సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై ఫైర్ అయ్యారు. ‘ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంట్లో పడుకున్నపుడు నేను ఉద్యమం చేశాను. ఒక్కరోజు పోలీసు భద్రత లేకుండా వరంగల్లో తిరిగే ధైర్యం ఎర్రబెల్లికి ఉందా ? వరంగల్ జిల్లాలో జరుగుతున్న ఘటనలపై పోలీసులు మౌనంగా ఉండటం మంచి పద్ధతి కాదు’ అని అన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ రాముడిని అవమానించిన ఎమ్మెల్యేలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నాం. రేపు అన్ని మండల కేంద్రాల్లో నల్ల గుడ్డలతో మౌన నిరసన ప్రదర్శన చేయాలని పిలుపునిచ్చాం. రాముని ఫొటోతో ర్యాలీలు చేస్తాం. (ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. కేటీఆర్ ఆగ్రహం )
వరంగల్‌లో మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలి. రామాలయం నిర్మాణం లెక్కలు చెప్పడానికి మేం సిద్ధంగా ఉన్నాం. భద్రాద్రి ఆలయానికి రావాలని సవాల్. రామాలయ నిర్మాణంపై సీఎం కేసీఆర్ అభిప్రాయం ఏంటి ? బీజేపీ నాయకులుగా మేం ఎవరు ర్యాలీలో పాల్గొనడం లేదు.. హిందువులుగా పాల్గొంటున్నాము. తెలంగాణ కిష్కింధ కాండగా మారాలనుకుంటే అది టీఆర్‌ఎస్ విజ్ఞతకే వదిలేస్తున్నాం’’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment