే పొగలు కక్కుతుంటాయి. ఇక పోలీసుల పనితీరు చెప్పనక్కర్లేదు. పోలీసుస్టేషన్‌కు వెళితే న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతోంది. అంతకన్నా.. ఏ నాయకుని కాళ్లో పట్టుకుంటే డబ్బయినా మిగులుతుందనే భావన వ్యక్తమవుతోంది. అధికార పార్టీ సాగిస్తున్న దందాలతో జిల్లా అట్టుడుకుతోంది. అస్మదీయులకుమేలు చేకూర్చేందుకు.. ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతకైనా బరితెగిస్తుండటం చూస్తే పోలీసులు ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. ఎంతో ఆశతో పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కితే.. ఒక్క ఫోన్ కాల్‌తో ‘అన్యాయం’ ఇంతెత్తున లేచి పడుతోంది. జీ..హుజూర్ అంటూ నాలుగో సింహం కూడా వంగి వంగి దండాలు పెట్టడం ఖాకీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. ఆ మూడు నియోజకవర్గాల్లో మరీ దారుణం ధర్మవరం, తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గాలు జిల్లాలో మరింత భిన్నం. ఏదైనా సహాయం కోసం, వివాదాలతో న్యాయం చేస్తారని స్థానిక ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తారు. కానీ వారే దందాలకు తెగబడటం, సాయం చేసినందుకు భారీగా డబ్బు డిమాండ్ చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. కొంతమంది తప్పని పరిస్థితుల్లో నేతలు చెప్పినట్లే వింటున్నారు. పోలీసుస్టేషన్‌కు వెళితే వారికి అక్కడి ఎమ్మెల్యే ఫోన్ చేసి ఎలా నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తే ఆ విధంగానే వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సామాన్యులకు ఇటు ఎమ్మెల్యేలపైన, అటు పోలీసుల పట్ల పూర్తిగా నమ్మకం సన్నగిల్లింది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా సలీం వ్యవహారంలో ధర్మవరానికి చెందిన భాస్కర్‌నాయుడు, సలీంలు ఇద్దరూ ‘రైస్‌పుల్లింగ్’ బిజినెస్ చేసేవారని తెలుస్తోంది. ఈ వ్యవహారం కొద్దిరోజులుగా సాగుతోంది. కిడ్నాప్ వ్యవహారంలో ఇదే కీలకం. ఈ ప్రాంతాల్లో భూ దందాలైతే చెప్పాల్సిన పనిలేదు. ప్రజాప్రతినిధులు, వారి బంధువులు ప్రాంతాలను భాగాలుగా పంచుకుని దందాలు చేస్తున్నారు. ‘భూ దందా’లకు సంబంధించి ప్రతీ పోలీసుస్టేషన్‌కు బాధితులు వస్తున్నారు. వీరిలో అధికారపార్టీ సిఫార్సుకే పెద్దపీట వేస్తుండటం గమనార్హం. -
'జిల్లాకో గ్యాంగ్ లీడర్ని తయారు చేస్తున్నారు'
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతలు జిల్లాకో గ్యాంగ్ లీడర్‌ను, ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ టీడీపీ ఆగడాలు రోజురోజూకు పేట్రేగిపోతున్నాయనడానికి అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే టీ ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యలే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. టీడీపీ ఫ్యాక్షనిజానికి ఆ పార్టీ నేతలే బెంబేలెత్తుతున్నారని విమర్శించారు. పౌర సరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ యువసేన పేరుతో దాడులు, దౌర్జన్యాలు చేస్తుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. ప్రైవేట్ సైన్యం పేరుతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని వారిని ఉద్దేశించి అన్నారు. ఎన్నికల అనంతరం 16 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను టీడీపీ నేతలు పొట్టన పెట్టుకున్నారని ఆమె గుర్తు చేశారు. దీనిపై తక్షణమే సమాధానం చెప్పాలని టీడీపీ నేతలను వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్‌ల గుండాయిజం, రౌడీయుజంపై టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మీడియా ఎదుట ప్రదర్శించారు. -
పరిటాల శ్రీరాం వాహనాల్లో మారణాయుధాలు
అక్రమ ఆయుధాలతో పట్టుబడిన 2 స్కార్పియోలు నాలుగు నంబర్ ప్లేట్లు, వాకీ టాకీలు స్వాధీనం ఘటన స్థలం నుంచి పారిపోయిన శ్రీరాం, అనుచరులు అనంతపురం రాప్తాడు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిటాల సునీత ప్రచార వాహనాల ను తనిఖీ చేస్తుండగా రెండు అనుమతి లేని వాహనాల్లో మారుణాయుధాలు, నెంబరు ప్లేట్లు, వాకీ టాకీలు, పలు కేసుల్లో నిందితులను పోలీసులు గుర్తించారు. వారు తేరుకునే సరికి పరిటాల శ్రీరాం సహా అనుచరులు.. ఆయుధాలు, ఇతర వస్తువులను తీసుకుని వెనుక ఉన్న వాహనాల్లో ఉడాయించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు.. చెన్నేకొత్తపల్లి మండలంలో సోమవారం రాత్రి 10.30 గం.లకు పరిటాల సునీత తరఫున ఆమె కుమారుడు శ్రీరాం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.. ఇతని కాన్వాయ్‌లో అనుమతి లేని వాహనాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు బసంపల్లి వద్ద తనిఖీల కోసం వాటిని ఆపారు. వాటిలో రెండు బ్లాక్ స్కార్పియోలకు అనుమతి లేకపోవడంతో వాటిని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తామని చెప్పారు. అయితే ఆ వాహనాల్లో అక్రమ ఆయుధాలు, వాకీటాకీలు, నంబర్ప్లేట్లు, మందు బాటిళ్లు కూడా ఉన్నాయి. ఇవి పోలీసులకు చిక్కకుండా శ్రీరాం.. ఆయన అనుచరులు వాటిని చేతబట్టుకుని పరుగున వెళ్లి వెనుక ఉన్న వాహనాల్లో అక్కడి నుంచి పారిపోయారు. అనుమతి లేని ఆ రెండు వాహనాలను మాత్రం పోలీసులు సీజ్ చేసి చెన్నేకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన వాహనాల్లో తగరకుంట కొండారెడ్డి హత్యకేసులో నిందితుడు తగరకుంట వినయ్‌కుమార్‌తో పాటు కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి హత్యాయత్నం కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులు ఉన్నట్లు సమాచారం. వీరంతా పోలీసులకు దొరకకుండా పారిపోయారు. కొంత మంది పోలీసులు ఈ విషయాన్ని గమనించినా, వాహనాలపై మాత్రమే వారు దృష్టి సారించినట్లు తెలిసింది. ఈ సంఘటనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
రెండింటిపై కన్ను!
విభేదాలకు ఆజ్యం పోస్తున్న పరిటాల శ్రీరామ్ అరంగేట్రం రాప్తాడు నుంచి బరిలోకి దించడానికి పరిటాల సునీత వ్యూహం పెనుకొండలో బీకే వ్యతిరేక వర్గీయులతో సునీత తరచూ సమావేశం తమ కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వాలని బాబుపై సునీత ఒత్తిడి కలవరపడుతోన్న బీకే పార్థసారథి.. పయ్యావుల ద్వారా బాబుతో చర్చలు సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ అరంగేట్రం టీడీపీలో ముసలాన్ని పుట్టించింది. పెనుకొండ నుంచి తనకూ.. రాప్తాడు నుంచి తనయుడికి టికెట్లు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబుపై పరిటాల సునీత తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఇది బీకే పార్థసారథిని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. పయ్యావుల కేశవ్ సహకారంతో పరిటాల సునీత ఎత్తుగడను నీరుగార్చేందుకు బీకే పార్థసారథి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎన్నికలు ముం చుకొస్తోన్న వేళ టీడీపీలో టికెట్ల కొట్లాట ప్రారంభమైంది. 2014 ఎన్నికల్లో ఎలాగైనా తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను రాజ కీయ అరంగేట్రం చేయించాలని పరిటాల సునీత పట్టుదలతో ఉ న్నారు. ఇటీవల జరిగిన సహకార, పంచాయతీ ఎన్నికల్లో రా ప్తాడు నియోజకవర్గంలో టీడీపీ వరుస పరాజయాలను చవిచూసింది. ఆ ఫలితాలతో రాప్తాడు నియోజకవర్గంలో తనకు ప్రతి కూల పరిస్థితి ఉందనే భావనకు వచ్చిన పరిటాల సునీత.. పెనుకొండపై కన్నేశారు. రాప్తాడు నుంచి తనయుడు పరిటాల శ్రీరామ్‌ను బరిలోకి దించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పరిటాల సునీత సూచనల మేరకు పరిటాల శ్రీరామ్ రా జకీయంగా క్రియాశీలకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో పెనుకొండ నియోజకవర్గంపై పరిటాల సునీత ప్రత్యేక దృష్టి సారించారు. 2009 ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొద్ది నెలల్లోనే పరిటాల రవి వర్గీయులతో ఎమ్మెల్యే బీకే పార్థసారథి విభేదించారు. బీకే పార్థసారథి తమ మాటను ఖాతరు చేయడం లేదనే నెపంతో పరిటాల రవి వర్గీయులు ఆయనకు వ్యతిరేకంగా జట్టుకట్టారు. ఇటీవల ఆ వర్గంతో పరిటాల సునీత తరచూ సమావేశమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున తానే పోటీ చేస్తానని అనుచరులతో ఆమె స్పష్టీకరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే అంశంపై ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుతో పరిటాల సునీత భేటీ అయ్యారు. తనకు పెనుకొండ నుంచి.. తనయుడికి రాప్తాడు నుంచి అవకాశం కల్పించాలని డిమాండ్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాప్తాడు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకోవాలంటూ పరిటాల సునీత డిమాండ్‌ను చంద్రబాబు సున్నితంగా తోసిపుచ్చినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. కానీ.. పరిటాల సునీత తన డిమాండ్‌పై వెనక్కు తగ్గలేదు. తమ వ్యతిరేకులకు పార్టీలో స్థానం కల్పిస్తోన్న నేపథ్యంలో.. రాప్తాడుతోపాటూ పెనుకొండ స్థానాన్ని కూడా తమకే కేటాయించాలని చంద్రబాబును కో రినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆ ప్రతిపాదనకు అంగీకరించని పక్షంలో.. తమ వ్యతిరేక వర్గాలకు పార్టీ తీర్థం ఇ చ్చే ప్రతిపాదనను వ్యతిరేకిస్తామని చంద్రబాబు కోటరీ అయిన సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావులతో ప రిటాల సునీత తెగేసి చెప్పినట్లు సమాచారం. బీకే పార్థసారథిని హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించాలని సు నీత సూచించారు. పెనుకొండపై కన్నేయడంతో బీకే పార్థసారథి తేరుకున్నారు. హిందూపురం లోక్‌సభ స్థానంలో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోండటం.. సిటింగ్ ఎంపీగా నిమ్మల కిష్టప్ప ఉండటంతో తనకు టికెట్ వచ్చే అవకాశాలు ఉండవని బీకే అంచనా వేస్తున్నారు. ఇటీవల చంద్రబాబుతో సమావేశమై పెనుకొండ టికెట్‌ను తనకే కేటాయించాలని కోరగా,బాబు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం బీకేను కలవర పరిచింది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ద్వారా పెనుకొండ టికెట్‌ను తనకే కేటాయించేలా చంద్రబాబుపై బీకే పార్థసారథి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.