సాక్షి, అనంతపురం : గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడులో అమరావతిలో గ్రాఫిక్స్ తప్ప ఏమి చేయలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు రూ. లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నకాలంలో రాయలసీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని, ఆయన సీమ ద్రోహి అని విమర్శించారు.
రాయలసీమ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, లక్షలమంది వలసలు వెళ్లినప్పుడు జోలె పట్టని చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు జోలె పట్టి అడుకుంటున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలంతా కోటీశ్వరులైనప్పుడు చంద్రబాబు ఎందుకు జోలె పట్టారని ఎద్దేవా చేశారు. అమరావతి ఓ భ్రమరావతి అని, చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్‌తో కాలయాపన చేశారని విమర్శించారు. లక్షల కోట్ల రూపాయల రాజధాని వద్దని.. సాగునీటి ప్రాజెక్టులే ముద్దని ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. దీనిపై శుక్రవారం సాయంత్రం అనంతపురంలో సభ నిర్వహిస్తామని చెప్పారు. రాజధాని విషయంలో టీడీపీ నేతలు చెబుతున్నా మాటలు విని రైతులు మోసపోవద్దని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment