
సాక్షి,అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. ఉన్నది ఉన్నట్లు చెప్పే మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి వైఎస్ జగన్ అని, ఒకో మనిషి దగ్గర ఒకో మాట చెప్పే నీచమైన వ్యక్తిత్వం చంద్రబాబుదని విమర్శించారు. హోదా కోసం చిత్తశుద్ధితో నిజాయితీగా పోరాటం చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని, హోదా కోసం రాజీనామా చేస్తామంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.
ఆయన మాటలు అర్థం కావు..
ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కావడం లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు మాట్లాడిన తీరు ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు వైఖరి పట్ల ఆ పార్టీ శాసనసభ్యులే విసిగిపోయి, పక్క చూపులు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశం గర్వించే దిశగా సీఎం జగన్ పాలన జరుగుతోందన్నారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను చూసి టీడీపీ ఓర్వలేక పోతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ప్రజలు కొనియాడుతుంటే...ప్రతిపక్షం మాత్రం అక్కసు తో విమర్శలు చేస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పై చంద్రబాబు మాట్లాడుతున్న భాష సరైనది కాదన్నారు. చంద్రబాబు పార్టీ లో పట్టుకోల్పోయారని.. ఆయనను సొంత పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడం లేదన్నారు.
ఆయనకు ఉనికి కోల్పోతున్నామనే భయం పట్టుకుంది..
మహిళా బిల్లుపై సభలో చర్చ జరుగుతుంటే ఉల్లి పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు లొల్లి చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ధ్వజమెత్తారు. సభా సమయాన్ని వృథా చేసి.. సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సినిమా డైలాగ్స్‌తో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తీరు గురువింద గింజ సామెతను గుర్తు చేస్తోందన్నారు. సీఎం జగన్ చేస్తోన్న ప్రజారంజక పాలనతో.. ఉనికిని కోల్పోతున్నామన్న భయం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు..
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. రాయలసీమలో చిచ్చు పెట్టి తన ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్ సమక్షంలో నాపై కామెంట్లు చేసిన వ్యక్తి.. టీడీపీ నేతల అనుచరుడని పోలీసులు చెబుతున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment