సాక్షి, తాడేపల్లి: వివేకానందరెడ్డి హత్య కేసును టీడీపీ వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మట్లాడుతూ.. వివేకా హత్య కేసు ద్వారా టీడీపీకి పునర్ వైభవం వస్తుందని కలలు కంటున్నారు. కేసు విచారణలో ఉండగానే నిందలు వేస్తున్నారు. వీలైతే జగన్‌మోహన్‌రెడ్డిపై కూడా నింద వేయాలని కుట్రలు చేస్తున్నారు.
ఆ మూడు నెలల కాలంలో ఏం తేల్చారు..?
టీడీపీ అధికారంలో ఉండగా జరిగిన హత్య ఇది. ఆ మూడు నెలల కాలంలో ఏమి తేల్చగలిగారు..?. ఎంతో మంది అధికారులు ఎన్ని విధాలుగా హింసించినా నిందితులు వాస్తవాలు చెప్పలేదు. ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి, ఆదినారాయణ రెడ్డి జిల్లాలో మంత్రి. ఆయన ఆస్తులను రెండో కుటుంబానికి ఇస్తాడనే భయంతో నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి.. ఆదినారాయణ రెడ్డితో స్నేహం చేశాడు. హత్య రోజు లభ్యమైన లేఖ విషయాన్ని టీడీపీ, పత్రికలు ఎందుకు ప్రస్తావించడం లేదు. దాన్ని దాచి ఉంచమని చెప్పింది ఎవరు. సీబీఐ ఆ లేఖను మరణ వాంగ్మూలంగా ఎందుకు తీసుకోలేదు..?. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలను ఎందుకు విచారించడం లేదు.
చదవండి: (నెల రోజుల్లో 13 పార్కులను ప్రారంభించబోతున్నాము: మంత్రి అనిల్)
ఆ తీరు చూస్తుంటే అనేక అనుమానాలు
టీడీపీ నాయకులు, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిల మధ్య జరుగుతున్న సంభాషణలు బయటకు రావాలి. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తికి వారసుడు కావాలని భావించాడు. లోకేష్ మీ బాబాయిని మీరు ఎలా చూసుకుంటున్నారో.. అలానే సీఎం జగన్ వాళ్ళ బాబాయిని చూసుకుంటాడు అనుకుంటున్నారా..?. విచారణ సంపూర్తిగా బయటకు రావాలని ఆ రోజు సీబీఐ విచారణ కోరితే సిట్ వేసింది చంద్రబాబే. ఎప్పుడైతే సునీత తమ చేతల్లోకి వచ్చారో అప్పటి నుంచి చంద్రబాబు రాజకీయం మొదలెట్టాడు. హత్య చేయించింది చంద్రబాబా...? చేసింది నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే అనుమానాలు ఉన్నాయి. వెంటనే వారిని విచారించాలని డిమాండ్ చేస్తున్నాం.
చదవండి: (ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం)
వాళ్లే హత్య చేసి దాన్ని 2019 ఎన్నికలో వాడుకోవాలని కుట్ర చేసి ఉంటారు. సాక్షులను ముద్దాయిలా మారుస్తున్న తీరు చూస్తుంటే అనేక అనుమానాలు వస్తున్నాయి. ఆ రోజు జగన్‌పై సీబీఐ కేసులో చేసిన విధంగానే ఇప్పుడూ చేస్తున్నారు. జగన్‌ని ఎదుర్కోలేక ఇటువంటి కుట్రలు చేస్తున్నారు. వివేకా హత్యను వైఎస్ కుటుంబంపై నింద మోపి లబ్ధి పొందాలని చూస్తున్నారు. వీటన్నింటిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని' ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment