
సాక్షి, ప్రకాశం: యువగళం పేరుతో జనాదరణకు దూరంగా.. సెల్ఫీ(ల్ఫ్) పాదయాత్ర చేసుకుంటూ పోతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు బిత్తరపోయే దృశ్యం కనిపించింది. ఒంగోలులో లోకేష్‌కు ఝలక్ ఇచ్చేలా కొందరు తెలుగు తమ్ముళ్లే ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్‌ను హైలెట్ చేస్తూ పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తలు.. ‘‘అసలోడు వచ్చేవరకూ కొసరోడికి పండగే’’ అంటూ ప్రధాన కూడలలో వాటిని ఏర్పాటు చేశారు. ఒకవేళ.. భవిష్యత్తులో ఎప్పుడైనా టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆరే సీఎం అవుతాడంటూ అందులో రాసి ఉంచారు. దీంతో ఫ్లెక్సీని చూసి ఉలిక్కిపడ్డ లోకేష్ అనుచరగణం దానిని తొలగించే యత్నం చేసింది. బహుశా ఇది జూనియర్ ఫ్యాన్స్ పని అయ్యి ఉండొచ్చనే చర్చ నడుస్తోంది.
ఇదే ఫ్లెక్సీ లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్(స్వర్గీయ) ఫొటోతో పాటు .. లోకేష్ తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు బొమ్మ కూడా ఉండడం గమనార్హం. ఇక లోకేష్‌ను ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని.. సిసలైన వారసులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాంటూ ఓ వర్గం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment