3.80 లక్షల మహిళా గ్రూపులకు రూ.12,070 కోట్లు  | Telangana More Than 12000 Crore Rupees Given To Women Self Help Groups | Sakshi
Sakshi News home page

3.80 లక్షల మహిళా గ్రూపులకు రూ.12,070 కోట్లు 

Published Wed, Jul 28 2021 8:03 AM | Last Updated on Wed, Jul 28 2021 8:03 AM

Telangana More Than 12000 Crore Rupees Given To Women Self Help Groups - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: 2021–22 ఏడాదికి గ్రామీణ దారిద్య్ర నిర్మూలన మిషన్‌ (సెర్ప్‌) ద్వారా 3,80,162 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.12,070 కోట్ల బ్యాంక్‌ లింకేజీ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా సంక్షోభంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సీఎం కేసీఆర్‌ రూ.200 కోట్లు మొదటి విడతగా మంజూరు చేశారని పంచాయతీరాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.

మహిళా సంఘాలు తీసుకునే వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందని, అందులో భాగంగానే ఈ మొత్తాన్ని సీఎం విడుదల చేసినట్లు చెప్పారు. గతంలో మహిళలు ప్రతి చిన్న ఖర్చుకు భర్తపై ఆధారపడే పరిస్థితినుంచి డ్వాక్రా సంఘాలు ఏర్పడిన తర్వాత వారు ఆర్థికంగా అభివృద్ధి చెందారన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement