ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, బీఆర్‌ఎస్ బలోపేతమే లక్ష్యం: కేటీఆర్
ఇప్పుడు జరుగుతున్న నష్టం నుంచి తెలంగాణ కోలుకోవడం కష్టమే
రాజకీయాల్లోకి కుటుంబాలను లాగడం అత్యంత నీచం
త్వరలో పార్టీ సోషల్ మీడియా బృందంతో సమావేశం
కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో మార్గదర్శనం చేస్తున్నారు
పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం
చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న పోలీసులను వదిలిపెట్టబోమని వ్యాఖ్య
కొత్త సంవత్సరంలో కేసీఆర్ జనంలోకి వస్తారని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పార్టీ కార్యకర్తల కోరిక మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా తన పాదయాత్ర ఉంటుందని చెప్పారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం అత్యంత నీచమన్నారు. తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగుతున్న సీఎం రేవంత్, ఆయన వందిమాగధులపై ప్రజల మద్దతుతో పోరాటం చేస్తానని పేర్కొన్నారు. గురువారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ‘ఆస్క్ కేటీఆర్’పేరిట నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. ఆయా అంశాలు కేటీఆర్ మాటల్లోనే..
ఈ నష్టం నుంచి కోలుకోవడం కష్టమే..
‘‘తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన ఒక శాపంగా మారింది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు కాంగ్రెస్ ప్రారంభించిన రాజకీయ వేధింపులకు భయపడేది లేదు. కాంగ్రెస్ పాలన ఢిల్లీ నుంచి, ఢిల్లీ కోసమే అన్నట్టుగా తయారైంది. రాష్ట్రం నుంచి పెట్టుబడులు కూడా వెనక్కి మళ్లుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న నష్టం నుంచి తెలంగాణ కోలుకోవడం కష్టమే. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే పారీ్టకి తెలంగాణను ముందుకు తీసుకెళ్లడం అతిపెద్ద సవాల్‌గా మారుతుంది.
రాజకీయాల్లోకి కుటుంబాలను లాగడం నీచం
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఇతరుల కుటుంబ సభ్యులను రాజకీయ అంశాల్లోకి లాగలేదు. సుమారు రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులను అవహేళన చేసి మాట్లాడినప్పుడు, రాజకీయాలు వదిలేయాలన్నంత భావోద్వేగానికి గురయ్యాను. కేవలం రాజకీయాల కోసం ఇతరుల కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతారో అర్థం కాదు. రేవంత్ అధికారంలోకి వచి్చన తర్వాత ఈ నీచ రాజకీయ సంస్కతి అత్యంత హీనదశకు చేరుకుంది. కాంగ్రెస్‌ను ఐదేళ్ల కోసం ప్రజలు ఎన్నుకున్నారు. ఈ సీఎం ఐదేళ్లు పదవిలో ఉంటారా లేదా అనేది చెప్పలేం. కాంగ్రెస్‌లో ఎప్పుడైనా ఎలాంటి పరిణామమైనా జరగొచ్చు.
ఆ అధికారులను గుర్తుపెట్టుకుంటాం!
విధులు మరిచి, చట్టవిరుద్ధంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై రెచి్చపోతున్న పోలీస్ అధికారులను గుర్తుపెట్టుకుని.. మేం అధికారంలోకి వచి్చన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ అధినేతలను ప్రసన్నం చేసుకునే పనుల్లో కొందరు పోలీసు అధికారులు బిజీగా ఉండటంతో శాంతిభద్రతలు క్షీణించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలసి పనిచేస్తున్నాయి. ఇచి్చన హామీలను అమలు చేయని కాంగ్రెస్ వంటి పారీ్టలపై చర్యలకు బలమైన సంస్కరణలు అవసరం.
కొత్త సంవత్సరంలో జనంలోకి కేసీఆర్..
ఎన్నికల్లో ఓటమి తర్వాత సామాజిక మాధ్యమాల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు ప్రపంచవ్యాప్తంగా బాగా యాక్టివ్‌గా మారారు. త్వరలో సోషల్ మీడియా విభాగంతో విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. పార్టీ అధినేత కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో పారీ్టకి, నాయకులకు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తున్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ ఇచ్చిన 420 హమీల అమలుకు సరిపడా సమయం ఇచ్చారు. నూతన సంవత్సరం తర్వాత ఆయన నుంచి మరిన్ని కార్యక్రమాలను చూస్తాం. ప్రతిపక్ష పారీ్టగా నూతన నాయకత్వాన్ని తయారు చేసుకునే అవకాశం వచి్చంది. పార్టీ ఫిరాయింపులు జరిగిన పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక ఖాయం..’’అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment