జమ్మూకాశ్మీర్: సమాచార హక్కు చట్టం ద్వారా తమ అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాడనే నెపంతో ఓ 62 ఏళ్ల వృద్ధుడిపై కొందరు ప్రబుద్ధులు విచక్షణా రహితంగా దాడి చేశారు. కిందపడుతున్న సమయంలో చేయందించి ఊతంగా నిలవాల్సిన వారు కిందపడేసి ఈడ్చి కొట్టారు. అనంతరం ఓ కాలువలో పడేశారు. ఈ దారుణ ఘటన జమ్మూకాశ్మీర్లో బుద్గాంలో చోటుచేసుకుంది.
పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు బుద్గాం ప్రాంతంలోని నిరాశ్రయులకు ప్రభుత్వం తరుపున వస్తువులు ఏ విధంగా పంపిణీ చేశారు, ఎలా పంపిణీ చేశారు, అసలు పంపిణీ సక్రమంగా చేశారా లేదా అనే వివరాలు తెలుసుకునేందుకు ఓ 62 ఏళ్ల పెద్దాయన సమాచార హక్కు చట్టం ద్వారా పిటిషన్ పెట్టుకున్నాడు.
అయితే, ఆయన అనుమానం ప్రకారం ఉచిత వస్తువుల పంపిణీ విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాలు ఒక్కొక్కటిగా ఇప్పుడే బయటపెడదాం అనుకుంటున్న సమయంలో ఆ అక్రమాలకు పాల్పడిన గ్రామపెద్ద అతడి మనుషులు కలిసి ముసలాయనను దారుణంగా కొట్టి కాలువలో పడేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వృద్ధుడు అక్రమాలు బయటపెడుతున్నాడని..
Published Wed, Jul 15 2015 3:38 PM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM
Advertisement
Advertisement