![Central Rural And Panchayat Raj Secretary Enjoined Collectors - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/29/Cr.jpg.webp?itok=-a6zoogz)
సాక్షి, హైదరాబాద్: మానవాళికి పెనుసవాల్‌గా పరిణమించిన కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర గ్రామీణ, పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శులు రాజేశ్ భూషణ్, సునీల్‌కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కరోనా నియంత్రణలో గ్రామ పంచాయతీల పాత్ర కీలకమని, ఇందులో పంచాయతీరాజ్ వ్యవస్థలోని మూడంచెల ప్రజాప్రతినిధులు, అన్ని విభాగాల ప్రతినిధులను భాగస్వా మ్యం చేయాలని సూచించారు. లాక్‌డౌన్ రోజుల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలన్నారు.
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని.. కూరగాయలు, పాల దుకాణాలు, షాపులు, బ్యాంకులు, ఏటీఎంలు, పెట్రోలు పంపులు, వంట గ్యాస్ కేంద్రాల్లో సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామా ల్లో కొత్తవారెవరైనా వచ్చి నా, విదేశాల నుంచి పౌరు లు వచ్చినా తక్షణమే ఆ సమాచారాన్ని స్థానిక పాలనా వ్యవస్థతో పంచుకోవాలని సూచించారు. కరోనా వైరస్ లక్షణాలతోబాధపడుతున్నట్లు గుర్తిస్తే వెంట నే ఆస్పత్రులకు లేదా స్వీయ నిర్బంధం చేయాలన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment