'నన్ను చంపేందుకు పరిటాల కుటుంబం కుట్ర' | thopudurthi prakash reddy takes on paritala sunitha family | Sakshi
Sakshi News home page

'నన్ను చంపేందుకు పరిటాల కుటుంబం కుట్ర'

Published Tue, May 31 2016 9:49 AM | Last Updated on Tue, May 29 2018 2:42 PM

నన్ను చంపేందుకు పరిటాల కుటుంబం కుట్ర పన్నిందని అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ఆరోపించారు.

అనంతపురం : నన్ను చంపేందుకు పరిటాల కుటుంబం కుట్ర పన్నిందని అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ఆరోపించారు. మంగళవారం అనంతపురంలో తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి విలేకర్లలో మాట్లాడుతూ.... సోమవారం ప్రభుత్వాసుపత్రిలో పరిటాల వర్గీయులు తనపై దాడికి తెగపడ్డారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాకు గన్మన్లను ఉపసంహరించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ఆమె కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహానీ ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాప్తాడులోని టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని పరిటాల కుటుంబం జీర్ణించుకోలేకపపోతోందని  వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి చందు మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు భౌతిక దాడులు జరుగుతున్నాయని...అయినా పట్టించుకోవడం లేదని పోలీసులపై  ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement