
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.
ధాన్యం సేకరణ విషయమై మంత్రుల బృందంతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. నిన్న రాత్రే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో తనను కలిసిన వాళ్లంతా పరీక్ష చేయించుకోవాలని ఎర్రబెల్లి సూచిస్తున్నారు.