గణపవరం/నిడమర్రు: లోకేశ్ పాదయాద్ర సందర్భంగా టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ నేతల ఫ్లెక్సీలపై రాళ్లు విసిరారు. ప్రశ్నించినవారిపై దాడికి పాల్పడ్డారు. ఆదివారం ఉంగుటూరు నియోజకవర్గం మందలపర్రుకు లోకేశ్ పాదయాత్ర చేరుకోగానే.. గతంలోనే గ్రామంలో పెదనిండ్రకొలనుకు చెందిన టీటీడీ పాలక మండలి సభ్యుడు గాదిరాజు వెంకటసుబ్బరాజు(పెదబాబు) కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు ఫ్లెక్సీపై టీడీపీ నాయకులు రాయి విసిరారు. అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, పెదబాబు అభిమానులు ప్రశ్నించడంతో టీడీపీ కార్యకర్తలతోపాటు యువగళం వలంటీర్లు వారిపై దాడి చేశారు.
పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలు గాయపడ్డారు. మరోవైపు తనకు ఏ పార్టీతో సంబంధం లేకపోయినా యువగళం వలంటీర్లు దాడి చేశారని నిడమర్రుకు చెందిన పిట్టా రామకృష్ణ అవేదన వ్యక్తం చేశారు. స్కూటర్‌పై వెళుతూ లోకేశ్‌ను చూసేందుకు ఆగానని, టీడీపీ నేతలు, వలంటీర్లు తన బట్టలు చింపేసి కొట్టారని, తన బైక్‌ను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
లోకేశ్ వెంట జనం లేకనే వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు విమర్శించారు. తన ఫ్లెక్సీలపై రాళ్లు విసురుతున్నా అడ్డుకోవడం మానేసి చోద్యం చూస్తుండటం లోకేశ్‌కే చెల్లిందని పెదబాబు వ్యాఖ్యానించారు. కాగా, ఆదివారం రాత్రి ఏలూరు జిల్లా గణపవరంలో ఏర్పాటుచేసిన సభలో లోకేశ్ ప్రసంగిస్తూ ఒక్క హామీని సీఎం జగన్ నెరవేర్చలేదన్నారు. నాలుగేళ్లు అభివృద్ధికి దూరం చేశారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment