Minister Errabelli Dayakar Rao Sensational Comments Ahead BRS Avirbhava Sabha - Sakshi
Sakshi News home page

మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు.. 20 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..

Published Tue, Jan 17 2023 11:12 AM | Last Updated on Tue, Jan 17 2023 12:16 PM

Minister Errabelli Dayakar Rao Sensational comments at Mahabubabad - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో రేపు (బుధవారం) జరిగే బిఆర్ఎస్ ఆవిర్భావ సభ నేపథ్యంలో పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 20 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలిపారు. అయితే 17 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మార్చితే 100కు పైగా సీట్లలో బిఆర్ఎస్ గెలుస్తుందని స్పష్టం చేశారు.

ఏ సర్వే అయినా, తాను వ్యక్తిగతంగా చేసిన సర్వేలు చూస్తే 80 నుంచి 90 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని తెలిసిందన్నారు. కేసీఆర్‌కు ఓటేస్తాం కానీ కొందరి ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. 15 నుంచి 20 స్థానాల్లో బీజేపీ, 20 నుంచి 25 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ ఉంటుందని 17 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మార్చితే బీఆర్ఎస్ వందకు పైగా స్థానాలు గెలుస్తుంది అన్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ.. మరికొన్ని చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందన్నారు.

చదవండి: ('కుటుంబం కంటే ఎక్కువగా ప్రజలను ప్రేమించడం చెవిరెడ్డికే సాధ్యం')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement