
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
సాక్షి, జనగామ: గతంలో అందరూ తనను వాడుకొని వదిలేశారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జరిగిన రెండో విడత ‘పల్లె ప్రగతి’అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. నాడు అసెంబ్లీలో తెలంగాణ వస్తే కరెంటు రాదని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.. నేడు సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ 24 గంటల కరెంటు అందిస్తూ మహాత్ముడు అయ్యాడని చెప్పారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.13 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని చెప్పారు. డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు నిర్మించిన పంచాయతీలకు రూ.84 కోట్లను విడుదల చేసిందని, టాయిలెట్లు నిర్మించుకున్న వారికి చెల్లించాల్సిన నిధులను పది రోజుల్లో చెల్లిస్తామన్నారు. గ్రామాల్లో చెత్త వేసే వారికి నోటీసులు ఇవ్వాలని, ఫైన్లు వేయకుండా నిర్లక్ష్యం వహించే సర్పంచ్, కార్యదర్శి పదవులను కత్తిరించే అవకాశం ఉందన్నారు. పది మండలాలకు కలిపి ఒక అధికారిని ఏర్పాటు చేశామని, నిర్లక్ష్యం ఎవరు చేసినా బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment