
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుకు కేంద్రం కుట్ర చేస్తోందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. ఉపాధి హామీ పై కేంద్రం వైఖరిని నిరసిస్తూ సమష్టిగా జాతీ యస్థాయిలో పోరాటం చేస్తామన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ వ్యవ సాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు–సవాళ్లు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీజేపీయే తర రాష్ట్రాలపై కేంద్రం కక్ష సాధింపునకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఉద్దేశపూర్వ కంగానే రాష్ట్రాలకు కఠిన నియమాలు పెడు తూ వేధిస్తోందన్నారు. కేరళ మంత్రి ఎంబీ రాజేశ్ మాట్లాడుతూ.. కూలీల కోసం ఏ సౌక ర్యం కల్పించాలన్నా కేంద్రం అడ్డుపడుతోందని చెప్పారు.
రాష్ట్రాలపై కేంద్రం అనుసరి స్తున్న తీరుకు నిరసనగా తెలంగాణ చేపట్టే అందోళనలకు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్ర మంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య, ప్రధాన కార్య దర్శి వెంకట్రాములు, మేట్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.ప్రసాద్‌తోపాటు సీపీఎం జాతీ య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment