
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ సీపీ నేత, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై ఫైర్ అయ్యారు. బాబు జాతీయ నాయకుడు కాదని, ఓ గల్లీ లీడర్ అని విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక సామాజిక వర్గం కోసం చంద్రబాబు పోరాడుతున్నారని అన్నారు. అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు ఉద్యమం చేయిస్తున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమని, అదే డబ్బుతో ఏపీలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలలోని పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయవచ్చన్నారు. అమరావతిలో టీడీపీ ఓడిపోయిన విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. రాయలసీమ వెనుకబాటుకు చంద్రబాబే కారణమని, బాబు రాయలసీమ ద్రోహి అని విమర్శించారు. ‘చంద్రబాబు! నీకు ఏపీ ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యమా?’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment