ట్విట్టర్పై మండిపడుతున్నభారతీయులు | Twitter shows Jammu in Pakistan, Jammu & Kashmir in China | Sakshi
Sakshi News home page

ట్విట్టర్పై మండిపడుతున్నభారతీయులు

Published Wed, Feb 17 2016 8:25 PM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

ట్విట్టర్పై మండిపడుతున్నభారతీయులు

ట్విట్టర్పై మండిపడుతున్నభారతీయులు

భారత్లోని కొంత భాగాన్ని పాకిస్థాన్, మరి కొంత భాగాన్ని చైనాలో ఉన్నట్టు ట్విట్టర్ చూపిస్తోంది.

భారత్లోని కొంత భాగాన్ని పాకిస్థాన్, మరి కొంత భాగాన్ని చైనాలో ఉన్నట్టు ట్విట్టర్ చూపిస్తోంది. దీంతో ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జమ్మూను పాకిస్తాన్లో, జమ్మూ అండ్ కశ్మీర్ను చైనా దేశంలో ఉన్నట్టు ట్విట్టర్లో కనిపిస్తున్నాయి.

లొకేషన్ సర్వీస్ను ఉపయోగించే సమయంలో జమ్మూ అని టైప్ చేస్తే పక్కన పాకిస్తాన్ అని, జమ్మూ అండ్ కశ్మీర్ అని టైప్ చేస్తే రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పక్కన చూపెడుతోంది. లొకేషన్ సర్వీస్ను యూజర్స్ తమ ట్విట్లతోపాటూ తమ లొకేషన్ను కూడా టాగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. జీపీఎస్ ద్వారా గానీ లేక మాన్యువల్గా టైప్ చేసి గానీ ఈ సర్వీస్ను యూజర్స్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే లొకేషన్ బార్లో జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలను టైప్ చేస్తే పాకిస్తాన్, చైనా దేశాల పేర్లు రావడంతో యూజర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 2013లో గూగుల్ కూడా ఇలాంటి తప్పిదమే చేసి భారత్ నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకతను చవి చూసింది. అప్పుడు అరుణాచల్ ప్రదేశ్ను చైనాలో ఉన్నట్టు గూగుల్ చూపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement