సాక్షి, మహబూబాబాద్: ‘హలో.. శ్రీను నేను దయన్నను మాట్లాడుతున్నా.. మీ ఆరోగ్యం బాగుందా.. ఊళ్లో అందరు బాగున్నారా.. సర్వే జరుగుతోందా.. కరోనా వ్యాప్తి ఎలా ఉంది.. మొదలైన అంశాలపై రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గం ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి గ్రామానికి చెందిన ముత్తినేని శ్రీనివాస్‌తో మంత్రి గురువారం మాట్లాడారు.. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది..
మంత్రి: హలో శ్రీను నేను మంత్రి దయన్నను మాట్లాడుతున్నాను.. అందరు బాగున్నారా..?
శ్రీనివాస్: సర్.. సర్.. అంతా బాగేసార్.. ఆరోగ్యం బాగానే ఉంది.. కోవిడ్ పరీక్ష చేయించుకున్నా నెగిటీవ్ వచ్చింది. ఇప్పుడు బాగానే ఉన్న సర్..
మంత్రి: గ్రామంలో అందరూ బాగున్నారా..? కరోనా వస్తుందా.. ? ఎవరైనా చనిపోయారా..?
శ్రీనివాస్: అందరూ బాగానే ఉన్నారు సర్.. కరోనా బాగానే ఉంది.. ఇప్పటి వరకు ఎవరూ చనిపోలేదు. వస్తుంది.. మందులు వాడితే పోతుంది.. వచ్చిందని తెలియగానే ఇంట్లో నుంచి బయటకు పోతలేం సర్..
మంత్రి: మందులు ఎవరు ఇస్తున్నారు.. డాక్టర్లు.. ఏఎన్‌ఎంలు వస్తున్నారా.. ప్రైవేట్‌గా మందులు కొనుక్కుంటున్నారా.. ?
శ్రీనివాస్: లేదు సర్.. మా వడ్డెకొత్తపల్లిలో మాత్రం పొద్దున్నే ఏఎన్‌ఎం, ఆశ వర్కర్, అందరూ ఇల్లిల్లు తిరుగుతాండ్రు.. మందులు ఇస్తున్నారు.. రోజు ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు. మీరు పంపిన సమాన్ల కిట్ కూడా మన వాళ్లు ఇచ్చారు.
మంత్రి: లాక్‌డౌన్‌లో బయటకు పోకుర్రి.. ఇంట్లోనే ఉండి ఆరోగ్యంగా ఉండండి.. ఏమైనా ఇబ్బంది వస్తే మన శ్రీనివాస్‌తో మాట్లాడండి.. ఎంజీఎంలో కూడా మంచి వసతులు ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రికి పోయి డబ్బులు ఖర్చుచేసుకోకండి.. బాగా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి.. ధైర్యంగా ఉండండి.. కరోనా వచ్చిన వాళ్ల ఇంటికి పోయి కూడా ధైర్యం చెప్పండి.. (కాన్ఫిరెన్స్‌లో ఉన్న కార్యకర్తలు, నాయకులు, అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టి ప్రజల్లో ధైర్యం నింపండి)
శ్రీనివాస్: లాక్‌డౌన్ ఇంకా ఎన్నిరోజులు ఉంటది సర్.. ?
మంత్రి: శ్రీను ఇప్పుడిప్పుడే కరోనా తక్కువ అవుతుంది..లాక్‌డౌన్ పెట్టిన తర్వాత కేసులు అదుపులోకి వచ్చాయి.. ఈనెల 30వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కేబినెట్ మీటింగ్ ఉంది. అక్కడ సర్ చెబుతారు.లాక్‌డౌన్ పొడిగించేది..లేనిది..మీరు మా త్రం ఇంటికాడనే ఉండి జాగ్రత్తగా ఉండండి.. అనవసరంగా బయట తిరిగి వైరస్ అంటించుకోకండి.
Comments
Please login to add a commentAdd a comment