సాక్షి, హైదరాబాద్: శుద్ధి చేసిన మంచి నీరందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిం దంటూ కేంద్రం ప్రశంసించినందుకు ధన్యవాదాలని.. ప్రశంసలతో పాటు నిధులు కూడా ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు రాష్ట్రంలో మిషన్ భగీరథ అమలుకు వెంటనే రూ.19 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.
కేంద్ర జలశక్తి, పీఆర్ శాఖలు, ఎన్‌ఐఆర్‌డీ, యూని సెఫ్‌ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ వాటర్ శానిటేషన్ హైజిన్ కాంక్లేవ్–2022 సదస్సులో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇంటింటికీ శుద్ధి చేసిన మంచి నీరందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని ప్రశంసించారు. కేంద్రమంత్రి ప్రశంసలకు రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందిస్తూ ధన్యవా దాలు తెలిపారు. మిషన్ భగీరథ కింద రాష్ట్రం లోని 100 శాతం గ్రామీణ ఆవాసాలకు తాగు నీటి సౌకర్యం కల్పించామన్నారు. ఇంటింటికీ నల్లా పథకంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment