
జనగామ: జనగామ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ భవనం, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంతోపాటు బహిరంగ సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఈనెల 11న జిల్లాకు రానున్నట్లు పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ మేరకు నూతన కలెక్టరేట్‌లో శనివారం మంత్రి విలేకరులతో మాట్లా డుతూ ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ ప్రారంభించి, అక్కడే అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారని వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత ప్రజాప్రతినిధులతో రివ్యూ చేసి మధ్యాహ్నం 3 గంటలకు అదే ప్రాంతంలో జరిగే సభలో పాల్గొంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment