panchayat raj
-
నగదు ‘బదిలీ’! కీలక పోస్టులన్నీ బేరం పెట్టిన కూటమి నేతలు
విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు రూ.2కోట్లు... తిరుపతి రూరల్ తహసీల్దార్ పోస్టుకు రూ.2కోట్లు... కర్నూలు ఆర్డీవో పోస్టుకు రూ.కోటి... శ్రీ సత్యసాయి జిల్లాలో సీఐ పోస్టుకు రూ.50లక్షలు... ఇలా డిమాండ్‌ను బట్టి ఉద్యోగుల బదిలీలకు కూటమి ప్రజాప్రతినిధులు రేటు ఫిక్స్ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడ్డగోలుగా దోచుకోవడంపైనే దృష్టి పెట్టిన కూటమి నేతలు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. చివరికి సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సిఫారసు చేసేందుకు కూడా రూ.లక్షన్నర వసూలు చేయా లని నిర్ణయించారు. తాము చెప్పినంత ఇస్తే నిబంధనలను సైతం పట్టించుకోకుండా జీరో సర్వీస్ బదిలీలు కూడా చేయిస్తామని భరోసా ఇస్తున్నారు. మామూళ్లు ఇవ్వనివారిని, తమకు నచ్చనివారిని మారుమూల ప్రాంతాలకు పంపిస్తున్నారు.పంచాయతీరాజ్, రెవెన్యూ, మైనింగ్, రిజిస్ట్రేషన్ల శాఖల్లో జోరుగా పైరవీలు సచివాలయ ఉద్యోగుల బదిలీకి టీడీపీ నేతల సంతకం తప్పనిసరి కానిస్టేబుల్ పోస్టింగ్‌కు సైతం డబ్బులు డిమాండ్సచివాలయ బదిలీకి రూ. లక్షన్నరగ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ కోసం స్థానిక టీడీపీ నాయకుడి సంతకం ఉండాలని చెబుతుండటంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఆ పార్టీ నేతలు బదిలీ కోసం సంతకం పెట్టడానికి రూ.1.50 లక్షలు అడుగుతుండడంతో ఆ శాఖలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే తీవ్ర అవమాన భారంతో సతమతమవుతున్న సచివాలయ ఉద్యోగులు తాజా పరిణామాలతో హతాశులవుతున్నారు. 0 సర్వీస్కృష్ణా జిల్లా పెనమలూరు ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్‌కి పది రోజుల క్రితం ఏవోగా పదోన్నతి రావడంతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పోస్టింగ్ ఇచ్చారు. తాజా బదిలీల్లో ఆయన్ను పెనమలూరు ఏవోగా నియమించాలని స్థానిక ఎమ్మెల్యే సిఫారసు లెటర్ ఇచ్చారు. పట్టుమని పది రోజుల సర్వీసు కూడా పూర్తి కాకుండానే ఆయన బదిలీకి దరఖాస్తు పెట్టుకోవడం,దాని ఆమోదానికి రంగం సిద్ధమవడం విశేషం.రూ. లక్ష లక్షఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయగూడెంలో ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్‌తోపాటు ఎంపీడీవో కార్యాలయంలో ఏ పోస్టుకైనా సిఫారసు లెటర్ కావాలంటే ముందు లక్ష రూపాయలు ఇవ్వాలని, ఆ తర్వాత మరో రూ.లక్ష ఇవ్వాలని బేరం పెట్టారు. నియోజకవర్గంలో ఏ పోస్టుకైనా కప్పం కడితేనే సిఫారసు లెటర్ ఇస్తామని చెబుతున్నారు. రూ. 10 లక్షలుమైనింగ్ శాఖలో ఎన్టీఆర్ జిల్లా ఏడీ పోస్టుకి రూ.10 లక్షలు అడుగుతున్నట్లు సమాచారం. ఇందులో మంత్రి పేషీ, కార్యదర్శి పేషీల భాగస్వామ్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రూ. 2 కోట్లువిజయవాడలోని పటమట, విశాఖలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ పోస్టుల కోసం ఉన్నత స్థాయిలో పైరవీలు జరుగుతున్నాయి. ఈ పోస్టుల రేటు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు పలుకుతున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు ఇచ్చిన గ్రీన్‌సిగ్నల్ పైరవీలకు రెడ్ కార్పెట్లా మారింది. నిబంధనలు, మార్గదర్శకాలను కాగితాలకే పరిమితం చేసి కాసులు, సిఫారసులతోనే బదిలీ వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఆయా శాఖల అవసరాలు, పనితీరుతో సంబంధం లేకుండా కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారినే పరిగణనలోకి తీసుకుంటున్నారు. అధికార పార్టీ ప్రయోజనాల కోసమే ఈ బదిలీల ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యేలు చెప్పిన వారిని, కాసులిచ్చిన వారిని మంచి పోస్టుల్లో కూర్చోబెట్టడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. తమకు ఇష్టం లేని వారిని, డబ్బులు ఇవ్వలేని వారిని పక్కన పెట్టేసి మారుమూల ప్రాంతాలు, ప్రాధాన్యత లేనిచోట్లకు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదేళ్లు ఒకేచోట పని చేసిన వారిని కచ్చితంగా మార్చాలనే ప్రధాన నిబంధనను ఎక్కడా పట్టించుకోవడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. పాలనాపరమైన అవసరాలు, వ్యక్తిగత అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవాలని బదిలీల ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇష్టానుసారం బదిలీలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల సిఫారసులుంటే జీరో సర్వీసు ఉన్నా బదిలీకి అనుమతిస్తుండటంపై ఉద్యోగ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. – సాక్షి, అమరావతిగగ్గోలు పెడుతున్న అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు ఉద్యోగుల బదిలీలను ఎమ్మెల్యేలు తమకు అన్ని విధాలా అనుకూలంగా మార్చుకుంటున్నారు. నియోజకవర్గ, మండల కేంద్రాల్లోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను తమ గుప్పెట్లో ఉంచుకునేలా ఈ బదిలీల పర్వాన్ని నిర్వహిస్తున్నారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులన్నింటిలోనూ తమకు అనుకూలమైన వారినే నియమించాలని అధికారులకు స్పష్టం చేస్తున్నారు. ఎంపీడీవో, ఆ కార్యాలయంలోని ఉద్యోగులతోపాటు వ్యవసాయాధికారులుగా పలానా వారిని నియమించాలని సిఫారసు చేస్తూ ఎమ్మెల్యేలు లేఖలు ఇస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వో పోస్టులకు సైతం సిఫారసు లేఖలు ఇస్తున్నారు. వాటి ప్రకారమే ఆయా శాఖల ఉద్యోగులను బదిలీల జాబితాలో చేరుస్తున్నారు. లేఖలు ఇచ్చేందుకు ఎమ్మెల్యేల కార్యాలయాల్లో ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు నిర్ణయించారు. ఆ లెటర్లు తీసుకెళ్లి అధికారులకు ఇచ్చాక.. అక్కడా డబ్బు అడుగుతున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బదిలీల వ్యవహారం అంతా డబ్బుమయంగా మారిపోయిందని వాపోతున్నారు.డిమాండ్‌ను బట్టి రేటు పెంచేశారు!తిరుపతి రూరల్ మండలం తహసీల్దార్ పోస్టుకు మంచి డిమాండ్ ఉండటంతో రేటు కూడా పెంచేసినట్లు తెలిసింది. ఇక్కడికి వచ్చేందుకు గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో పనిచేసిన ఓ మహిళా తహసీల్దార్ పైరవీలు చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి అత్యంత సన్నిహితుల ద్వారా రూ.75 లక్షలు ఇచ్చేందుకు ఆమె సిద్ధపడినట్లు సమాచారం. ఇదే పోస్టుకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పనిచేస్తున్న మరో తహసీల్దార్ కోటి రూపాయలు ఇస్తానని ముందుకు రావడం... ఆ వెంటనే మరో తహసీల్దార్ ఏకంగా 1.25 కోట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తంచేసినట్లు తెలిసింది. ఈ పోస్టుకు గిరాకీ ఎక్కువగా ఉందని టీడీపీ నేత అమాంతంగా ధరను పెంచేశారు. ఏకంగా రూ.2 కోట్లు ధర నిర్ణయించారు. దీంతో అప్పటి వరకు తిరుపతి రూరల్‌పై ఆశలుపెట్టుకున్న చాలామంది తహసీల్దార్లు మరో పోస్టింగ్ చూసుకున్నారు. అయితే చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న తహసీల్దార్ మాత్రం రూ.1.5కోట్లు చెల్లించి, మిగతా మొత్తం మూడు నెలల్లో ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఆ సీటు చేజిక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘రిక్వెస్ట్’ పేరుతో దోపిడీకి స్కెచ్ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఉద్యోగులు, అధికారుల నుంచి దోపిడీకి రిక్వెస్ట్ బదిలీ పేరిట పక్కా ప్లాన్ రెడీ చేశారు. ‘ఉద్యోగులంతా తప్పనిసరిగా బదిలీ అభ్యర్థన (రిక్వెస్ట్) ఫారం పూర్తి చేసి డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లకు పంపండి. సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిసెంట్లు, కార్యాలయ సిబ్బంది ఇది పాటించి తీరాల్సిందే...’ అంటూ ఒక ఉన్నతాధికారి మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అరడజను రిక్వెస్ట్ ఫారాలు వాట్సాప్‌లో సదరు అధికారికి పంపినట్లు సమాచారం. ఇప్పటికే డిప్యూటేషన్ల పేరుతో రూ.లక్షలు వెనకేసుకున్న అధికారులు... ఈ రిక్వెస్ట్ బదిలీల పేరుతో మరోసారి రూ.కోట్ల వసూళ్లకు తెరతీశారు. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్, కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రెండు సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు ఒక్కోదానికి రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు ధర నిర్ణయించినట్లు తెలిసింది. సర్పవరం, సామర్లకోట సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలు, రాజమహేంద్రవరంలో రెండు సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు రూ.60లక్షలు నుంచి రూ.80లక్షలు చొప్పున రేటు ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. రాజానగరం, పిడింగొయ్యి సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలు, అమలాపురంలో రెండు సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షలు, ముమ్మిడివరం సబ్‌రిజిస్ట్రార్ పోస్టుకు రూ.30లక్షలు చొప్పున ధర నిర్ణయించినట్లు తెలిసింది. ఈ దందా అంతా విజయవాడ ప్రధాన కార్యాలయంలోని మార్కెట్ అండ్ ఆడిట్ విభాగంలో పనిచేస్తున్న రిజిస్ట్రార్ ఒకరు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడిపిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.జిల్లా స్థాయి పోస్టులకు భారీ డిమాండ్ మంత్రుల స్థాయిలో పైరవీలు⇒ జిల్లా స్థాయిలో ఉండే పోస్టులు, వివిధ కార్యాలయాల్లో ఉండే కీలకమైన సీట్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. వీటి కోసం మంత్రులు, వారి పేషీలు, ఉన్నతాధికారుల వరకు పైరవీలు జరుగుతున్నాయి. పేషీకి ఒక రేటు ⇒ పంచాయతీరాజ్, మైనింగ్, రిజిస్ట్రేషన్లు, ఇరిగేషన్ తదితర శాఖల్లో పోస్టులకు రూ.లక్షల్లో బేరాలు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖలోని ఏఈ, డీఈ, ఈఈ పోస్టులకు సంబంధిత మంత్రి పేషీ నుంచి భారీ డబ్బు అడుగుతున్నట్టు తెలిసింది. మైనింగ్ శాఖలో డీడీ, ఏడీ, జియాలజిస్టు, సర్వే పోస్టులకు మంత్రి సిఫారసు లేఖ, ఆ తర్వాత సంబంధిత కార్యదర్శి పేషీ లోని కొందరు వ్యక్తులతో మాట్లాడుకుంటున్నారు. ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, అనకాపల్లి వంటి జిల్లాల పోస్టులకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలకుపైగా రేటు పెట్టారు. మంత్రి పేషీ వద్ద ఒక రేటు, ఆ తర్వాత కార్యదర్శి పేషీ వద్ద మరో రేటు.. ఈ రెండు ఓకే అయిన వారికే పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి నెలకొంది.ఈ పోస్టులకు ప్రభుత్వ స్థాయిలోనే బేరం⇒ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా బదిలీలన్నీ ఐజీ అండ్ కమిషనర్ కార్యాలయంలోనే చేసేలా ప్రతి ఉద్యోగి నుంచి ఆప్షన్లు తీసుకోవడం ఆ శాఖలో కలకలం రేపింది. సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు భారీగా బేరాలు జరుగుతున్నాయి. విజయవాడలోని పటమట, విశాఖలోని మధురవాడ, భోగాపురం, కొత్తవలస, రేణిగుంట, తిరుపతి, నెల్లూరు, నల్లపాడు వంటి 25కు పైగా అధిక ఆదాయం వచ్చే సబ్ రిజిస్ట్రార్ పోస్టులను ప్రభుత్వ స్థాయిలోనే బేరానికి పెట్టారనే చర్చ జరుగుతోంది. ఇరిగేషన్‌లోనూ తక్కువేం కాదు...⇒ ఇరిగేషన్ శాఖలో ఏఈ, డీఈ, ఈఈ పోస్టులకు అదే తరహాలో పైరవీలు సాగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో పని చేసేందుకు ఈ క్యాడర్ అధికారులు ఎగబడుతున్నారు. అక్కడైతే బాగా బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉండటంతో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆ పోస్టులకు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ప్రకాశంలో పెద్ద ఎత్తున వసూలు⇒ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రకాశం జిల్లాలో సీఐలు, ఎస్ఐలు, తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. పోలీసు శాఖలో కోరిన చోట పోస్టింగ్ కోసం టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నగదు వసూలు చేసినట్లు సమాచారం. రూ.8లక్షలు తెస్తేనే లెటర్ ⇒ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఈఈ పోస్టుకి రూ.8 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. అంత డబ్బు ఇస్తేనే సిఫారసు లెటర్ ఇస్తామని పలువురికి సంబంధిత మంత్రి అనుయాయులు చెప్పినట్లు తెలిసింది.పక్కాగా పైసా వసూల్సీఐకి రూ.50లక్షలు.. కానిస్టేబుల్‌కు రూ.50వేలు!⇒ శ్రీ సత్యసాయి జిల్లాలో సీఐ పోస్టింగుల కోసం రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బేరం జరిగినట్లు తెలిసింది. గోరంట్ల, హిందూపురం వన్‌టౌన్, ధర్మవరం వన్‌టౌన్, హిందూపురం రూరల్, హిందూపురం రూరల్ అప్‌గ్రేడ్, ధర్మవరం రూరల్, ముదిగుబ్బ, కదిరి స్టేషన్లలో సీఐల పోస్టులకు సిఫారసు లేఖలు ఎక్కువ ధర పలికినట్లు తెలిసింది. ఎస్ఐ స్థాయిలో ఏడాదికి రూ.5 లక్షలు చొప్పున ఇచ్చేందుకు అంగీకరించిన వారికే కోరిన చోట పోస్టింగులు ఇచ్చారని సమాచారం. కానిస్టేబుల్ బదిలీలకు కూడా టీడీపీ నేతలు రూ.50వేలు చొప్పున డిమాండ్ చేస్తున్నారు. తహసీల్దార్‌కు రూ.50లక్షలు.. వీఆర్వోకు రూ.లక్ష⇒ శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్ని మండలాల తహసీల్దార్ పోస్టులు రూ.50లక్షలు పలికినట్లు సమాచారం. జిల్లాలో పెద్దగా డిమాండ్ లేని మండలాల్లో అయినా ఆటంకాలు లేకుండా పని చేసుకునేందుకు టీడీపీ నేతలు రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. చిలమత్తూరు, కొత్తచెరువు, ధర్మవరం, హిందూపురం, పుట్టపర్తి, గోరంట్ల మండలాల పోస్టింగ్‌లకు అత్యధిక ధర పలికినట్లు ప్రచారం జరుగుతోంది. వీఆర్వోల బదిలీలకు కూడా రూ.లక్ష నుంచి బేరం ఆడుతున్నట్లు తెలిసింది. ముందు డబ్బులు ఇవ్వండి.. తర్వాత బదిలీ అవ్వండి⇒ ఎక్సైజ్ శాఖలో ‘సెబ్’ త్వరలోనే రద్దు చేస్తున్నామని, మద్యం పాలసీ మారగానే బదిలీలు ఖాయమని శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు రూ.10లక్షలు ఇస్తే రేపు నచ్చినచోట పోస్టింగ్ వేయిస్తామని ఎస్ఐ, సీఐల నుంచి వసూళ్లకు తెరతీశారు. గతి‘లేఖ’.. నేతల చుట్టూ...⇒ కృష్ణా జిల్లాలో కీలకమైన రెవెన్యూ, మునిసిపల్,పంచాయతీరాజ్, మైనింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, విద్యుత్ శాఖల్లో ఉద్యోగుల బదిలీలను సొమ్ము చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తమ సిఫారసు లేకుండా బదిలీలు చేయవద్దని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో సిఫారసు లేఖల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రుల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు చేస్తున్నారు. గన్నవరం, పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నం, నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలు ఇచ్చేందుకు రూ.లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఆర్డీవో పోస్టుకు రూ.కోటి.. ముగ్గురు పోటీ!⇒ కర్నూలు ఆర్డీవో పోస్టును టీడీపీ నాయకులు రూ.కోటికి బేరం పెట్టినట్లు తెలిసింది. ఈ పోస్టు కోసం ముగ్గురు అధికారులు పోటీ పడుతున్నట్లు సమాచారం. అయితే ఎవరికి ఎంత రేటుకు ఈ పోస్టు దక్కుతుందో ఒకటి, రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. విశాఖలో రూ.10లక్షలు–రూ.20లక్షలు⇒ విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం, భీమిలి,పెందుర్తి మండలాల తహసీల్దార్ల పోస్టింగ్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోనే మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ప్రత్యేకం⇒ రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి మధురవాడ సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు అధికార పార్టీ నేతలు రాష్ట్రంలోనే అత్యధిక ధర రూ.2కోట్ల వరకు నిర్ణయించినట్లు తెలిసింది. ఆనందపురం, పెందుర్తి, గాజువాక, విశాఖ జాయింట్–1 పోస్టింగ్‌లకు గిరాకీ ఎక్కువగా ఉంది. ఇక్కడ పోస్టింగ్ కోసం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు టీడీపీ నేతలు రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయినా కొందరు అధికారులు బదిలీల కోసం ప్రజాప్రతినిధులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పోస్టింగ్‌లు ఇవ్వకముందే డబ్బులు వసూలు⇒ అనకాపల్లి జిల్లాలో తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పోస్టింగ్ ఇవ్వలేదు. బదిలీల ప్రక్రియలో అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, సబ్బవరం, అనకాపల్లి, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో పోస్టింగ్‌ల కోసం రూ.10లక్షలు చొప్పున, నర్సీపట్నం, చోడవరం మండలాల్లో రూ.5 లక్షలు చొప్పున కూటమి ప్రజాప్రతినిధులు వసూలు చేసినట్లు సమాచారం. సిఫారసు ఉంటేనీ సీఐ పోస్టింగ్⇒ అనకాపల్లి జిల్లాలో సీఐల బదిలీల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యేల లెటర్ ఉంటేనే పోస్టింగ్ ఇస్తున్నారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం. అనకాపల్లి జిల్లాలో సబ్బవరం, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, నక్కపల్లి, చోడవరం సబ్ రిజిస్ట్రార్ల పోస్టింగ్‌ల కోసం రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. -
టార్గెట్ రూ.5,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువల సవరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఇందుకోసం రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ వర్గాలతో రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ప్రాథమిక స్థాయి సమావేశాలను పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో భూములు, ఆస్తుల విలువలను పెంచడం ద్వారా 20 నుంచి 35 శాతం వరకు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరే అవకాశముందని రిజి్రస్టేషన్ల శాఖ అంచనా వేస్తోంది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త విలువల ద్వారా రూ.3,500 కోట్ల నుంచి రూ.5వేల కోట్ల వరకు ఆదాయం పెరగొచ్చని రిజి్రస్టేషన్ల శాఖ వర్గాలంటున్నాయి. గజం రూ.1,000... ఎకరం రూ. 4లక్షలు పెంపు! రాష్ట్రంలో ప్రస్తుతం చేస్తున్న సవరణ ప్రక్రియ అనంతరం గజం నివాస స్థలం విలువ కనీసం రూ.1,000 పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు కనీస విలువతో పట్టణ ప్రాంతాల్లో నివాస స్థలాల విలువల పెంపు ప్రక్రియను మొదలు పెట్టాలని ప్రభుత్వ వర్గాల ద్వారా రిజి్రస్టేషన్ల శాఖకు మౌఖిక ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇక, ఎకరం వ్యవసాయ భూమి కనీస విలువ ఏ మేరకు సవరించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం మారుమూల ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల బహిరంగ మార్కెట్ విలువ ఎంతుందన్న దానిపై రెవెన్యూ వర్గాలతో చర్చించిన అనంతరం దీనిపై ఓ అంచనాకు రానున్నారు. అయితే, రిజి్రస్టేషన్ల శాఖ అంచనా ప్రకారం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త విలువల ప్రకారం రాష్ట్రంలో ఎకరం వ్యవసాయ భూమి విలువ రూ.4 లక్షల వరకు పెరగనుందని తెలుస్తోంది. ఇక, విలువల సవరణ కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస, వాణిజ్య సముదాయాలను కేటగిరీలుగా తీసుకోనున్నారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న నివాస, వాణిజ్య సముదాయాల ప్రభుత్వ విలువలను 100 శాతం పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 29 కల్లా కమిటీల సంతకాలు విలువల సవరణ ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 29 నాటికి అన్ని రకాల భూములు, ఆస్తుల విలువల పెంపుపై సవరణ కమిటీలు సంతకాలు చేయనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జేసీ, ఆర్డీవో, ఎమ్మార్వో, సబ్రిజిస్ట్రార్లతో; పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో, ఎమ్మార్వో, సబ్రిజి్రస్టార్లతో; హెచ్ఎండీఏ పరిధిలో కమిషనర్, ఆర్డీవో, ఎమ్మార్వో, సబ్రిజి్రస్టార్లతో విలువల సవరణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు సంతకాలు చేసిన అనంతరం ప్రతిపాదిత విలువలను ఆన్లైన్లో ఉంచి 15 రోజులపాటు ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకుని జూలై 24 కల్లా విలువల సవరణకు తుదిరూపు ఇవ్వనున్నారు. ఆ తర్వాత వాటిని కంప్యూటరీకరించి ఆగస్టు 1 నుంచి కొత్త విలువలను అమలు చేయనున్నారు. -
నారీ శక్తికి 'చేయూత'
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇప్పటివరకు 13 లక్షల మంది మహిళలు ప్రతి నెలా తమ కుటుంబానికి స్థిరమైన ఆదాయాన్ని పొందేలా శాశ్వత జీవనోపాధులు కల్పించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇవ్వనుండగా ఇప్పటివరకు మూడు విడతల్లో లబ్ధిదారులకు రూ.14,129.11 కోట్లు అందచేసినట్లు చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖతో పాటు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాల అమలు తీరుపై సీఎం జగన్ సమీక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని మహిళలు ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకుని స్వయం ఉపాధి కల్పనకు వినియోగించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశించారు. ‘చేయూత’ కార్యక్రమంలో స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు. లబ్ధిదారులు తొలివిడత డబ్బులు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమాలకు అనుసంధానం చేస్తే మహిళలకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందన్నారు. అవసరమైన వారికి అదనంగా బ్యాంకు రుణాలు ఇప్పించి స్వయం ఉపాధిని పెంపొందించే మార్గాలపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు జగనన్న తోడు పథకం ప్రయోజనాలను కూడా వర్తింప చేయాలని సూచించారు. పొదుపు సంఘాల మహిళలు ఉమ్మడిగా నెలకొల్పిన మహిళా మార్టులు సమర్థంగా పని చేస్తున్నాయని, ఇప్పటివరకు 36 మహిళా మార్టుల ద్వారా రూ.32.44 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు అధికారులు సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో మహిళా మార్టులో సగటున రోజుకు రూ. 20.62 లక్షల వ్యాపారం జరిగిందని వివరించారు. 10న ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’.. పొదుపు సంఘాల మహిళలకు వారి బ్యాంకు రుణాలకు సంబంధించి వైఎస్సార్ సున్నా వడ్డీని ఆగస్టు 10న మరో విడత అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. జూలై 26వ తేదీన జరగాల్సిన ఈ కార్యక్రమం ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తంలో రూ.19,178.17 కోట్లను వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నేరుగా వారి ఖాతాలకు గత మూడేళ్లలో ప్రభుత్వం జమ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించారు. సకాలంలో రుణాలు చెల్లించే మహిళలకు ఇప్పటి వరకు వైఎస్సార్ సున్నావడ్డీ కింద రూ.4,969.05 కోట్లు చెల్లించామన్నారు. బ్యాంకర్ల సమావేశంలో పలుమార్లు ఒత్తిడి తెచ్చి పొదుపు సంఘాల మహిళలకు రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా చర్యలు చేపట్టామన్నారు. స్త్రీ నిధి ద్వారా ఇచ్చే రుణాలపై వడ్డీని 9 శాతానికి పరిమితం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. మహిళల తరపున అధికారులే గట్టిగా మాట్లాడి వారికి తగిన ప్రయోజనం చేకూర్చాలని సూచించారు. పట్టణాల్లోనూ డిజిటల్ లైబ్రరీలు గ్రామీణ ప్రాంతాల తరహాలోనే పట్టణాల్లోనూ వైఎస్సార్ డిజిటల్ లైబరీల నిర్మాణానికి స్థలాలను తొలుత గుర్తించాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణాల తీరును పరిశీలించిన అనంతరం సీఎం జగన్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సచివాలయాల భవనాల నిర్మాణం దాదాపుగా కొలిక్కి వచ్చిందని, సెప్టెంబరు నాటికే అన్నింటినీ పూర్తి చేసేలా కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిర్దేశిత గడువులోగా అన్ని భవనాల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వ్యవసాయ పనులు లేని సమయంలో ఈ ఏడాది ఏప్రిల్ – జూలై మధ్య ఉపాధి హమీ ద్వారా 18.90 కోట్ల పనిదినాలు కల్పించిన నేపథ్యంలో ఈ ఆర్థిక ఏడాదిలో కనీసం 24 కోట్ల పనిదినాల తగ్గకుండా ఉపాధి కల్పన లక్ష్యంగా కృషి చేయాలని ఆదేశించారు. జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ఉత్తమ పనితీరు కనపరిచిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావించారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు జగనన్న కాలనీలలో కనీస మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నందున మౌలిక సదుపాయాల విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. కాలనీల్లో అపరిశుభ్రతకు తావు లేకుండా పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రామ కంఠం ఇళ్లకు హక్కు పత్రాలు వ్యవసాయ భూములకు సంబంధించి యజమానులకు పాస్ పుస్తకాల మాదిరిగా గ్రామ కంఠాల పరిధిలోని ఇళ్ల యజమానులకు కూడా భూ హక్కు పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ కంఠం పరిధిలో రూ.లక్షల విలువ చేసే ఇళ్లు, ఇంటి స్థలాలున్నా అధికారిక పత్రాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా వారికి భూహక్కు పత్రాల జారీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. 10,943 గ్రామాల్లో ఇప్పటికే డ్రోన్లతో సర్వే పూర్తైనట్లు అధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో భూహక్కు పత్రాలను ఇస్తున్నట్లు చెప్పారు. వందేళ్ల తరువాత తొలిసారిగా మనం చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అత్యంత విశిష్టమైనదని సీఎం జగన్ పేర్కొన్నారు.ప్రతి గ్రామ సచివాలయంలో ప్రత్యేకంగా ఒక సర్వేయర్‌ను నియమించడం వల్ల ఈ ప్రాజెక్టు సజావుగా ముందుకు సాగుతోందన్నారు. గ్రామ స్థాయిలో సచివాలయాల్లోనే భూ రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించిన ఘనత కేవలం మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఇతర శాఖాధికారులు సీఎం సమీక్షలో పాల్గొన్నారు. -
Andhra Pradesh: సాధికారత సుస్థిరం
సాక్షి, అమరావతి: మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ చేయూత, ఆసరా, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ ద్వారా జీవనోపాధి మార్గాలను మరింత విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. చేయూత లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్ల పాటు క్రమం తప్పకుండా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల కింద కూడా నిర్దేశిత వ్యవధి ప్రకారం ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామన్నారు. ఒకవైపు ఆర్థిక సాయంతో పాటు మరోవైపు బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి కోసం తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ అమలు, గ్రామీణ రహదారులపై కూడా సమీక్షించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా.. లబ్ధిదారులు పథకాన్ని అందుకున్న మొదటి ఏడాది నుంచే స్వయం ఉపాధి మార్గాలవైపు మళ్లించే కార్యక్రమాలను పెంచడం వల్ల గ్రామ స్థాయిలో సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా వేగంగా అడుగులు పడతాయని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అర్హులైన మహిళలకు అవగాహన పెంపొందించి బ్యాంకు రుణాలు కూడా ఇప్పించి ఉపాధి మార్గాలను సమర్థంగా కొనసాగించాలన్నారు. మహిళలు తయారు చేసే వస్తువులు, ఉత్పాదనలకు సంబంధించి మంచి మార్కెట్ వ్యవస్ధ ఉండాలని, దీనికోసం బహుళజాతి కంపెనీలతో అనుసంధానం కావాలని సూచించారు. చేయూతతో 9 లక్షల మందికి స్వయం ఉపాధి 45 – 60 సంవత్సరాల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల సాధికారతే లక్ష్యంగా అమలు చేస్తున్న వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇప్పటివరకూ 9 లక్షల మంది స్వయం ఉపాధి పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. హిందుస్తాన్ యూనీ లీవర్, ఐటీసీ లిమిటెడ్, రిలయెన్స్, అజియో, జీవీకే, మహీంద్ర, కాలాగుడి, ఇర్మా, నైనా, పీ అండ్ జీ లాంటి అంతర్జాతీయ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా చేయూత మహిళా మార్టులు, వస్త్ర, చింతపండు ప్రాసెసింగ్ యూనిట్, లేస్ పార్కు, ఇ–కామర్స్, ఇ–మిర్చ, బ్యాక్ యార్డు పౌల్ట్రీ, ఆనియన్ సోలార్ డ్రయ్యర్ల లాంటివి చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ ఏడాది ‘ఉపాధి’ వ్యయం రూ.8,800 కోట్లు ఉపాధి హామీపై సమీక్ష సందర్భంగా ఈ ఏడాది 1,500 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 215.17 లక్షల పనిదినాలు కల్పించారు. ఉపాధి హామీ పనిదినాల రూపంలో రూ.5,280 కోట్లు ఖర్చు చేయనున్నారు. మెటీరియల్ రూపంలో రూ.3,520 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8,800 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ నిధులు సుమారు రూ.880 కోట్లు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించగా దీనిపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ భవన నిర్మాణాలు గడువులోగా పూర్తి కావాలన్నారు. మన్నికగా నాణ్యమైన రోడ్లు.. రహదారుల నాణ్యతపై మరింత దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కనీసం ఐదేళ్లపాటు నిలిచేలా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. రహదారుల పనులు చేసిన మరుసటి ఏడాదే మళ్లీ మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తకూడదన్నారు. ఆ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంజనీర్లు రోడ్ల నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాల నాయుడు, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.బసంత్ కుమార్, సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు రెండు మహిళా సూపర్ మార్కెట్లు గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువకే అందించాలన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో సూపర్ మార్కెట్లను నెలకొల్పుతున్నట్లు సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. జిల్లాకు కనీసం రెండు సూపర్ మార్కెట్లను ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. ఇప్పటికే 27 చేయూత మహిళా మార్టులు ఏర్పాటయ్యాయని వివరించారు. ఒక్కో సూపర్ మార్టును నెలకు కనీసం రూ.30 లక్షలు టర్నోవర్ లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు డోర్ డెలివరీ, ఆన్లైన్ బుకింగ్, వాట్సాప్ బుకింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మల్టీ నేషనల్ కంపెనీల భాగస్వామ్యంతో ఉత్పత్తుల్లో కనీసం 8 నుంచి 25 శాతం మార్జిన్ ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో ‘వస్త్ర’ పేరుతో ఏర్పాటైన దుస్తుల తయారీ యూనిట్లో 200 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారని, ట్రెండ్స్, అజియో లాంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కురుబలకోటలో చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా సుమారు 3 వేల కుటుంబాలకు చేయూత లభిస్తున్నట్లు వివరించారు. -
సర్పంచుల సమస్యలపై తెలంగాణ కాంగ్రెస్ సమరం
-
మార్చిలోగా ఉపాధి పనులు చేపట్టాలి: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ నిధుల వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్ స్థానంలో నిలుస్తోందని పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తాజాగా పంచాయతీ భవనాలు, కాలువల పూడికతీత వంటి పనులకు కూడా ఉపాధి నిధులను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మార్చి లోగా సాధ్యమైనంత ఎక్కువ ఉపాధి పనులు చేయాలని ఆదేశించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పలు సూచనలు చేశారు. -
పర్యాటక ప్రాంతంగా ‘రామానుజుల విగ్రహం’
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో ముచ్చింతల్‌లోని త్రిదండి చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ ప్రాంగణం లో ఆవిష్కరించనున్న రామానుజుల విగ్రహం రాబోయే రోజుల్లో ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుతుందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ఆదివారం సంక్రాంతి సందర్భంగా ట్రస్ట్ ప్రాంగణాన్ని సందర్శించిన మంత్రులు.. రామానుజుల విగ్రహావిష్కరణ కోసం ప్రత్యేకంగా వేస్తున్న రోడ్ల పనులను పరిశీలించారు. ప్రాంగణంలోని దేవాలయాన్ని, రామానుజుల భారీ విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక హబ్‌గా మారిన రాష్ట్రానికి రామానుజుల విగ్రహం మకుటాయమానం కానుందని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రులతో పాటు చినజీయర్ స్వామి, మై హోమ్స్ అధినేత రామేశ్వర్ రావు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరో యాదాద్రిగా జోగుళాంబ ఆలంపురం జోగుళాంబ పుణ్య క్షేత్రాన్ని మరో యాదాద్రిగా తీర్చిదిద్దుతామని టూరిజం, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆలయ ఈవో పురేందర్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ క్షేత్రంలో పర్యాటకుల సౌకర్యాల కోసం మొదటి విడతగా రూ.36 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. -
లాక్డౌన్లో అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం
-
పల్లెల్లో అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: మానవాళికి పెనుసవాల్‌గా పరిణమించిన కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర గ్రామీణ, పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శులు రాజేశ్ భూషణ్, సునీల్‌కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కరోనా నియంత్రణలో గ్రామ పంచాయతీల పాత్ర కీలకమని, ఇందులో పంచాయతీరాజ్ వ్యవస్థలోని మూడంచెల ప్రజాప్రతినిధులు, అన్ని విభాగాల ప్రతినిధులను భాగస్వా మ్యం చేయాలని సూచించారు. లాక్డౌన్ రోజుల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలన్నారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని.. కూరగాయలు, పాల దుకాణాలు, షాపులు, బ్యాంకులు, ఏటీఎంలు, పెట్రోలు పంపులు, వంట గ్యాస్ కేంద్రాల్లో సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామా ల్లో కొత్తవారెవరైనా వచ్చి నా, విదేశాల నుంచి పౌరు లు వచ్చినా తక్షణమే ఆ సమాచారాన్ని స్థానిక పాలనా వ్యవస్థతో పంచుకోవాలని సూచించారు. కరోనా వైరస్ లక్షణాలతోబాధపడుతున్నట్లు గుర్తిస్తే వెంట నే ఆస్పత్రులకు లేదా స్వీయ నిర్బంధం చేయాలన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని చెప్పారు. -
ఏకగ్రీవం అయితే భారీ నజరానా
సాక్షి, అమరావతి: ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన పంచాయతీలకు భారీ నజరానాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నజరానాను జనాభా ప్రాతిపదికన నాలుగు విభాగాలుగా విభజించారు. రెండు వేల జనాభా ఉన్న గ్రామాలకు రూ.5 లక్షలు, 2 నుంచి 5 వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ.10 లక్షలు, 5 నుంచి 10 వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ.15 లక్షలు, 10,000 జనాభా దాటిన గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవమైతే రూ.20 లక్షల నజరానా ఇవ్వనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళలు.. మహారాణులు రాష్ట్రంలో 13,368 గ్రామ పంచాయతీలు ఉండగా, సగానికిపైగా మహిళలకే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు చేసింది. 6,831 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లుగా మహిళలే రాబోతున్నారు. ఈ మేరకు రిజర్వేషన్ల వివరాలను పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ వారీగా రిజర్వేషన్ల వివరాలు.. మొత్తం గ్రామ పంచాయతీలు: 13,368 ఎస్టీ మహిళ: 762 ఎస్టీ జనరల్: 480 బీసీ మహిళ: 1,615 బీసీ జనరల్: 1,543 జనరల్ మహిళ: 3,096 జనరల్: 3,375 -
పల్లెకు ప్రగతి
సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు దండిగా నిధులు కేటాయించింది. గ్రామీణ వికాసానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్న సర్కారు.. అదే ఒరవడిని కొనసాగించేలా బడ్జెట్‌ను ప్రతిపాదించింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.23,005.35 కోట్లను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది ఏకంగా రూ.7,880.46 కోట్లు అధికం. కాగా, ఈ ఏడాది బడ్జెట్లో రూ.4,701.04 కోట్లు నిర్వహణ పద్దు కాగా, రూ.18,304.31 కోట్లు ప్రగతి పద్దు. వ్యవసాయం తర్వాత అత్యధిక నిధులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు దక్కడం విశేషం. ఆసరా పింఛన్లకు రూ.11,758 కోట్లు అసహాయులైన పేదలకు ఆసరా పింఛన్లతో అండగా నిలుస్తున్న ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను ఆసరా పథకం కింద రూ.11,758 కోట్లను ప్రతిపాదించింది. గతేడాది రూ.9,402 కోట్లు కేటాయించగా.. ఈసారి అదనంగా మరో రూ.2,356 కోట్లను బడ్జెట్లో పొందుపరిచింది. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించనుండటంతో లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద 39.41 లక్షల మందికి ఆసరా పింఛన్ అందుతుండగా.. అర్హత వయసు తగ్గింపుతో మరో ఏడెనిమిది లక్షల మంది అదనంగా పింఛన్‌కు అర్హత సాధించే అవకాశముంది. దండిగా ఆర్థిక సంఘం నిధులు.. గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులతో పంచాయతీలకు నిధుల కొరత తీరనుంది. ఇప్పటికే ప్రతినెలా రూ.339 కోట్లు కేటాయిస్తున్న సర్కారుకు ఈ నిధుల రాకతో వెసులుబాటు కలుగనుంది. ఈ నేపథ్యంలో 2020–21లో గ్రామ పంచాయతీలకు రూ.1,393.93 కోట్ల ఆర్థిక సంఘం నిధులను అందించనుంది. గతేడాది కేవలం రూ.819.44 కోట్లు కేటాయించగా.. ఈ సారి అదనంగా రూ.574.49 కోట్లు పెంచింది. వడ్డీలేని రుణాల్లో కోత డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ రుణాలకు స్వల్పంగా కోత పెట్టింది. గతేడాది రూ.680.49 కోట్లు కేటాయించగా.. ఈ సారి 679.23 కోట్లు ప్రతిపాదించింది. అలాగే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో జరిగే పనులకు రూ.54 కోట్లు కేటాయించింది. 2019–20తో పోలిస్తే రూ.13 కోట్లు అదనం. శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద రూ.15.09 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కంటే రూ.11 కోట్లు అధికం. -
వెరిఫికేషన్‌కు హాజరుకాలేని వారికి రెండో చాన్స్
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కాల్ లెటర్లో పేర్కొన్న తేదీల్లో వివిధ కారణాలతో వెరిఫికేషన్‌కు హాజరు కాలేకపోయినా, హాజరైనా అన్ని ఒరిజనల్స్ చూపలేకపోయినా.. వారికి రెండో ఛాన్స్ ఇవ్వాలని పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ జిల్లా సెలక్షన్ కమిటీలను ఆదేశించారు. రాత పరీక్షల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఆయా జిల్లాల్లో భర్తీ చేసే పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీలు షార్ట్ లిస్టు జాబితాలు తయారు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. శనివారం శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలతో పాటు మరో రెండు మూడు జిల్లాల్లో షార్టు లిస్టులు విడుదల చేసి, ఎంపికైన అభ్యర్థుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్, ఈ మెయిల్ పద్ధతిలో సమాచారం పంపే కార్యక్రమం మొదలు పెట్టినట్లు తెలిపారు. షార్ట్ లిస్టులో పేరున్న వారు వారి కాల్ లెటర్‌ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ఈ నెల 23, 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏ అభ్యర్థి ఏ రోజు, ఏ ప్రాంతంలో వెరిఫికేషన్‌కు హాజరు కావాలన్నది అభ్యర్థికి పంపే సమాచారంలోనే ఉంటుందని అధికారులు తెలిపారు. వివిధ కారణాలతో నిర్ణీత సమయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు çహాజరు కాని వారికి మరో అవకాశం ఇవ్వనున్నారు. అక్టోబరు 2వ తేదీ లోపే ఈ కార్యక్రమం పూర్తి చేయాలని జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. కాగా, షార్ట్ లిస్టుల తయారీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కార్యక్రమంపై శనివారం పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ జిల్లా సెలక్షన్ కమిటీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. అక్టోబరు 14 నుంచి రెండో విడత శిక్షణ ఎంపికైన వారందరికీ 29వ తేదీలోగా నియామక పత్రాలు అందజేసి, మొదటి విడతలో రెండు రోజులు ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారు. అక్టోబర్ 2న విధుల్లో చేరిన అనంతరం.. అక్టోబరు 14 నుంచి నవంబరు 15 తేదీల మధ్య ఉద్యోగులకు దశల వారీగా రెండో విడత శిక్షణ ఇస్తారు. ఇందు కోసం ఈ నెల 26వ తేదీ నుంచి మాస్టర్ ట్రైనర్స్‌కు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. 33 శాతం ఉద్యోగాలు మహిళలకు.. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో 33 శాతం పోస్టులు మహిళలకు దక్కేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ప్రతిభ మేరకు మహిళలకు అన్ని కేటగిరీల్లోనూ నిర్ణీత సంఖ్యలో మహిళలకు పోస్టులు రాని పరిస్థితుల్లో వారికి ప్రత్యేకంగా మూడో వంతు పోస్టులు వచ్చేలా అవకాశం కల్పిస్తారు. సర్టిఫికెట్ల జారీలో ఇబ్బందులు పెట్టకుండా ఆదేశాలు ఉద్యోగాలకు ఎంపికైన వారికి అవసరమైన సర్టిఫికెట్లను తహసీల్దార్లు వెంటనే జారీ చేసేలా జిల్లా కలెక్టర్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బీసీ అభ్యర్థులు తాజాగా క్రిమిలేయర్ సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉందని, వాటితో పాటు అవసరమైన వారికి నివాసిత, కుల ధ్రువీకరణ పత్రాలు జారీలో ఎలాంటి ఇబ్బందులు రానీయవద్దని సూచించింది. వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు అధికారులకు చూపాల్సిన సర్టిఫికెట్ల వివరాలు.. అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అనంతరం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న పత్రం. ఎస్ఎస్సీ సర్టిఫికెట్ లేదా అధికారుల నుంచి తీసుకున్న పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం. ఒరిజనల్ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు. నాలుగో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఎక్కడ చదివారన్న వివరాలతో స్టడీ సర్టిఫికెట్లు. స్కూలు, కాలేజీల్లో చదవకుండా డైరెక్ట్ డిగ్రీ వంటి కోర్సులు చేసిన వారి నివాస ధ్రువీకరణ పత్రం. రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ నోటిఫికేషన్ మేరకు తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి స్థానికత మార్చుకున్నప్పుడు సంబంధిత అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్. చెవిటి, మూగ వైకల్యంతో ప్రత్యేక స్కూళ్లలో చదువుకున్న వారు.. వారి తల్లిదండ్రుల నివాసిత ధ్రువీకరణ పత్రం. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం. బీసీ అభ్యర్థులు తాజాగా తహసీల్దార్ జారీ చేసిన నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్. దివ్యాంగ అభ్యర్థులు సదరం క్యాంపుల ద్వారా పొందిన మెడికల్ సర్టిఫికెట్. ఎక్స్ సర్వీస్‌మెన్, ఎన్సీసీ, క్రీడల కోటా అభ్యర్థుల సంబంధిత సర్టిఫికెట్లు. ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ వెయిటేజీ పొంది.. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారు తమ శాఖాధిపతి నుంచి పొందిన ఇన్ సర్వీసు సర్టిఫికెట్. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీ. దీనికి సంబంధించిన నిర్ణీత ఫార్మాట్‌ను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. -
చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇంటికే..
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ చట్టానికి ప్రభుత్వం పదునుపెడుతోంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏకంగా పాలకవర్గాలనే రద్దు చేసేలా తెలంగాణ మున్సిపల్ యాక్ట్–2019లో నిబంధనలను పొందుపరుస్తోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడినా, నిధులు పక్కదారి పట్టినా ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా పురపాలక చట్టంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ నెలాఖరులో ఈ చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ముసాయిదా ప్రతులను న్యాయశాఖ పరిశీలనకు పంపింది. న్యాయశాఖ సూచనలు, సలహాల అనంతరం ముసాయిదా చట్టం కేబినెట్ ఆమోదానికి వెళ్లనుంది. సమర్థంగా పనిచేయకపోతే... పట్టణాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే మున్సిపాలిటీల్లో అవినీతికి ముకుతాడు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే అక్రమాలకు పాల్పడే ప్రజాప్రతినిధులపై కొరడా ఝళిపించాలని, అవినీతికి పాల్పడ్డట్లు తేలితే పాలకవర్గాలను రద్దు చేయాలని నిర్దేశించారు. ఈ మేరకు కొత్త చట్టం రూపకల్పనపై కసరత్తు చేసిన నిపుణుల కమిటీ... సమర్థ పాలన అందించలేకపోయినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లినా సదరు మున్సిపాలిటీని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి కట్టబెడుతూ నూతన చట్టాన్ని రూపొందించింది. దీంతో పాలకవర్గం రద్దు కాగానే.. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు (వార్డు సభ్యులు), కో ఆప్షన్ సభ్యుల పదవి కూడా ఊడనుంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను కూడా చట్టసభల్లో ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా ఒకవేళ పాలకవర్గానికి ఆరు నెలల కంటే ఎక్కువ కాలపరిమితి ఉంటే రద్దయిన తేదీ నుంచి ఆరు నెలల్లో నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తారు. పాలకవర్గం స్థానంలో ప్రత్యేక అధికారిని నియమించి పాలన కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను దూరంగా ఉంచనుంది. పురపాలకశాఖ విచక్షణ మేరకు స్థానిక కమిషనర్ లేదా ఇతర అధికారులను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించేలా చట్టంలో పేర్కొంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆరేళ్లపాటు అనర్హత వేటు... నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదని తేలితే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను తొలగించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. చట్టంలోని నిబంధనలను పాటించకపోయినా, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించినా, నిధుల దుర్వినియోగానికి పాల్పడినా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను తొలగించే విధంగా చట్టం ఉండనుంది. అదేవిధంగా ఒకసారి ఉద్వాసనకు గురైన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు ఆ తేదీ నుంచి ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు కానున్నారు. వార్డుల హేతుబద్ధీకరణ! సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్న సర్కారు.. వార్డుల ఏర్పాటులో హేతుబద్ధత పాటించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 1,500 నుంచి 15 వేల వరకు వార్డులు ఉన్నాయి. అయితే నిర్దేశిత జనాభా ప్రాతిపదికన కాకుండా అడ్డగోలుగా విభజించడంతో అభివృద్ధిలో అసమానతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టంలో వార్డుల వర్గీకరణపైనా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జనాభాకు అనుగుణంగా కౌన్సిలర్ల సంఖ్యను ముసాయిదా చట్టంలో ప్రతిపాదించింది. -
మండలిలో రెండు బిల్లులు పాస్
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, వస్తు సేవల పన్ను సవరణ బిల్లులకు శాసనమండలి ఆమోదముద్ర వేసింది. సోమవారం మండలిలో పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసినందున.. దానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని భావించినా, ఆ అంశం న్యాయ పరిధిలో ఉన్నందున సాధ్యపడలేదని మంత్రి వివరణ ఇచ్చారు. బీసీలకు న్యాయం చేసింది కేసీఆర్ సర్కారేనని, వారి అభిమానంతోనే మరోసారి విజయం సాధించామన్నారు. బీసీలకు ఏదో చేసినట్లు మాట్లాడటం భావ్యం కాదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకపోవడం శోచనీయమని, మైనార్టీలు, బీసీలకు ఈ రిజర్వేషన్ల వల్ల అన్యాయం జరిగిందని వాపోయారు. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం మేరకు రిజర్వేషన్లు కల్పించినా.. మానవీయకోణంలో ఈ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిం చేందుకు ఉద్దేశించిన బీసీ(ఈ) వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ అంశాన్ని బిల్లులో ఎలా పొందుపరుస్తారని రామచంద్రరావు (బీజేపీ) ప్రశ్నించారు. 50 శాతం రిజర్వేషన్లలో వీటిని పరిగణనలోకి తీసుకోవడంపై సమీక్షించాలన్నారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు మజ్లిస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ జాఫ్రీ స్పష్టం చేశారు. జీఎస్టీ తగ్గింపుతో ఊరట రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితోనే వస్తు, సేవల పన్ను విధింపును కేంద్రం సరళీకరించిందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మండలిలో జీఎస్టీ–2019 బిల్లును మండలిలో ప్రవేశపెట్టారు. పన్ను ఎక్కువగా ఉంటే.. ఎగవేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందనే తమ వాదనను కేంద్రం అంగీకరించిందన్నారు. బీడీలపై 28 శాతం జీఎస్టీ వసూలు చేయడం సరికాదని, ధూమపానం చేసేవారి సంఖ్య ను తగ్గించేందుకే భారీగా పన్ను వడ్డించామనే కేం ద్రం వాదన అర్థరహితమన్నారు. ఉత్తర తెలంగాణ లో సుమారు 5 లక్షల మంది పేదలు బీడీ తయారీపై ఆధారపడి జీవిస్తున్నారని, బీడీలపై భారీ పన్ను వల్ల వారంతా రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందంటూ సభ్యుడు రాజేశ్వర్‌రావు అడిగిన ప్రశ్నకు ఈటల సమాధానమిచ్చారు. పెట్రోలియం, మద్యం అమ్మకాలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, తద్వారా ధరల నియంత్రణ సాధ్యపడుతుందని మజ్లిస్ ఎమ్మెల్సీ జాఫ్రీ అభిప్రాయపడ్డారు. జీఎస్టీతో పన్ను ఎగవేతదారుల సంఖ్య తగ్గిందని, భారీగా ఆదాయం సమకూరుతుందని బీజేపీ సభ్యుడు రామచంద్రరావు అన్నారు. జీఎస్టీ అంటే గబ్బర్‌సింగ్ టాక్స్ అని, రైతులు, చిన్న, మధ్యతరగతి ప్రజలపై గుదిబండగా మారిందని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్ బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. -
గ్రామసభే సుప్రీం
సాక్షి, హైదరాబాద్: గ్రామీణాభివృద్ధిలో గ్రామసభలు కీలకం కానున్నాయి. గతంలో కంటే భిన్నంగా కొత్త పంచాయతీరాజ్ చట్టంలో గ్రామసభలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. పారిశుధ్యం మొదలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష, గ్రామ సమస్యలతో పాటు వివిధ అంశాలపై గ్రామసభల్లో తీర్మానాలు ఆమోదించాల్సి ఉంటుంది. పల్లెల్లోని ప్రజల ఆచార, సంప్రదాయాలు, సాంస్కృతిక వైవిధ్యం, సామాజిక వనరుల పరిరక్షణ, ఆచార వ్యవహారాలకు సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తినపుడు వాటిని పరిష్కరించే అధికారం గ్రామసభకు ఉంటుంది. గ్రామాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల ఆమోదం, సామాజిక,ఆర్థిక, అభివృద్ధి కోసం ప్రణాళికలు,కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసేందుకు ముందస్తుగా గ్రామసభల అనుమతి పొందేలా చట్టంలో పొందుపరిచారు. వివిధ పథకాల కింద లబ్ధిదారుల ఎంపిక, పేదరిక నిర్మూలన, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో లబ్ధిదారుల గుర్తింపు, ఎంపికకు గ్రామసభే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వివిధ కార్యక్రమాల కోసం కేటాయించిన నిధుల వినియోగానికి సంబంధించిన సర్టిఫికెట్లు (యూసీ), వివిధ ప్రణాళికలు, కార్యక్రమాలు, ప్రాజెక్టు పరిమాణాలు, గ్రామస్థాయిలో వ్యయం చేసిన నిధులకు సంబంధించిన యూసీలను గ్రామసభల ద్వారానే పొందాల్సి ఉంటుంది. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం,షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఏదైనా ప్రాజెక్టు అమలుకు భూమి స్వాధీనం లేదా సంబంధిత ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే వారికి పునరావాసం కల్పించాల్సి వచ్చినా ముందుగా గ్రామసభ లేదా తగినపద్ధతుల్లో గ్రామపంచాయతీని తప్పనిసరిగా సంప్రదించేలా నూతనచట్టంలో ఏర్పాట్లు చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని చిన్నతరహా నీటివనరుల నిర్వహణ ప్రణాళికలకు, చిన్న తరహా ఖనిజాల తవ్వకాలకు గనుల లైసెన్స్‌లు లేదా లీజుకు ఇచ్చేందుకు గ్రామసభ లేదా సరైన స్థాయిలోని పంచాయతీ సిఫార్సులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. రెండునెలలకు ఒకసారి గ్రామసభ జరిగేలా, ఏడాదిలో మొత్తం ఆరు సభల్లో రెండింటిని మహిళలు, వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలో ఓటర్లుగా నమోదైన వారందరూ సభ్యులుగా గ్రామసభకు హాజరుకావొచ్చు. గ్రామసభలు సమీక్షించే అంశాలు పారిశుధ్యం కాపాడే చర్యలు.. ఘన,ద్రవరూప వ్యర్థాల నిర్వహణ, చెత్తా,చెదారాన్ని ఎరువుగామార్చడం వీధిదీపాల నిర్వహణ, గ్రామపంచాయతీలో వివిధ పథకాల కింద చెట్లునాటడం, వాటి నిర్వహణ కుటుంబ సంక్షేమం విద్య, ప్రజారోగ్యం, బాలకార్మికుల నిర్వహణ అంతర్గతరోడ్లు, వంతెనలు, కాల్వల నిర్వహణ పబ్లిక్ ప్రదేశాలు, కమ్యూనిటీహాళ్లు, పార్కుల వంటి సామాజిక ఆస్తుల నిర్వహణ సంతలు, పండుగలు, క్రీడలు, ఆటలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం గ్రామపంచాయతీ అమలుచేసే పథకాలు,అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలు రూపొందించి,ప్రాధాన్యతల నిర్ధారణ. సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రాధాన్యతా క్రమంలో అర్హులైన లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేసే బాధ్యత పంచాయతీల్లో వివిధ వర్గాల ప్రజల మధ్య మతసామరస్యం, సఖ్యత పెంపొందించేందుకు, స్థానిక ప్రజల మధ్య స్నేహసంబంధాలు అభివృద్ధి చెందేందుకు కళలు, క్రీడా సంబరాల నిర్వహణ పింఛన్లతో పాటు వివిధరకాల సంక్షేమ సహాయాలను ప్రభుత్వం నుంచి పొందేందుకు వ్యక్తుల స్క్రీనింగ్ వయోజన విద్య ప్రోత్సాహం, పబ్లిక్ ఆస్తుల పరిరక్షణ, నిర్వహణ బడ్జెట్ సంబంధ ఏర్పాట్లు, ఖర్చు చేసే ప్రణాళిక వివరాలు, అంశాల వారీగా నిధుల కేటాయింపు వివరాలు, పంచాయతీ ప్రాంతంలో చేసిన లేదా చేయబోయే పనులకు సంబంధించి సామగ్రి ఖర్చుల గురించి తెలుసుకునే హక్కు గ్రామసభకు ఉంటుంది. షెడ్యూల్డ్ ప్రాంత పంచాయతీల్లో... షెడ్యూల్డ్ ప్రాంత పంచాయతీలు/ గ్రామసభలకు మత్తు పదార్థాల వినియోగంపై నిషేధం లేదా మత్తు పదార్థాల అమ్మకం, వినియోగంపై నియంత్రణ లేదా క్రమబద్ధీకరించే అధికారాన్ని కొత్త పంచాయతీరాజ్ చట్టం కల్పించింది. చిన్నతరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్యహక్కులు, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూమి అన్యాక్రాంతం కాకుండా చూసే అధికారం, చట్టవిరుద్ధంగా అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారాన్ని కూడా కట్టబెట్టింది. గ్రామీణ మార్కెట్ (సంత) నిర్వహణ అధికారం, గిరిజన ప్రజలకు రుణం ఇస్తున్న సంస్థలు, వ్యక్తులపై నియంత్రణ అధికారాన్ని కూడా నూతన చట్టం కల్పించింది. -
రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించండి
హైదరాబాద్ : పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై రెండు, మూడు రోజుల్లో బీసీ న్యాయ నిపుణులు, మేధావులు, బీసీ, కుల సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలతో కలసి సమావేశం ఏర్పాటు చేసి శాశ్వతంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్ ఇండియా ఓబీసీ ఫెడరేషన్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అల్టిమేటం జారీ చేసింది. లేదంటే తెలంగాణ రాష్ట్ర సాధన స్ఫూర్తిగా బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, రాస్తారోకో వంటి కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నేతలు హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టుల్లో ప్రశ్నించకుండా 9 వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఓబీసీ ఫెడరేషన్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద గురువారం బీసీల మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అన్నారు. ఓబీసీ రిజర్వేషన్లు కేంద్రం, బీసీ రిజర్వేషన్లు రాష్ట్రం పరిధిలోనివని, బీసీ ముస్లిం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచి కేంద్ర ఆమోదానికి పంపడం బూటకమన్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి స్టేను పునరుద్ధరించాలని కోరారు. రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తాం: జాజుల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కుంపటి రాజుకుంటే రాయితీలు కాదని రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తామన్నారు. గతంలో ఉన్న పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకు వస్తున్నారని, బీసీలను రాజకీయంగా ఎదగకుండా చేసే కుట్రలో ఇది భాగమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఎవరితో చర్చించకుండా మొండిగా ముందుకు పోతే జైలుకు వెళ్లడానికి, అఖరికి చావడానికైనా సిద్ధమేనన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె .లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ బీసీలకు సంబంధించిన 31 అంశాలను గుర్తించి సీఎం కేసీఆర్‌కు నివేదిస్తే ఏడాది గడిచినా ఒక్క అంశాన్ని అమలు చేయలేదని, కేసీఆర్‌కు సామాజిక స్పృహలేదన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై కోర్టును సాకుగా చూపుతూ 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడం శోచనీయమన్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు వస్తే ఆ పార్టీలోని కేశవరావు, డి. శ్రీనివాస్ వంటి నేతలు నోరు మెదపక పోవడం శోచనీయమన్నారు.శాసనమండలి పక్ష నేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ కేసీఆర్ పిట్టలదొర అని, ఎప్పుడు ఏ మాట చెబుతారో ఆయనకే తెలియదని అన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా బీసీ రిజర్వేషన్ల పరిరక్షణకు పోరాడాలన్నారు. కార్యక్రమంలో సాంబశివరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, టీటీడీపీ నేతలు కూన వెంటేష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు జి.భరత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 23న భారీ ధర్నా: కృష్ణయ్య హైదరాబాద్: గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 23%కు తగ్గిస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల తగ్గింపు ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఈ నెల 23న భారీ ధర్నాను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యానగర్ బీసీ భవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత పాతికేళ్లుగా 34% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని, అప్పుడులేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. 34% రిజర్వేషన్ల ప్రకారమే... ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలను 34% రిజర్వేషన్ల ప్రకారమే జరపాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 34% నుంచి 56% వరకు పెంచాలని బీసీలు డిమాండ్ చేస్తుంటే కోర్టులు, ప్రభుత్వాలు రిజర్వేషన్లను 23%కి తగ్గించాలనుకోవడం దుర్మార్గమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కొత్తేమీ కాదని, ఈ తీర్పు ఇచ్చిన తరువాత కూడా 2013లో గ్రామపంచాయతీ ఎన్నికలు, 2014లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించారని వివరించారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, జైపాల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీలో 50శాతం రిజర్వేషన్లు పెంచండి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్‌లో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బహిరంగలేఖ రాశారు. బీసీ జనాభా 56 శాతానికిపైగా ఉంటే రిజర్వేషన్ల ఫలాలు, సంక్షేమ పథకాలు, బడ్జెట్లో నిధులు మాత్రం దామాషా పద్ధతిలో అందడం లేదని దీంతో బీసీలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వారి అభ్యున్నతికి అవరోధంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు. 2011లో యూపీఏ ప్రభుత్వం కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సకలజనుల సర్వే ద్వారా జనాభా లెక్కలు సేకరించినప్పటికీ వాటిని ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదన్నారు. 1932లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మాత్రమే జనాభా లెక్కలు కులాల వారీగా సేకరించిందని, ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదని గుర్తు చేశారు. -
ఊరూరా నర్సరీ ఏర్పాటు చేయాలి: జూపల్లి
సాక్షి, హైదరాబాద్ : పంచాయతీరాజ్ కొత్త చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణా రావు అధికారులకు వివరించారు. నర్సరీల ఏర్పాటు దిశగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. హరితహారం, ఎల్ఈడీ వీధిదీపాల ఏర్పాటుపై జూపల్లి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహిం చారు. జూన్ 10లోగా నర్సరీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని, జూలై 15 నాటికి నర్సరీల ఏర్పాటు పూర్తి కావాలని అన్నారు. దాదాపు మూడు వేలకు పైగా గ్రామాల్లో నర్సరీలున్నాయని, మిగిలిన గ్రామాల్లోనూ వెంటనే భూములను సేకరించి నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నర్సరీల నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలకే అప్పగించాలని జూపల్లి అధికారులకు సూచించారు. -
తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో కీలక మార్పులు
-
ఎన్నికలంటే కాంగ్రెస్‌కు భయం: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నికలకు భయపడే శాసన సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్ కోర్టుకు వెళ్లిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఆయన బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలకు ఎన్నికలంటే భయం లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. మళ్లీ గెలుస్తామనే నమ్మకం ఉంటే కాంగ్రెస్ ప్రజా తీర్పును కోరాలని సూచించారు. ప్రజాతీర్పుకు వెళ్లకుండా కోర్టును ఆశ్రయించారంటే కాంగ్రెస్ ఓటమిని అంగికరించినట్లేనని జూపల్లి ఎద్దేవా చేశారు. ఈ అసెంబ్లీ సమావేశంలోనే పంచాయతీ రాజ్ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన తెలిపారు. -
పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ
- పీఆర్ డిప్లొమా ఇంజినీర్ల ఆవేదన - సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నపం కర్నూలు(అర్బన్): డిప్లొమా ఇంజినీర్లు ఏఈలుగా సర్వీసులో చేసి అదే పోస్టులో పదవీ విమరణ చేయాల్సిన దౌర్భాగ్యస్థితిలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కే రవీంద్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే మోహన్, జీఎస్ గౌస్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్‌లోని పీఆర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మొత్తం 489 డిప్యూటీ ఈఈ పోస్టుల్లో 1:3 నిష్పత్తి ప్రకారం డిప్లొమా ఇంజినీర్లు 122 మంది ఉండాలన్నారు. ప్రస్తుతం 48 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. ఈఈ ప్రమోషన్ చానల్‌ను కూడా ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించిందన్నారు. 58 ఈఈ పోస్టుల్లో 1:3 నిష్పత్తి ప్రకారం 14 మంది డిప్లొమా ఈఈలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఒక్కరు కూడా లేక పోవడం దారుణమన్నారు. అనేక మంది ఏఈలకు సీనియారిటీ జాబితా లేదని, సర్వీస్ రెగ్యులరైజేషన్, ప్రొబేషన్, అటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేళ్ళ వర్తింపు, టీఏ బిల్లులు నెలనెలా రాకపోవడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. విజయవాడలో 40వ వార్షికోత్సవం... ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు విజయవాడలోని బెంజి సర్కిల్ జ్యోతి కన్వెన్షన్‌లో సంఘం 40వ వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. సమావేశంలో జిల్లా నాయకులు జిలానీబాషా, మాధవ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పీఆర్ ఇంజనీర్లపై ఒత్తిడి తగ్గాలి
గూడూరు : పంచాయతీరాజ్ ఇంజనీర్లపై ఆయా జిల్లాల కలెక్టర్ల ఒత్తిళ్లు తగ్గాలని పంచాయతీరాజ్ డిప్లొమో ఇంజనీర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ రియాజ్ అహ్మద్ కోరారు. పట్టణంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో ఆదివారం పీఆర్ డిప్లొమా ఇంజనీర్ల సర్వసభ్య సమావేశం జరిగింది. రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ముఖ్యంగా క్షేత్రస్థాయి పీఆర్ అధికారులకు బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఈ నెల 27వ తేదీన జిల్లా, డివిజన్ కేంద్రాల్లో జేఏసీ తలపెట్టిన ధర్నాలను జయప్రదం చేయాలని కోరారు. సమస్యలను రెండేళ్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నా హామీలు ఇస్తోందే గానీ, సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఇంకా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, అసోసియేట్ అధ్యక్షుడు కృష్ణమూర్తి మాట్లాడారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్‌రావు, జిల్లా అధ్యక్షుడు సయ్యద్ మున్వర్, గూడూరు డివిజన్ ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి మధులు పాల్గొన్నారు. -
డైరెక్టర్ అనితారామచంద్రన్ పర్యటన రద్దు
మూడు గంటలపాటు ఎదురుచూపులు మెుక్కలు నాటిన నాయకులు, అధికారులు సారంగాపూర్ : రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ అనితారామచంద్రన్ పర్యటన శనివారం రద్దయింది. దీంతో చేసేది లేక స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా మండలంలోని ధని–గోపాల్పేట్ రహదారి వెంట మొక్కలు నాటడానికి శనివారం అనితారామచంద్రన్ వస్తున్నారని స్థానిక అధికారులు, నాయకులకు సమాచారం అందింది. రోడ్డుకు ఇరువైపులా ఒకే సమయంలో మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం 11గంటలకు సమయం కేటాయించిన కమిషనర్ మధ్యాహ్నం రెండు గంటల వరకు రాలేదు. అప్పటి వరకు వేచి చూశారు. మధ్యాహ్నం సమయంలో హరితహారం కార్యక్రమంపై సమావేశం ఉండడంతో కమిషనర్ ధని గ్రామానికి రావడం లేదని సమాచారం అందింది. దీంతో చేసేదిలేక స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రాజ్‌మహ్మద్, ఆలూరు పీఏసీఎస్ అధ్యక్షుడు ఆయిటి రమేష్, సర్పంచ్ తుల లక్ష్మి ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. మండల ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, మండల ప్రత్యేకాధికారి రాంకిషన్‌నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు గంగారెడ్డి, దేవీశంకర్, పూజారి శ్రీనివాస్, తహసీల్దార్ శ్యామ్‌సుందర్, ఎంపీడీఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘పంచాయతీరాజ్’కు నిధులు పెంచండి
- ఆర్థిక శాఖకు మంత్రి కేటీఆర్ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీ రాజ్ విభాగానికి భారీగా నిధులు కేటాయించాలని ఆ శాఖ మంత్రి కేటీఆర్ ఆర్థిక శాఖకు విన్నవించారు. ఈ మేరకు శనివారం పలు ప్రతిపాదనలను ఆర్ధిక మంత్రికి, ప్రణాళికా సంఘ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ వివరించారు. గ్రామాల్లోని పంచాయతీ రహదారుల విస్తరణ, కొత్త వాటి నిర్మాణం, మరమ్మతు పనులకు రూ.5,470 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వివిధ వర్గాలకు చెందిన 30 లక్షల మందికి ‘ఆసరా’ పింఛను ద్వారా భరోసా కల్పిస్తున్నామన్నారు. దీనికోసం రూ.4.9 వేల కోట్లు అవసరమవుతాయని వివరించారు. బీడీ కార్మికులకు మార్చి 1 నుంచి పింఛను వర్తింపజేయాలని నిర్ణయించినందున మరో రూ.400 కోట్లు కేటాయించాలన్నారు. పల్లె ప్రగతికి 100 కోట్లు: ‘తెలంగాణ పల్లె ప్రగతి’ ద్వారా ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టనున్న కార్యక్రమాలకు ప్రభుత్వ వాటా కింద రూ.100 కోట్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కోరారు. పల్లెల్లో జీవనోపాధి పెంపు, వ్యవసాయంలో లాభ సాటి పద్ధతులు, గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న గ్రామ సేవా కేంద్రాల గురించి ఆర్థికశాఖ, ప్రణాళికా సంఘం ప్రతినిధులకు మంత్రి వివరించారు. శ్రీ రామానంద తీర్థ శిక్షణ సంస్థ (నల్లగొండ) స్థాయిని పెంచేందుకు రూ.3 కోట్లు కేటాయించాలని కోరారు. ‘సెర్ప్’కు ప్రస్తుతం ఇస్తున్న నిధులను రెట్టింపు చేయాలని ప్రతిపాదించారు. ‘ఉపాధిహామీ’ కింద గిడ్డంగుల నిర్మాణం, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు, హరిత హారం తదితర శాశ్వత ఆస్తుల కల్పనకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని కోరారు. వాటర్‌గ్రిడ్‌కు 6 వేల కోట్లు: తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును మూడేళ్లలోగా పూర్తి చేయాల్సి ఉన్నందున, రానున్న బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించాలని కేటీఆర్ ప్రతిపాదించారు. దీనికి నిధుల కొరత లేకుండా చూస్తామని ఆర్థిక మంత్రి ఈటెల ఆయనకు హామీ ఇచ్చారు. వేసవిలో తాగునీటి ప్రణాళికలకు రూ.150 కోట్లు కావాలని కేటీఆర్ కోరారు. ఐటీ అభివృద్ధికి 250 కోట్లు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు రూ.250 కోట్లు అవసరమని కేటీఆర్ ప్రతిపాదనలను సమర్పించారు. మౌలికవసతుల ఏర్పాటుకు రూ.150 కోట్లు, టాస్క్ కోసం రూ.9 కోట్లు, సాప్‌నెట్ కోసం రూ.4 కోట్లు, ఈ-సేవా కింద రూ.రెండు కోట్లు, ఈ- గవర్నెన్స్ కోసం రూ.30 కోట్లు కావాలని మంత్రి తన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. -
బడా నేతల భూములకు సర్కారు నిధులతో రోడ్డు
శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: చిత్రంలో కనిపిస్తున్న దారి కోసం అధికారులు రూ. 40 లక్షలతో పనులు చేపట్టారు.. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా..? కేవలం నాలుగు ఇళ్లు ఉండి స్థానికంగా ఒక్కరు కూడా నివాసంలేని గ్రామం కోసం రోడ్డు వేస్తున్నారు.. పోనీ ఎవరైనా రోడ్డు కోసం అడిగారా అంటే అదీ లేదు.. పనులు చేపట్టిన శాఖ నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు.. మరి నిధులు ఎలా మంజూరయ్యాయంటే ప్రభుత్వం నుంచి వచ్చాయి అంటూ అధికారుల నుంచి సమాధానం.. అసలు సంగతి ఏమిటంటే.. రోడ్డుకు ఇరువైపులా బడానాయకుల భూములున్నాయి.. ఇంకేముంది వారు తమ పరపతిని ఉపయోగించి నిధులు మంజూరు చేయించుకున్నారు.. చిన్న, సన్నకారు రైతుల పొలాల్లోంచి రోడ్డు ఏర్పాటు చేస్తుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మండలంలోని కవ్వగూడ రోడ్డు నుంచి కొత్వాల్‌గూడ వరకు రోడ్డు ఫార్మేషన్ కోసం పంచాయతీ రాజ్ శాఖ నుంచి జిల్లా పరిషత్ అధికారులు రూ.40 లక్షలు మంజూరు చేశారు. ఈ రోడ్డును మర్లగూడ నుంచి ఏర్పాటు చేస్తున్నారు. కవ్వగూడ అనుబంధంగా ఉన్న మర్లగూడలో కేవలం నాలుగు ఇళ్లు ఉన్నాయి. ఇందులో రెండు ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. అక్కడ కొన్నేళ్లుగా ఒక్కరు కూడా నివసించడంలేదు. ఈ గ్రామం మీదుగా కొత్వాల్‌గూడ వరకు 4.5 కి.మీ. దూరం మేరకు ఫార్మేషన్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు మధ్యలో ఓ చోట కల్వర్టు కూడా నిర్మించనున్నారు. ఆగస్ట్‌లో నిధులు మంజూరు కాగా వారం రోజులుగా పనులు కొనసాగుతున్నాయి. రైతుల ఆందోళన.. రోడ్డుకిరువైపలా సన్న, చిన్నకారు రైతులు పంటల సాగుతో ఉపాధి పొందుతున్నారు. అధికారులు రోడ్డును 22 అడుగుల వెడల్పుతో ఇరుపక్కలా ఉన్న పొలాల్లోంచి రోడ్లు వేస్తున్నారు. రైతులకు ముందస్తు సమాచారం గానీ, వారి నుంచి అనుమతి గానీ లేకుండానే పనులు మొదలుపెట్టారు. అడ్డు చెబితే మధ్యవర్తుల ద్వారా రైతులను బెదిరించి దారికి తెచ్చుకుంటున్నారు. ఉన్న కొద్ది పాటి పొలం రోడ్డులో పోతే తమకు జరిగే నష్టాన్ని ఎవరు భరిస్తారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ దారి వెంట కొంతమంది బడా నేతల భూములు ఉండడంతో వారి కోసమే రోడ్డు వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ దారి పనులను అధికారులు సైతం ఆగమేఘాల మీద కొనసాగిస్తున్నారు. కవ్వగూడ దారి నుంచి మర్లగూడ వరకు ఫార్మేషన్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి కొత్వాల్‌గూడ వరకు రోడ్డు వేయడానికి రైతులు అభ్యంతరాలు తెలుపుతుండడంతో మధ్యవర్తులు చర్చలు జరుపుతున్నారు. గతంలో వేసిన రోడ్డు ఏమైంది.. సుమారు పదేళ్ల కిందట కవ్వగూడ రోడ్డు నుంచి మర్లగూడ వరకు ఫార్మేషన్ పనులు చేశారు. సుమారు రెండు కిలో మీటర్ల దూర వరకు కంకర కూడా వేశారు. ఈ పనులు ఏ నిధులతో చేపట్టారో అధికారుల వద్ద సమాధానం లేదు. ఒకసారి ఫార్మేషన్ చేసిన రోడ్డుకు మరోసారి ఫార్మేషన్ పేరుతో నిధులు మంజూరు చేయడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యాలు లేక అవస్థలు పడుతుంటే ఇక్కడ బడా బాబుల భూములకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా కవ్వగూడ దారి నుంచి కొద్ది దూరం వరకు పట్టా భూమిలో గతంలో వేసిన కంకర రోడ్డును కాదని మరో పక్క నుంచి కొత్తగా ఫార్మేషన్ పనులు చేపట్టంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు వద్దంటే పనులు ఆపేస్తాం: శ్రీనివాస్‌రెడ్డి, డీఈ, పంచాయతీరాజ్ శాఖ రోడ్డు ఏర్పాటుకు కావాల్సిన స్థలం కోసం పంచాయతీ రాజ్ శాఖ నుంచి రైతులకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వడం కుదరదని డీఈ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతులు అభ్యంతరం చెబితే పనులు ఆపేస్తామన్నారు. గతంలో జరిగిన పనుల వివరాలు తమ వద్ద లేవన్నారు. గతంలో ఉన్న రోడ్డు తక్కువ ఎత్తులో ఉండడంతో ఫార్మేషన్ పనులు మళ్లీ చేపట్టినట్లు ఆయన తెలిపారు.