పోలీసుల పనితీరు అనుమానాస్పదంగా ఉందని రాప్తాడు వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.
అనంతపురం: పోలీసుల పనితీరు అనుమానాస్పదంగా ఉందని రాప్తాడు వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా కనగానపల్లె వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త ముత్యాలుపై అక్రమ కేసు పెట్టి.. ఆ కుటుంబాన్ని పోలీసులు వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఆదివారం అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. మరో వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసులో పరిటాల వర్గీయులను పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నిజాయితీ గల ఎస్‌ఐ హమీద్‌ఖాన్‌ను బదిలీ చేయడం అన్యాయమని ప్రకాశ్ రెడ్డి చెప్పారు.