
పార్టీలోకి చేరిన గంగాధర్‌రెడ్డి తదితరులు
సాక్షి, అనంతపురం రూరల్: పరిటాల కుటంబానికి షాక్ మీద షాకులు తగులుతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారికి పట్టించుకోకుండా కుటంబ పాలన సాగిస్తూ కార్యకర్తలు, నాయకులను విస్మరించడంతో పరిటాల కుంటుబ సావాసం తమకు వద్దంటూ పలువురు ముఖ్య నేతలు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారు. అనంతపురం రూరల్ మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చియ్యేడు గంగాధర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలోకి చేరినవారిలో బాయకాటి దస్తగిరి, బాయకాటి చెన్నయ్య, పూలమాను దుర్గమయ్య, పూలమాను వెంకటరాముడు, ఆదిరెడ్డి, దస్తగిరి, ఈశ్వరయ్య, పల్లె మలిరెడ్డి, పరశురాముడు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment