సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ నిధుల వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్ స్థానంలో నిలుస్తోందని పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తాజాగా పంచాయతీ భవనాలు, కాలువల పూడికతీత వంటి పనులకు కూడా ఉపాధి నిధులను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మార్చి లోగా సాధ్యమైనంత ఎక్కువ ఉపాధి పనులు చేయాలని ఆదేశించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పలు సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment