సాక్షి, హైదరాబాద్ : పంచాయతీరాజ్ కొత్త చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణా రావు అధికారులకు వివరించారు. నర్సరీల ఏర్పాటు దిశగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. హరితహారం, ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటుపై జూపల్లి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహిం చారు. జూన్ 10లోగా నర్సరీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని, జూలై 15 నాటికి నర్సరీల ఏర్పాటు పూర్తి కావాలని అన్నారు. దాదాపు మూడు వేలకు పైగా గ్రామాల్లో నర్సరీలున్నాయని, మిగిలిన గ్రామాల్లోనూ వెంటనే భూములను సేకరించి నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నర్సరీల నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలకే అప్పగించాలని జూపల్లి అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment